గుడికి వెళ్ళగానే ఎదురుగా పైన గంటలు దర్శనమిస్తాయి. ఆలయంలో ఉన్నంతసేపు గంటల శబ్దం వినిపిస్తూనే ఉంటుంది. వచ్చిన భక్తులు అందరు గంటను మోగిస్తారు. దేవాలయాలలో వివిధ రకాలుగా గంటలు ఉంటాయి. అవి కలిగించే ఫలితాలు కూడా వాటిని అనుసరించి ఉంటాయి. ఇవి ఆరు రకాలుగా ఉంటాయి.
మొదటిది ధ్వజ స్తంభం దగ్గర ఉంటుంది .దీనినే బలి అని పిలుస్తారు. పక్షులకు ఆహారాన్ని పెట్టె సమయంలో ఒక తీరుగా మ్రోగించే గంట ఇది.
రెండోది :
రెండోది స్వామివారికి నైవేద్యం పెట్టేటపుడు మ్రోగిస్తారు.
మూడో గంటను దేవుడికి మేలుకొలుపు పాటలను పాడే సమయంలో మ్రోగిస్తారు.
నాలుగో గంట :
నాలుగో గంట ఆలయాన్ని మూసివేసే సమయంలో మ్రోగించే గంట.
ఇక ఐదో గంట మండపంలో మ్రోగించే గంట. ఇది మరో విధంగా ఉంటుంది.
చివరిది :
స్వామివారికి హారతి ఇచ్చేటపుడు మ్రోగించే గంట చివరిది.