Home Unknown facts హిందువులు ఇంటిపై హనుమాన్ జెండా ఎందుకు పెడతారు?

హిందువులు ఇంటిపై హనుమాన్ జెండా ఎందుకు పెడతారు?

0
సీతమ్మ తల్లికి శోకాన్ని పోగొట్టి ఓదార్పునిచ్చినవాడు, రామయ్యకు సీతమ్మ జాడ తెలిపి దుఃఖాన్ని దూరం చేసిన వాడు, రామ లక్ష్మణులు నీకు మిత్రులే కాని, వాలి పంపగా వచ్చినవారు కారని సుగ్రీవునికి శాంతిని కలుగచేసినవాడు, నీ అహంకారం నీకు మృత్యువును తెచ్చిపెడుతుంది అని నిర్భయంగా రావణునికి చెప్పినవాడు ఆంజనేయుడు.
  • ఆంజనేయుడు శివాంశ సంభూతుడని శాస్త్ర వచనం. శివుని 11వ అవతారంగాను, వైశాఖ మాస బహుళ దశమి తిథి హనుమజ్జయంతిగాను పరాశర సంహిత తెలియచేస్తుంది. వాయుదేవుని అనుగ్రహంతో పుట్టినవాడు కాబట్టి వాయుసుతుడని పేరు.
  • సాధారణంగా మనం కొందరి ఇంటిపై ఆంజనేయస్వామి జెండా ఉండడం చూస్తుంటాము. అయితే ఇలాంటి జెండాలు కేవలం ఆలయం లేదా పూర్వంలో యుద్ధానికి వెళ్ళే సమయంలో రాజులు తమ రథానికి ఇలా జెండాలు పెట్టేవారు.
  • ఇలా ఆంజనేయస్వామి జెండా పెట్టడం వల్ల యుద్ధంలో విజయం మనదే అవుతుంది. సాధారణంగా ఆంజనేయస్వామిని నమ్మకానికి విజయానికి బలానికి ప్రతీకగా విశ్వసిస్తారు. అందుకోసమే ఏదైనా శుభకార్యానికి వెళ్లేముందు ఈ జెండా తీసుకువెళ్లడం వల్ల తప్పకుండా విజయం వరిస్తుందని భావిస్తారు.
  • ఈ క్రమంలోనే పురాణాల ప్రకారం కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి రథాన్ని సాక్షాత్తు శ్రీ కృష్ణుడు నడుపుతాడు రథానికి ఆంజనేయస్వామి జెండా కట్టమని హనుమంతుడు చెప్పడంతో స్వయంగా శ్రీ కృష్ణుడు తన రథానికి జెండా కట్టి కురుక్షేత్ర యుద్ధంలో పోరాడి పాండవులు విజయం పొందారు.
  • ఇలా పాండవులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ విజయం పొందాలని ఈ జండాను ఉపయోగిస్తారు. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది ఇంటి పై భాగంలో ఈ జెండా కట్టి ఉంటారు. అలా ఇంటి పై భాగంలో ఈ జెండా కట్టి ఉండటానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.
  • సాధారణంగా ఆంజనేయస్వామి ఎంతో బలవంతుడు కావడంతో ఎలాంటి భూత పిశాచీలనైనా తన కాళ్ళ కింద బంధించి వారిని నాశనం చేస్తాడు. అందుకోసమే ఏ విధమైనటువంటి గాలి, భూత,పిశాచులు మన ఇంటి లోనికి రాకుండా అడ్డుగా ఉండడం కోసం ప్రతి ఒక్కరూ ఇంటికి పైభాగంలో ఆంజనేయస్వామి జెండా కట్టి ఉంటారు. ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ శనిదోషం కానీ లేకుండా ఉండటం కోసం ప్రతి ఒక్కరు ఇంటి పై భాగంలో ఆంజనేయస్వామి జెండా ఉంచుతారు.

Exit mobile version