Home Unknown facts పూజగదిలో ఏ వస్తువులను పెట్టొచ్చు పెట్టకూడదో తెలుసా ?

పూజగదిలో ఏ వస్తువులను పెట్టొచ్చు పెట్టకూడదో తెలుసా ?

0

ఇంటిని, ఇంట్లోని గదులను అందంగా అలంకరించడం ఎవరికి నచ్చదు చెప్పండి? చాలా మంది పడకగదిలో అద్భుతమైన సీనరీలను అలంకరిస్తారు. కంటికి ఇంపైన పెయింటింగులు మనస్సుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అలా అని ఏవి పడితే అవి గోడలకు తగిలించకూడదు. గదిలోకి అడుగు పెట్టినప్పుడు మన చూపు వాటిమీద పడుతుంది.

Pooja Roomపెయింటిగ్స్ కానీ, సీనరి కానీ మన మనసుని ప్రభావితం చేస్తాయి అని మనసాస్త్ర నిపుణులు అంటున్నారు. అంతే కాకుండా కొన్నిటిని బెడ్ రూమ్ లో ఉంచడం వల్ల వాస్తు రీత్యా మంచి ఫలితాలు పొందవచ్చు అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాటిలో ఒకటి నెమలి పించం అవును బెడ్ రూమ్ గోడకు నెమలి పించం పెట్టడం వల్ల వాస్తు రీత్యా మంచి ఫలితాలు పొందవచ్చు అని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

బెడ్‌రూమ్‌లో నెమలి పింఛాన్ని కనబడేటట్లు పెట్టి ఉదయం నిద్ర లేవగానే దానిని చూడడం వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయంటున్నారు. రాహుగహ్ర దోషాల నుంచి నివారణ కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. నెమలి పింఛంతో తయారైన చిత్ర పటాలను పడకగదిలో ఉంచడం ద్వారా శుభ ఫలితాలుంటాయని వారు చెబుతున్నారు. అలాగే.. పడకగదిలో కంటికి ఎదురుగా వికృతమైన పటాలు, చిలకకొయ్యలు, స్తంభాలు ఇతర అవరోధాలు లేకుండా జాగ్రత్త వహించాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

నెమలి కుమార స్వామి వాహనం. నెమలిని జాతీయ పక్షి. ఆ పక్షి ఫింఛం శ్రీకృష్ణుని కిరీటంపై నిత్యం నివసిస్తూ వుంటుంది. ఆధ్యాత్మిక పరంగా చూస్తే నెమలి ఫింఛానికి ప్రత్యేకత వుంది. నెమలి పింఛాన్ని పూజగదిలో వుంచి పూజించడం ద్వారా సకల దోషాలు తొలగిపోతాయి. వాటంతట అవే నెమలి నుంచి ఊడిన నెమలి ఫించాలనే పూజకు వాడాలి. ఇంటి వాస్తు దోషాన్ని నివృత్తి చేయాలంటే.. ఎనిమిది నెమలి ఫించాలను చేర్చి.. ఓ తెలుపు రంగు దారంతో కట్టాలి. వాటిని పూజ గదిలో వుంచి.. ”ఓం సోమాయ నమః” అనే మంత్రాన్ని ఉచ్ఛరించడం ద్వారా ఆ దోషాలు తొలగిపోతాయి. అలాగే బీరువాల్లో ఒక నెమలి ఫించాన్ని వుంచడం ద్వారా ధనాదాయం వృద్ధి చెందుతుంది.

అప్పుల బాధలుండవు. ఇంకా నెమలి ఫించం ఇంటి ప్రధాన ద్వారంపై వుంచడం ద్వారా ప్రతికూల ఫలితాలు వుండవు. కార్యాలయాల్లో మన సీటు ముందు నెమలి ఫింఛాన్ని వుంచితే పనితీరు మెరుగుపడుతుంది. ఉత్పత్తి పెరుగుతుంది. కొత్త దంపతులు లేదా భార్యాభర్తలు తమ పడకగదిలో నెమలి ఫింఛాన్ని వుంచడం ద్వారా.. అన్యోన్యత పెరుగుతుంది. దంపతుల మధ్య ఏవైనా సమస్యలుంటే తొలగిపోతాయి. అలాగే మూడు నెమలి ఫింఛాలను చేర్చి నలుపు రంగు దారంతో కట్టి.. వక్కల పొడి నానబెట్టిన చెంబు నీటిని తీసుకుని నెమలి ఫింఛముతో ఇంటిల్లపాది మీద చల్లుతూ.. “ఓం శనీశ్వరాయ నమః” అనే మంత్రాన్ని 21సార్లు ఉచ్చరించాలి. ఇలా చేస్తే శనిదోషాలు పారిపోతాయని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.

 

Exit mobile version