Home Unknown facts వాలితో రాముడు ఎందుకు అధర్మ యుద్ధం చేసాడో తెలుసా ?

వాలితో రాముడు ఎందుకు అధర్మ యుద్ధం చేసాడో తెలుసా ?

0
వాలి

రామాయణంలో ఎన్నో గొప్ప పాత్రలు ఉన్నాయి. కొన్ని పాత్రలు ధర్మాన్ని నిలబెడితే, మరికొన్ని పాత్రలు ధర్మానికి విరుద్ధంగా ఉంటాయి. అందులో వాలి సుగ్రీవులు అన్నదమ్ములు వానరవీరులు. వీరి పాత్రలు రామాయణం కిష్కింధకాండములో వస్తాయి. కబంధుడు చేతులను శ్రీరామ చంద్రమూర్తి నరికేశాక కబంధుడు శాప విమోచనం పొంది రామా నీకు స్నేహితుడు అవసరం. అందువల్ల నీవు కిష్కిందకు వెళ్ళి సుగ్రీవుడితో మైత్రి చేసుకో అని చెబుతాడు. ఆ విధంగా అరణ్యకాండ ముగుస్తుంది, కిష్కిందకాండము ప్రారంభం అవుతుంది. వాలి,సుగ్రీవుల పాత్ర కూడా అప్పుడే ప్రారంభం అవుతుంది. కిష్కింధ రాజ్యానికి రాజుగా ఉండే వాలి మహా బలశాలి. పది తలల రావణుడినే ఎదురించి గెలిచిన ధీశాలి. అలాంటి వాలి తమ్ముడి భార్యను అపహరిస్తాడు దాని వల్లనే తనను రాముడు వదిస్తాడు. అలా వాలి అధర్మం ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసుకుందాం.

వాలిపూర్వం వాలి, సుగ్రీవులు అనే ఇద్దరు సోదరులు వుండేవారు. వీరిద్దరిలో సుగ్రీవుడు ఎంత ఉత్తముడో… వాలి అంత హీనుడు. ఇద్దరూ చూడటానికి ఒకేరకంగా వుండటం వల్ల… వాలి దానిని అదునుగా తీసుకుని ఎన్నో పాపాలను చేసి, వాటిని సుగ్రీవుని మీద మోపేవాడు. అలాగే సుగ్రీవుడు చేసే మంచి పనులను ఇతను చేసినట్టుగా నలుగురిలో చెప్పుకునేవాడు. ఒకనాడు… ఏ విధంగా అయితే రావణాసురుడు, సీతమ్మను అపహించుకుపోయాడో.. అదేవిధంగా వాలి కూడా సుగ్రీవుడిని బాగా కొట్టి, గాయపరిచి.. అతని భార్య అయిన ‘‘రుమ’’ను ఎత్తుకుపోతాడు.

వాలిఆమెను కిష్కింధలో బంధించి దాచేస్తాడు. ఈ ఘోర అవమానాన్ని భరించలేక సుగ్రీవుడు తన రాజ్యం నుంచి పారిపోయి ఋష్యమూకపర్వతంపై నివాసాన్ని ఏర్పరుచుకుంటాడు. ఆ పర్వతంపైకి వస్తే తల వేయి ముక్కలవుతుందనే శాపం ఉండడంతో వాలి ఆ పర్వతంపైకి వెళ్లే సాహసం చేయదు. కొన్నాళ్ల తరువాత అతనున్న ప్రదేశానికి సీతాన్వేషణ కోసం బయలుదేరిన రామలక్ష్మణులు, హనుమంతులు, వారి సైన్యం తదితరులు అక్కడికి చేరుకుంటారు. మొదట్లో సుగ్రీవుడు వారిని చూసి, తనను చంపడానికి వచ్చినవారని భావించి హనుమంతుడు గొడవ పడతాడు. అనంతరం రాముడిని చూసి తన తప్పును ఒప్పుకుని, తన సోదరుడు చేసిన దురాగతాన్ని వారికి వివరిస్తాడు.

అతని విషాదగాధను విన్న రామదండు.. అతని రాజ్యాన్ని, భార్యని తిరిగి రప్పించేలా సహాయం చేస్తామని మాటిస్తారు. రాముడు ఇలా చెబుతుండగానే సుగ్రీవుడు… ‘‘వాలి ఎంతో బలశాలి. అతన్ని జయించడం అంత సులభం కాదు’’ అని చెబుతాడు. అప్పుడు రాముడు చిరునవ్వుతో తన వీలును తీసి, ఒకే ఒక్క బాణంతో ‘‘సప్తతాళశ్రేణి’’ని (ఏడు తాటిచెట్ల వరుస) కూల్చేస్తాడు.

అది చూసిన సుగ్రీవుడు… రాముడు ఎంతటి పరాక్రమబలవంతుడో తెలుసుకుంటాడు. ఇది గడిచిన కొన్నాళ్ల తరువాత శ్రీరాముడు చెప్పినట్లుగానే.. సుగ్రీవుడు, వాలిని యుద్ధానికి పిలుస్తాడు. దాంతో వారిద్దరి మధ్య భీకరమైన యుద్ధం కొనసాగుతుంది. ఎదురుగా ఉన్న వాళ్ళ శక్తి బలహీనపడటం వాలికి ఉన్న వరం. అందుకని ఒక చెట్టుచాటులో వున్న శ్రీరాముడు, వాలికి సూటిగా బాణం వేయగా అది అతనికి తగులుతుంది.

ఆ దెబ్బకు మూర్ఛపడిపోయిన వాలి ‘‘చెట్టు చాటు నుంచి ఇలా దాడి చేయడం న్యాయమా’’ అని అడుగుతాడు. అతని మాటలకు రాముడు కోపాద్రిక్తుడై ‘‘తమ్ముణ్ణి చావకొట్టి.. అతని భార్యను అపహరించుకుపోవడం న్యాయమా?’’ అని ప్రశ్నిస్తాడు. అప్పుడు వాలి తన తప్పును తెలుసుకుని, క్షమించమని పశ్చాత్తాపడతాడు. ‘‘హే రామా! నీలాంటి మహోన్నత వ్యక్తి చేతిలో చావడం నా భాగ్యం’’ అంటూ తుది శ్వాసను విడుస్తాడు. సుగ్రీవుడు, రాముని సహాయంతో తన భార్యతోపాటు తన రాజ్యం అయిన కిష్కింధను దక్కించుకుంటాడు. రాముని పట్టాభిషేకం అనంతరం కిష్కిందకి వచ్చి తన రాజ్యాన్ని పరిపాలిస్తాడు.

 

Exit mobile version