Home Unknown facts హారతి వెనుక దాగి ఉన్న అసలు రహస్యం ఏంటి?

హారతి వెనుక దాగి ఉన్న అసలు రహస్యం ఏంటి?

0

ఇంట్లో, దేవాలయాల్లో, శుభకార్యాలయాలలో హారతి ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం. ఏ గుడికి వెళ్ళినా అడిగి మరీ హారతి ఇప్పించుకోవడం ఆనవాయితీ. అంతేకాదు పెద్దలు దిష్టి తీసేందుకు కూడా హారతి ఉపయోగిస్తుంటారు. గృహప్రవేశమైనా, పేరంటమైనా పిల్లల పుట్టిన రోజుల వేడుకలలోను ఎక్కడికెళ్లినా హారతి తప్పనిసరి. చివరకు క్రొత్త పెళ్లికూతురు ఇంట్లోకి ప్రవేశించేటప్పుడూ హారతి ఇస్తుంటారు.

హారతిమరి హారతి వెనుక దాగి ఉన్న అసలు రహస్యం ఏంటి? ఈ హారతి ఇవ్వడం లో కూడా ఒక ఆరోగ్య రహస్యం దాగుంది. దేవాలయాల్లో, శుభకార్యాలలో అనేకమంది గుమికూడటం వల్ల ఆ ప్రాంతం అంతా రద్దీ గా ఉంటుంది. వచ్చిన వారిలో రకరకాల వ్యాధిగ్రస్తులు ఉంటారు. దాని వల్ల పరిసర ప్రాంతపు గాలి కలుషితం అవుతుంది. అనేక క్రిములు చుట్టూ చేరుతాయి. దానివల్ల వ్యాధులు సులభంగా ఇతరులకు సోకే అవకాశం ఉంటుంది.

ఇలాంటప్పుడు కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వార దాని పొగకు సుక్ష్మక్రిములు నశిస్తాయి. శ్వాస కొస వ్యాదులు, అంటూ వ్యాదులు రాకుండా ఉంటాయి. అందుకే దిష్టి కుడా హారతి ఉపయోగిస్తారు. ఇదీ హారతి వెనుక ఉన్న ఆరోగ్య రహస్యం.

కర్పూర హారతి ఎలాగైతే క్షీణించి కరిగిపోతుందో అలాగే మనం తెలియక చేసిన తప్పులు సమసిపోవాలని దేవుని ముందు వేడుకుంటూ హరితిని కళ్ళకు అద్దుకోవడమే హారతి వెనుక ఉన్న ఆధ్యాత్మిక అంతరార్ధం.

 

Exit mobile version