మన దేశంలో ఒక్కో దేవాలయానిది ఒక్కో ప్రత్యేకత. విగ్రహ ప్రతిష్ట కూడా చాల ప్రత్యేకంగా చేస్తారు. అయితే సాధారణంగా ఆలయాల్లో ఏ దేవుడు లేదా దేవత అయినా నిల్చొనో, కూర్చోనో దర్శనమిస్తారు. లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం శయన స్థితిలో దర్శనమిస్తారు. అయితే ఇక్కడ స్వామి వారు మాత్రం ఎడమ కాలి మీద నిల్చుని కుడి కాలిని గాలిలోకి ఎత్తిన భంగిమలో కనపడుతుంది.ఇక్కడి దైవాన్ని చూసిన ఎవరికైనా ఈ స్వామి వారు ఎందుకు ఇలా దర్శనమిచ్చారు.అనే సందేహం తో పాటు ఆశ్చర్యం కూడా కలుగుతాయి. ఈ స్వామి వారు ఇలా ఎందుకు ఉన్నారో దీనికి గల స్థల పురాణము గురించి తెలుసుకోవాలంటే ఈ ఆలయం ఎక్కడ వుందో, ఆ క్షేత్ర విశేషాలు ఏమిటో చూద్దాం.
ఈ స్వామి వారిని తమిళంలో అయ్యన్నార్,అమ్మవారిని పుస్పవల్లియార్ అని పిలుస్తారు. ఈ ఆలయానికి ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయానికి ఆనుకుని పెన్నా నది ప్రవహిస్తుంది. అయితే ఒకప్పుడు బ్రహ్మ దేవుడు ఈ నదిలో కాళ్ళు కడుక్కొని తీరు విక్రమ పెరుమాళ్ వారిని ఆరాధించేవారు. అందుకే ఈనదిని కూడా గంగా నది అంతా పవిత్రమైనది అని భావిస్తారు. ఈ పెన్నా నదిని దర్శించిన వారికి సర్వ పాపాలూ హరిస్తాయి. ఋషులు ముక్తి పొందిన స్థలంగా,మరియు భూలోక స్వర్గం గా తీరు విక్ర పెరుమాళ్ ను పేర్కొంటారు.