Home Unknown facts తిరుమల తిరుపతిలో మూలవిరాట్టు శ్రీ మహావిష్ణువు కాదని చెప్పడం వెనుక కారణం ఏంటి?

తిరుమల తిరుపతిలో మూలవిరాట్టు శ్రీ మహావిష్ణువు కాదని చెప్పడం వెనుక కారణం ఏంటి?

0

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే ధనిక ఆలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఏడూ కొండల్లో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇది ఇలా ఉంటె పూర్వం తిరుమలలో కొలువై ఉన్న స్వామి శ్రీమహావిష్ణువు కాదని, శివుడు అని కొందరు, సుబ్రమణ్యస్వామి అని కొందరు, పార్వతీదేవి అని మరికొందరు చాలా భిన్నరకాలుగా వాదించారు. మరి వారు ఇక్కడ ఉన్న మూలవిరాట్టు శ్రీ మహావిష్ణువు కాదని చెప్పడం వెనుక కారణం ఏంటి? వారి అపోహలో నిజం ఎంతనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Tirupathi Lord Venkateswara

తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారు స్వయంభువుగా సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించి నిలచిన ప్రాంతమే గర్భాలయం. దీనినే ఆనంద నిలయం అని అంటారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంతోషానికి గుర్తుగా గర్భగుడికి ఆనంద నిలయం అని నామకరణం చేశారు. ఆనంద నిలయ నిర్మాణం ఇందుకు తగ్గట్టుగానే ఉంటుంది. 12 వందల ఏళ్ళకుపైగా చరిత్ర కలిగిన ఆనంద నిలయం అణువణువు అబ్బురపరిచే నిర్మాణమే. నాటి కట్టడాల శిల్పసౌందర్యానికి నిలువెత్తు నిదర్శనం. మూడు అంతస్తులు కలిగిన ఈ కట్టడంలో ఎన్నో శిల్పాలు కొలువుదీరాయి.

ఇక తిరుమలలో గర్భాలయంలో ఉన్న మూలవిరాట్టుని ధ్రువబేరం అని అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేదని అర్ధం. ధృవబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. అయితే ఈ మూలమూర్తి మొత్తం ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ స్వామివారి విగ్రహం పక్కన భూదేవి, శ్రీదేవి విగ్రహాలు ఉండవు. స్వామివారి వక్షస్థలం కుడిభాగంలో లక్ష్మీదేవి రూపం ఉంటుంది. ఇక స్వామివారు చతుర్భుజాలు కలిగి ఉండగా, పై కెత్తిన కుడిచేతిలోనున్న సుదర్శన చక్రము, ఎడమచేతిలోనున్న పాంచజన్య శంఖము విగ్రహంలో భాగాలు కావు. అదనంగా స్వామివారి చేతులలో ఉంచిన అలంకారాయుధాలు. ఇక దిగువన ఉన్న రెండు చేతులలో కుడి చేతిలో వరద హస్తము, ఎడమచేయి కట్యావలంబిత ముద్రలో ఉంటుంది.

ఇక విషయంలోకి వెళితే, 11 వ శతాబ్దంలో తిరుమలలో ఉన్న ధ్రువబేరం ఎవరిది అనే విషయంలో భిన్న వాదనలు వినిపించాయి. అయితే ఏ దేవత విషయంలో ఎలాంటి వాదనలు ఉన్నాయనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం.

శివుడు:

తిరుమలలో ధ్రువబేరాన్ని శివుడిగా భావించడానికి ముఖ్య కారణాలు, కేశాలు ఉండటం, ధనుర్మాసంలో నెలరోజుల పాటు బిల్వపత్ర పూజలు చేయడం. అంతేకాకుండా విగ్రహం పైన నాగాభరణాలు కూడా ఉన్నాయనే వాదన వినిపించారు.

కుమారస్వామి:

వామన పురాణం ప్రకారం, రాక్షసుడిని సంహరించిన కుమారస్వామి బ్రహ్మ హత్య పాతకం పోగొట్టుకునేందుకు ఇక్కడ తపస్సు చేసాడని చెబుతారు. ఇక ఆలయ పక్కన ఉన్న స్వామి పుష్కరిణికి ఆ పేరు రావడం సుబ్రమణ్యస్వామి ఏ అని చెబుతారు.

పార్వతీదేవి:

తిరుమల మూలవిరాట్టును శక్తి రూపంగా కూడా భావించారు. ఎందుకంటే కేశాలు ఉండటం, ప్రతి శుక్రవారం పసుపుతో అర్చించడం, ధ్రువబేరానికి చీరని కట్టడం వంటివి చెప్పారు. ఇంకా ఆలయ ప్రకారం పైన సింహాలు ఉన్నాయి. సింహాలు శక్తి పీఠం పైనే ఉంటాయని కొందరు వాదించారు.

అంతేకాకుండా 11 వ శతాబ్దం వరకు మూలవిరాట్టుకు శంఖు చక్రాలు అనేవి లేవు. విష్ణుమూర్తి విగ్రహమే అయి ఉంటె మూలవిరాట్టుకు శంఖు చక్రాలు ఉండాలి కదా అనే వాదన జరిగింది.

ఇలా ఎన్నో వాదనలు పూర్వం తలెత్తగా రామానుజాచార్యులు వారు తిరుమలలో మూలవిరాట్టు శ్రీ మహావిష్ణుదని నిరూపించారు.

Exit mobile version