Home Unknown facts గవ్వలు ఇంట్లో ఉండడం వలన కలిగే ఫలితాలు ఏంటి ?

గవ్వలు ఇంట్లో ఉండడం వలన కలిగే ఫలితాలు ఏంటి ?

0

హిందూ సంప్రదాయంలో గవ్వలకు, శంఖాలకు విశిష్ట స్థానం ఉంది. సముద్రంలో సహజ సిద్ధంగా లభించే వాటిల్లో గవ్వలు, శంఖాలు, ఆల్చిప్పలు ఇలా అనేకం ఉన్నాయి. అందులో గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపంగా కొలుస్తారు. సిరుల దేవి అయిన లక్ష్మీ దేవి సముద్రుడి కూతురు అనే విషయం తెలిసిందే. అందువల్లనే సముద్రంలో లభించే గవ్వలు ఆమె చెల్లెళ్లనీ, శంఖాలు ఆమె సోదరులని అంటుంటారు. ఈ కారణంగా గవ్వలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని విశ్వసిస్తారు.

Lakshmi Deviఅందుకనే ఇంట్లో పెద్దలు ఉంటె.. సాయంత్రం 6 గంటల సమయంలో గవ్వలను ఆడనివ్వరు. ఆ శబ్దం ఆ సమయంలో వినిపించరాదని అంటారు. అంతేకాదు… ఇప్పటికీ అనేక దేశాలలోని గిరిజన ప్రాంతాలలో గవ్వలని నాణేలుగా చలామణి చేయటం ఇప్పటికీ అమలులో ఉంది. కొన్ని ప్రాంతంలో పురాతన కాలం నుంచి వస్తున్న ఆనవాయితీని పాటిస్తూ.. దీపావళి రోజున గవ్వలను ఆడుతూనే ఉన్నారు. అలా గవ్వలను ఆడటం ద్వారా గవ్వలు చేసే సవ్వడికి లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతారు.

గవ్వలు లక్ష్మీదేవికే కాక శివునికి కూడా ప్రత్యక్ష సంబందం ఉంది. శివునికి చేసే అష్టాదశ అలంకరణలో గవ్వలుకూడ ఉంటాయి. శివుని జటాజూటంలోను, శివుని వాహనమైన నందీశ్వరుని మెడలోనూ గవ్వలే అందంగా ఉంటాయి. గవ్వలు అలంకరణ వస్తువుగాను, ఆటవస్తువుగాను, తాంత్రిక వస్తువుగాను ఉపయోగపడుతుంది. పూర్వకాలంలో మంత్రికే తాంత్రిక విద్య సమయంలో.. వశీకరణ మంత్ర పఠన సమయంలోను గవ్వలను చేతిలో ఉంచుకునేవారని పలు కథనాల ద్వారా తెలుస్తోంది.

పంచతంత్రంలో ఒక చోట ‘చేత గవ్వలు లేనట్లయితే స్నేహితుడే శత్రువు అవుతాడు.’ అని ఉంది. కాబట్టి గవ్వలకి ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆర్ధిక జీవనంతో సంబందాలు ఉన్నాయి అనేది వాస్తవం.గవ్వలు దృష్టి దోషాన్ని నివారిస్తాయనీ, ధనాకర్షణ శక్తిని కలిగి ఉంటాయని అంటుంటారు. అందువల్లనే గవ్వలను ధనాన్ని ఉంచే చోట పూజా మందిరాల్లోనూ వుంచుతుంటారు. ఇక దృష్టి దోష నివారణకు గవ్వలను నూతన గృహాలకు వాహనాలకు కడుతూ వుంటారు. ఈ గవ్వలను పెద్దలు పలు రకాలుగా ఉపయోగిస్తారు.

గవ్వల లో మనకు వివిధ రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. అయితే వాటిలో పసుపు వర్ణంలో ఉన్న గవ్వలను లక్ష్మీదేవి గవ్వలు గా భావించి పూజిస్తారు. పసుపు రంగు బట్టలో గవ్వలను కట్టి వాహనాలకు కట్టడం ద్వారా ఎటువంటి ప్రమాదాలకు దారితీయదు. కొత్తగా కొన్న వాహానాలకు నల్లని తాడుతో గవ్వలని కట్టి దృష్టిదోషం లేకుండా చేసే అలవాటు ఈ ఆధునిక కాలంలో కూడా కొనసాగుతుంది.

ఈ గవ్వలను నల్లటి త్రాడు లో వేసి చిన్న పిల్లలకు కట్టడం ద్వారా వారికి ఎటువంటి నరదృష్టి కానీ, దుష్టశక్తుల పీడ కాని కలగదు. పిల్లలకి దృష్టిదోష నివారణకు గవ్వలను వారి మెడలోగాని,మొలతాడులోగాని కడతారు. అంతేకాకుండా కొత్తగా నిర్మించేటువంటి గృహాలకు గవ్వలను కట్టడం వల్ల మన ఇంట్లోకి సాక్షాత్తు లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే అని పెద్దల ఉవాచ. నూతనంగా ఇళ్ళు గృహాప్రవేశం చేసే వారు గుమ్మానికి తప్పనిసరిగా గుడ్డలో గవ్వలను కట్టాలి. గృహా నిర్మాణ సమయంలోను ఎటువంటి అవాంతరాలు రాకుండా ఇలా గవ్వలను కడతారు.

గవ్వలు లక్ష్మీదేవికి సోదరిగా భావించి మన పూజ గదిలో లక్ష్మీ దేవి పీఠం దగ్గర పెట్టి పూజించడం ద్వారా మన ఇంట్లోకి సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది.పూజించిన గవ్వలను మనం డబ్బు పెట్టే లాకర్ లో ఉంచడం ద్వారా ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతారు. వ్యాపారం చేసే వారు, వారి వ్యాపార అభివృద్ధి కోసం గల్లా పెట్టెలో గవ్వలను ఉంచడం ద్వారా వారి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలులా జరుగుతుందని విశ్వసిస్తారు. అందువల్ల వారు డబ్బు పెట్టే పెట్టెలో గవ్వలను ఉంచుకుంటారు.గవ్వలని పసుపు వస్త్రంలో పూజా మందిరంలో పెట్టి లలిత సహాస్త్రనామాలతో కుంకుమార్చన చేస్తే ధనాకర్షణ కలుగుతుంది అని ఓ నమ్మకం. వివాహం ఆలస్యం అవుతున్నవారు గవ్వలను దగ్గర ఉంచుకోవటం వలన త్వరగా పెళ్లి అవుతుంది. వివాహ సమయములలో వదూవరులు ఇద్దరి చేతికి గవ్వలు కడితే ఎటువంటి నరదృష్టి లేకుండా వారి కాపురం చక్కగా సాగుతుంది.

 

Exit mobile version