Home Unknown facts Vaitharani nadhi gurinchi konni rahasyalu

Vaitharani nadhi gurinchi konni rahasyalu

0

నరకంలో ప్రవహించే నదిని వైతరణి అంటారు. ఈ నది యమలోకానికి దక్షిణాన ఉన్న ద్వారానికి వెలుపల ప్రవహిస్తుంది. గరుడ పురాణం ప్రకారం మనిషి మరణించిన అనంతరం చేసిన పాపానుసారం ఈ నది ధాటి నరకానికి వెళతారు. మరి ఎంతో భయంకరమైన వైతరణి నది ఎలా ఉంటుంది? ఇంకా ఈ నది గురించి మరిన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. vaitaraniఈ నది కొన్ని వేల మైళ్ళా వెడల్పు కలిగి ఉంటుంది. ఈ నదిలో నీరుకి బదులుగా రక్తము, చీము, ఎముకలు, బురద వలె కనిపించే మాంసము ఉండును. ఇంకా ఈ నదిలో చాలా పెద్ద మొసళ్ళు మరియు మాంసము తినే క్రిములు, జంతువులు, పక్షులు వుండడము వలన పాపాత్ములకు ఈ నది దాటి వెళ్ళడం అసాధ్యం. అయితే ఈ నది దాటే సమయంలో పాపులు మానవ జన్మలో చేసిన పాపాలను మననం చేసుకుంటూ ఆక్రందనలు చేస్తుంటారు. ఇంకా పాపులు సౌమ్యము, సౌరి, నాగేంద్ర భవనము, గంధర్వ, శైలాగను, క్రౌంచ, క్రూర, విచిత్ర భవన, బహ్వా పద, దుఖఃద, నానాక్రంద, సుతప్త, రౌద్ర, వయోవర్షణ, శీతాడ్య, బహుభీతి అనే పదహారు పురాలు దాటుకుని యమపురికి చేరుతాడు.జీవుడు తన పురాకృత పాపాలను తలచుకుంటూ బాధపడుతూ, జీవుడు పదిహేడు రోజులు నడిచి, పద్దెనిమిదవ రోజున సౌమ్యపురానికి చేరుకుంటాడు. ఆ నగరంలో ప్రేతాగణాలు ఉంటాయి. అక్కడ పుష్పభద్రా అనే నది ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. యమభటులు అక్కడ కాసేపు జీవుని విశ్రమింప చేస్తారు. అక్కడ జీవునికి తన బంధుత్వాలు అన్ని గుర్తుకు వచ్చి విచారిస్తూ ఉంటాడు. జీవుడు చేసిన కర్మ ఫలం అనుభవించక తప్పదు అని యమభటులు హితబోధ చేస్తారు. ఈ విధంగా భోదిస్తూనే జీవుని ముద్గరాలతో కొడుతూ వుంటారు. భయంతో జీవుడు పరుగులు తీస్తూ ఉంటాడు. అక్కడినుంచి మాసికం నాడు బంధువులు పెట్టిన పిండాన్ని తిని జీవుడు సౌరిపురానికి బయలు దేరుతాడు.యముని సోదరుడైన విచిత్ర రాజు పరిపాలించే విచిత్ర భవనం అనే పట్టణాన్ని చేరతాడట. అక్కడ నుంచే వైతరణి దాటాలి. గోదానం చేసినవారు పడవలో ఆ వైతరణి దాటగలరుగాని, లేని వారికి ఆ నదీ జలం సలసల కాగుతూ కనపడుతుంది. పాపాత్ముడు అందులో దిగి నడవవలసిందే అయితే పాపాత్ముని నోట ముల్లు గుచ్చి, చేపను పైకి లాగినట్లు లాగి యమ కింకరులు ఆకాశ మార్గాన నడుస్తూ జీవుణ్ణి ఆ నది దాటిస్తారు. శీతాడ్యనగరంలో పాపపుణ్యాలు లెక్కలు ఆరా తీయబడి జీవి సంవత్సరీకాలు అనగా ప్రధమాబ్దికం రోజు పిండోదకాలు తీసుకున్నాక బహుభీతి పురాన్ని చేరతాడు.హస్త ప్రమాణ పిండరూప శరీరాన్ని అక్కడ విడిచి అంగుష్ట ప్రమాణంలో ఉండే వాయు రూపమైన శరీరాన్ని అంటే యాతనా శరీరాన్ని దాల్చి కర్మానుభవము కోసం యమభటులతో యమపురికి చేరువవుతాడు. ప్రారబ్ద కర్మ అనుభవించడానికే యాతనా శరీరంతో జీవుడు పాపాత్ములతో కలసి యమపురి చేరతాడు. శ్రాద్ధ కర్మలు సరిగ్గా ఆచరించకపోతే ఆ ప్రయాణం కూడా మరింత క్లేశాలతో కూడినదవుతుందట. మనం తప్పు చేస్తే ఆ తప్పుకు నరకంలో తప్పకుండ శిక్ష అనేది ఉంటుంది అనడానికి ఒక పురాణ కథ ఉంది. అది ఏంటి అంటే, ధర్మదేవత వెంట స్వర్గానికి బయలుదేరిన ధర్మరాజుకు దోవలో వైతరణి ఎదురైంది. దోవంతా దుర్గంధంతో నికృష్టంగా ఉంది. అంతా అంధకారం. మాంసం, నెత్తురు, ఎముకలు, కేశాలు, ప్రేతాల గుంపులు, ముసురుకుంటున్న ఈగలు, క్రిమికీటకాలు కనిపిస్తున్నాయి. ఆ దుర్గంధాన్ని తట్టుకోలేక సొమ్మసిల్లిపోయాడు. దుర్యోధనాదులు స్వర్గంలో ఉంటే ఏ పాపం చేయని నా సోదరులు, భార్య ఈ నరకంలో ఉండటమేమిటి? అన్నాడు ధర్మరాజు. అయితే ఇంద్రుడు ధర్మరాజు అనుభవించిన ఆ నరకం కురుక్షేత్ర సంగ్రామం సమయంలో ఆయన ఆడిన అసత్య ఫలితమన్నాడు.
అశ్వత్థామ హతః అని పెద్దగా అని, కుంజరః అని చిన్నగా పలికి గురువైన ద్రోణుడిని వంచించిన పాపానికి, ఆ కొద్దిసేపటి నరకం అనుభవించాల్సి వచ్చిందని అన్నాడు. అబద్దాలు, తప్పులు చేస్తేనే ఫలితం నరకంలో ఇలా ఉంటె ఇంకా హత్యలు, మోసాలు, దోపిడీలు చేసే వారికి విధించే శిక్షలు తెలుపబడిన గరుడ పురాణం చూస్తే భయబ్రాంతులకు గురిచేస్తాయి.

Exit mobile version