Home Unknown facts తీర్థాలు ఎన్ని రకాలు? తీర్థం తీసుకోడం వెనుక ఉన్న ఆచారం ఏమిటి ?

తీర్థాలు ఎన్ని రకాలు? తీర్థం తీసుకోడం వెనుక ఉన్న ఆచారం ఏమిటి ?

0

దేవుడి దర్శనానికి గుడికి వెళ్ళినవారు తీర్థం తీసుకోకుండా ఇంటికి వెళ్ళరు. దేవాలయంలోకి వెళితే స్వామి లేదా అమ్మవారి అనుగ్రహం కోసం తీర్థం తీసుకోవడం ఆచారంగా వస్తుంది. అయితే దీనివెనుక అనేక రహస్యాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

తీర్థంతీర్థం అనేది ఒక్కో దేవాలయంలో ఒక్కోరకంగా ఉంటుంది. అది ఆ దేవాలయ సంప్రదాయం ప్రకారం ఉంటుంది. ఈ తీర్థాలలో రకాలు ఉన్నాయి. జలతీర్ధం, పంచామృత తీర్ధం, పానకా తీర్ధం, కషాయ తీర్ధం అనేవి మనం సాధారణంగా చూసే రకాలు.

జల తీర్ధం:

ఈ తీర్ధం సేవించడం ద్వార అకాల మరణం, సర్వ రోగాలు నివారించ బడుతాయి. అన్నికష్టాలు తొలగి ఉపసమానాన్ని ఇస్తాయి.

పంచామృత తీర్థం:

పంచామృత సేవనం ద్వార చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి కావటం, బ్రహ్మలోకం ప్రాప్తి కలుగుతాయని పండితుల అభిప్రాయం.

పానకా తీర్ధం:

శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునిడికి, అహోబిలం నరసింహ దేవునికి పానకం నైవేధ్యంగా పెట్టడంతో పానకాల స్వామి పానకాల నరసింహస్వామి దేవునిగా ఖ్యాతినర్జించారు. కారణం స్వామికి పానకాన్ని నైవేధ్యంగా పెట్టి వచ్చే భక్తులకు పానకాన్ని తీర్ధంగా పంచుతారు. అదేవిధంగా రామనవమి నాడు పానకాన్ని నైవేద్యంగా సమర్పించి భక్తులకు పంచడం ఆచారంగా ఉంది.

పానకా తీర్ధాన్ని సేవిస్తే దేహంలో ఉత్సహం ఎక్కువ అవుతుంది, కొత్త చైతన్యం వస్తుంది. శత్రువుల పీడ తగ్గుతుంది. బుద్ది చురుకుగా పని చేస్తుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దేహంలో వుండే వేడి సమస్థితికి వచ్చే విధంగా చేస్తుంది. రక్తపోటు ఉన్నవారికి తల తిరగడం, నోరు ఎండిపోయినట్లు ఉండడం జరగదు. ఎముకలకు సంభందించిన వ్యాధులు నయం అవుతాయి.

ఇవేకాకుండా సుగుంధ తీర్థం, గంగాజల తీర్థం, నదీతీర్తం, తులసీ తీర్థం, పచ్చకర్పూర తీర్థం, బిల్వతీర్థం, ఇలా రకరకాల తీర్థాలను కూడా ఆయా ప్రాంతాలలో ఇస్తుంటారు. వీటిని సేవించడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. మనసు ప్రశాంతత ఏర్పడుతుంది. తీర్థం ఇచ్చేటప్పడు చదివే మంత్రంలోనే అకాల మృత్యు హరణం, సర్వవ్యాధి నివారణం, సకలపాపక్షయకరం అని చదువుతారు.

 

Exit mobile version