Home Unknown facts ఆడ అఘోరాలుగా మారాలంటే ఏం చేస్తారో తెలుసా

ఆడ అఘోరాలుగా మారాలంటే ఏం చేస్తారో తెలుసా

0

శరీరమంతా బూడిద రాసుకుని, మనుషుల పుర్రెలను చేతపట్టుకుని తిరుగుతూ, మృతదేహాలను తింటూ, గంజాయి తాగుతూ స్మశానాల్లో నగ్నంగా సంచరిస్తుంటారు. అయితే మగ అఘోరాలు ఉన్నట్టే ఆడ అఘోరాలు కూడా ఉంటారు. మరి ఆడ అఘోరాలు ఎక్కడ ఉంటారు? వారి అఘోరాలుగా మారాలంటే ఏం చేస్తారనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

biggest secrets of Aghori Sadhus

హిమాలయప్రాంతాల్లో అఘోరాలు ఎక్కువగా జీవిస్తుంటారని చెబుతుంటారు. అఘోర అంటే భయం లేని వారు అని అర్ధం. ఎలాంటి వాతావరణ పరిస్థితులని తట్టుకొని జీవించే వీరు చాలా కఠినంగా ఉంటారు. ఆహారం లేకున్నా చాలా రోజుల వరకు అలాగే ధ్యాన ముద్రలో ఉండగలుగుతారు. వీరిని వీరు శివుడి యొక్క ప్రతి రూపాలుగా భావిస్తుంటారు. అందుకే స్మశానంలోనే తిరుగుతూ కాలిన శవాల మధ్యలో బ్రతుకుతు శవం మాంసం తింటూ ఉంటారు.

ఇక ఆడ అఘోరాల విషయానికి వస్తే, ఆడవారు అఘోరాలుగా మారాలంటే నియమాలు చాలా కఠినంగా ఉంటాయట. వీరు అఘోరాలుగా మారడానికి ముందు ఆరు సంవత్సరాల పాటూ మగ వాసన అనేది తగలకుండా కటిక బ్రహ్మ చర్యం చేయాలి. ఇలా ఆరు సంవత్సరాలు కటిక బ్రహ్మ చర్యం పాటించగలిగితే వారు జీవితాంతం బ్రహ్మచర్యం పాటించగలరని భావించి సన్యాసి ఆచార్య మండలేశ్వర్ నిర్ణయించి వారికీ సన్యాసం ఇస్తారు. సాధారణంగా బ్రతికి ఉన్నవారు చనిపోయినవారికి పిండ ప్రదానం చేస్తుంటారు. కానీ వీరు అఘోరాలుగా మారాలంటే బ్రతికి ఉండగానే వారికీ వారే పిండ ప్రధానం చేసుకోవాలి. ఇక రక్త సంబంధాలు అనేవి అసలు ఉండకూడదు.

సన్యాసిని గా మారిన రోజే వీరు కొత్తగా మళ్ళి ఆ రోజే జన్మించినట్లుగా భావించాలి. మగవారికి సమానంగా పూజ కార్యక్రమాలు చేస్తుండాలి. అఘోరాలు దత్తాత్రేయ స్వామిని ఆదిగురువుగా భావిస్తారు. ఇక మొదటిసారిగా బాబా కీనారాం అనే సాధువు అఘోరాగా మారాడని చెబుతారు. ఈయన దాదాపుగా 150 సంవత్సరాలు బ్రతికే ఉన్నాడని చెబుతారు. ఈయనకి దత్తాత్రేయుడు దర్శనమిచ్చి మోక్షాన్ని ప్రసాదించాడని చెబుతారు.

మగ అఘోరాలు సాయం కాలం దత్తాత్రేయ స్వామికి పూజలు చేస్తారు. ఆడ సాధువులు సాయంత్ర సమయాలలో దత్తాత్రేయ స్వామి తల్లి అయినా సతి అనసూయ దేవిని ఎక్కువగా పూజిస్తుంటారు. వీరు ఆ దైవాన్ని మోక్షాన్ని ప్రసాదించాలంటూ వేడుకుంటారు తప్ప వీరు ఎలాంటి కోరికలు కోరారు. మహిళా అఘోరాలు మగ అఘోరాల మాదిరిగా నిడంబరంగా ఉండకుండా కాషాయ వస్త్రాన్ని ధరిస్తారు. వీరు చనిపోతే వారి బంధువులకు అప్పగించారు ఎందుకంటే అఘోరాలుగా మారె ముందే వీరు తమకి తాము పిండప్రదానం చేసుకుంటారు కావున చనిపోయిన తరువాత వీరి శవాన్ని నదిలో కానీ చెరువులోకి కానీ వేస్తారు. విదేశాల నుండి కూడా కొందరు కాశి వంటి ప్రాంతాలకి వచ్చి ఆడ సాధువులుగా మారుతుంటారు.

ఇక ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి జరిగే కుంభమేళాకు అఘోరాలు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. వీరు ఇంతమంది కుంభమేళా దగ్గరికి ఒకే సమయంలో ఎలా వస్తారు? ఎక్కడినుండి వస్తారు? తిరిగి ఎలా వెళ్ళిపోతారనే విషయాలు ఇప్పటికి ఎవరికీ అంతుపట్టడం లేదని చెబుతారు. అయితే అఘోరాలు ఎక్కువగా ఉత్తరభారత దేశంలోని కాశి, వారణాసి, పశ్చిమ బెంగాల్, హిమాలయాల్లో, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో వీరు ఎక్కువగా నివసిస్తారని చెబుతారు.

Exit mobile version