Home Unknown facts కురుక్షేత్ర యుద్ధం తరువాత శ్రీకృష్ణుడికి ధర్మరాజుకి మధ్య ఏం జరిగింది

కురుక్షేత్ర యుద్ధం తరువాత శ్రీకృష్ణుడికి ధర్మరాజుకి మధ్య ఏం జరిగింది

0

శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో ఎనిమిదొవ అవతారం శ్రీ కృష్ణావతారం. జగత్తులో ధర్మ క్షీణత కలిగినపుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు. ద్వాపర యుగంలో ధర్మాచరణ క్షీణదశకు చేరుకోవడంతో శ్రీమహావిష్ణువు కృష్ణుడి అవతారం ఎత్తాడనీ పురాణాలు చెబుతున్నాయి. మరి కురుక్షేత్ర యుద్ధం తరువాత శ్రీకృష్ణుడికి ధర్మరాజుకి మధ్య జరిగిన సంఘటన గురించి ఒక చిన్న కథని మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Sri Krishna Said To Dharmaraj

కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత కొన్ని రోజులకి ధర్మరాజు తీర్థయాత్రలు చేయాలనీ భావిస్తాడు. అప్పుడు ధర్మరాజుతో తీర్థయాత్రలు చేయడానికి మరికొందరు కూడా తోడవుతారు. అయితే ధర్మరాజు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి నేను ఇలా తీర్థయాత్రలకు వెళుతున్నాను నీవు కూడా మాతో రావొచ్చు కదా అని అడుగగా, అప్పుడు శ్రీకృష్ణుడు నాకు ప్రస్తుతం తీర్థయాత్రలు చేసేంత సమయం లేదు కావున మీరు వెళ్లి రండి అని చెబుతాడు.

అప్పుడు ధర్మరాజు నీవు ఖచ్చితముగా రావాలని వెంటపడటంతో సరే నేను రాలేను అని చెప్పి ఒక సొరకాయని ధర్మరాజుకి ఇచ్చి నా ప్రతినిధిగా దీనిని నీతోపాటు తీర్థయాత్రలకు తీసుకువెళ్ళు అని చెబుతాడు. ఇక శ్రీకృష్ణుడి ఆదేశానుసారం ధర్మరాజు దానిని ఆయనతో పాటుగా తీర్థయాత్రలకు తీసుకువెళ్లి యాత్రని ముగించుకొని తిరిగి వస్తాడు. ఇలా వచ్చిన తరువాత ధర్మరాజు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి యాత్ర విజయవంతంగా ముగిసింది. నీవు ఇచ్చిన సొరకాయను నేను మునిగిన అన్ని తిర్దాల్లో ముంచాను అని చెప్పి రేపు అన్న సమారాధన ఉందని దానికి తప్పకుండా రావాలని కోరాడు.

అప్పుడు శ్రీకృష్ణుడు, సరే నేను నీకు ఇచ్చిన సొరకాయని వండి అందరికి ప్రసాదంగా పంచి పెట్టమని చెబుతాడు. అప్పుడు ధర్మరాజు వండి అందరికి దాన్ని ప్రసాదముగా పెట్టగ భరించలేని చేదు ఉండటంతో అందరు వాంతులు చేసుకున్నారు. అప్పుడు ధర్మరాజు కృష్ణ నీవు ఇచ్చిన సొరకాయ చేదుగా ఉందని చెప్పడంతో, శ్రీకృష్ణుడు నవ్వి ధర్మరాజా, అది చేదుగా ఉందని నాకు ముందే తెలుసు, నీతో పాటు అన్ని మునకలు వేసింది కదా చేదు పోయిందని అనుకున్నాను ఇంకా చేదు అలానే ఉందా అనడంతో ధర్మరాజుకి అర్థమై శ్రీకృష్ణుడికి నమస్కరించాడు.

ఇక్కడ ధర్మరాజు తెలుసుకున్నది ఏంటంటే, వేలమంది నిత్యం తీర్థయాత్రలు చేస్తున్నారు కానీ మనసులో ఉన్న పాపాలను, స్వార్దాన్ని వదలిపెట్టడం లేదు మనసు శుద్ధి లేని యాత్రలు ఎన్ని చేసినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం అని అందులో ఉన్న అంతరార్థం.

Exit mobile version