Home Unknown facts శివుడు తలకిందులుగా తపస్సు చేస్తూ దర్శనమిచ్చే ఆలయం ఎక్కడ ఉంది ?

శివుడు తలకిందులుగా తపస్సు చేస్తూ దర్శనమిచ్చే ఆలయం ఎక్కడ ఉంది ?

0

ప్రపంచంలో ఎక్కడైనా శివుడిని లింగ రూపంలోనే పూజిస్తారు. ఆలయాల్లో ఎక్కడా పరమశివుడి విగ్రహాలకు పూజలు చేయరు. అయితే శివలింగ రూపంలో కాకుండా శివుడు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఒక క్షేత్రం ఉంది. అదికూడా శివుడు తలకిందులుగా తపస్సు చేస్తూ భక్తులచే పూజింపబడుతున్నాడు. మరి ఆ పుణ్యక్షేత్రం ఎక్కడుందో… ఆలయ చరిత్ర ఏమిటో తెలుసుకుందామా.

తలక్రిందులుగా దర్శనమిచ్చే శివుడుఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో యనమదుర్రు అనే గ్రామంలో ఉంది ఈ విశేషమైన శక్తీశ్వరాలయం. ఈ దేవాలయం పంచారామ క్షేత్రాలలో ఒకటైన భీమవరంకు 5 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ శివుడు శీర్షాసన భంగిమలో విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. శక్తి పీఠంలో శివుడు, పార్వతిదేవి మరియు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ముగ్గురు కలసి ఏకపీఠం మీద ఉండటం ఇక్కడి విశిష్టత. అలాగే పార్వతి దేవి మూడు నెలల పసికందయిన బాల సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని ఒడిలో లాలిస్తూ కొలువై ఉండటం మరో ప్రత్యేకత.

ఇక్కడ శివుడు తలక్రిందులుగా కొలువై ఉండటానికి ఒక కారణం ఉంది. పూర్వం ఓ రాజ్యంలో శంబురా అనే రాక్షసుడు ప్రజలను, మునులను చాలా ఇబ్బంది పెడుతుంటాడు. రాక్షసుడితో పడలేక ప్రజలు, మునులు ఆ రాక్షసుడిని ఒక్క యముడు మాత్రమే చంపగలడని యముడి దగ్గరికి వెళ్లి జరిగిన విషయాన్నీ చెబుతారు. అయితే శంబురా రాక్షసుడితో అంతకు ముందే యుద్ధంలో ఓడిపోయిన యముడు మరొసారి అతనితో పోరాడే శక్తి తనకివ్వమని శివుడికి తపస్సు చేస్తాడు.

ఆ సమయంలో శివుడు లోకకళ్యాణం కోసం తీవ్ర తపస్సులో ఉంటాడు. దానితో యముని తపస్సు చూసి పార్వతి దేవి ప్రత్యక్షం అవుతుంది. యముడు జరిగిన విషయాన్ని పార్వతి దేవికి చెబుతాడు. అప్పుడు పార్వతి యమధర్మరాజుకు ఒక ఆయుధాన్ని ఇవ్వడంతో శంబురా రాక్షసుడిని హతమారుస్తాడు. దాంతో ఆ రాక్షసుడి నుండి ప్రజలకు విముక్తి కలుగుతుంది. అప్పటి నుండి ఆ ప్రాంతానికి యమపురి గా పేరు వచ్చింది కాల క్రమేణా అది యనమదుర్రుగా మారిపోయింది.

శంబురా రాక్షసుడు చనిపోయిన తరువాత కూడా యమపురికి భవిష్యత్తులో ఎటువంటి ఆపద రాకుండా అక్కడే ఉండాలని యముడు శివుడిని ప్రార్దిస్తాడు. అయితే అప్పటికి ఇంకా తపస్సులోనే ఉన్న శివుడు అదే రూపంలొ కుటుంబ సమేతముగా యమపురిలో వెలిసాడని ఇక్కడి స్థలపురాణం చెబుతోంది.

 

Exit mobile version