Home Unknown facts వినాయకుడిని సిద్ది వినాయకుడు అని ఎందుకు అంటారు

వినాయకుడిని సిద్ది వినాయకుడు అని ఎందుకు అంటారు

0

ఏ పూజ చేయాలన్న మొదటగా వినాయకుడినే పూజిస్తాము. పార్వతీదేవి ముద్దుల తనయుడు బాలగణేశుడు. అయితే చిన్న మందిరంగా వున్న ఈ ఆలయం కాలక్రమేణా దేశంలోనే అత్యధిక ఆదాయం కల ఆలయాల్లో ఒకటిగా వెలుగొందడం ఒక విశేషం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఆయనను సిద్ది వినాయకుడు అని ఎందుకు అంటారు అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Siddhivinayakudiga

మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబై పట్టణంలోని ప్రభాదేవి ప్రాంతంలో సిద్ది వినాయక మందిరం ఉంది. 1801లో ఈ ఆలయాన్ని అగ్రిసమాజ్‌కు చెందిన ద్యూబయి పాటిల్‌ ఆర్థికసాయంతో కాంట్రాక్టర్‌ లక్ష్మణ్‌వితు పాటిల్‌ నిర్మించారు. ద్యూబాయి పాటిల్‌కు పిల్లలు లేరు. అయితే వినాయకుడి దర్శనం కోసం వచ్చే సంతానం లేని మహిళలకు సంతానం కలిగేలా చల్లనిచూపు చూడాలని ఆమె ఆ గణనాధున్ని ప్రార్థించింది. ఆమె ప్రార్థన ఫలం వల్ల అనేకమంది సంతానం లేని మహిళలకు సంతానం కలగడంతో ఆ శంభుకుమారుని దివ్యమహత్తు దేశమంతటా వ్యాపించింది. దీంతో ఆయన దర్శనం కోసం వస్తున్న వేలమందితో మందిరం సందడిగా వుంటుంది. సిద్ధివినాయకుడిని సవసచ గణపతిగా భక్తులు పిలుస్తారు. కోరిన కోర్కెలు తీర్చేవాడని మరాఠీ భాషలో దీనర్థం.

పురాణానికి వస్తే, శ్రీ మహావిష్ణువు మధుకైటభులనే రాక్షసులతో యుద్ధం చేస్తూ వినాయకుడి సహాయాన్ని కోరాడు. శ్రీ మహావిష్ణువు కోరిక మేరకు యుద్ధభూమిలో ప్రత్యేక్షమైన వినాయకుడు ఆ స్వామి దర్శనంతో రెట్టింపు బలాన్ని పొంది ఆ రాక్షసులని మట్టుబెట్టాడు. వినాయకుడి పాద స్పర్శతో కార్యసిద్ధి కావడంతో ఈ ప్రాంతం సిద్ద క్షేత్రం అయింది. వినాయకుడి సహకారానికి సంతోషించిన శ్రీ మహావిష్ణువు తానే స్వయంగా ఈ క్షేత్రంలో ఆలయాన్ని నిర్మించాడని స్థల పురాణం చెబుతుంది. స్వయంభూగా వెలసిన స్వామి విగ్రహానికి ఇరువైపులా సిద్ది, బుద్ది దేవతలు కొలువై ఉంటారు. అయితే ఇక్కడ విశేషం ఏంటి అంటే మిగతా క్షేత్రాల్లోని విగ్రహాలకు బిన్నంగా ఇక్కడ సామీ వారి తొండం కుడివైపునకు తిరిగి ఉంటుంది.

సిద్ధివినాయక మందిరం దేశంలోని అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే ఆలయాల్లో ఒకటిగావుంది. ఏటా హుండీ ద్వారా వచ్చే ఆదాయంలో కోట్లలో వుంటుంది. ఇంకా బంగారం కూడా ఎక్కువగా విరాళాల రూపంలో రావడం గమనార్హం. ఈ ఆదాయాన్ని పలు సాంఘికసేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు.

ఈవిధంగా ఎన్నో విశేషాలు ఉన్న ఈ సిద్ధివినాయక మందిరం లోని వినాయకుడిని దర్శించుకొనుటకు రోజు రోజుకి భక్తుల సంఖ్య అధికం అవుతూ వస్తుంది.

Exit mobile version