తేత్రాయుగంలో భగవంతుడు శ్రీరాముడిగా అవతరించాడు. శ్రీరాముడు రాక్షసుడైన రావణుడిని సంహరించి ధర్మ సంస్థాపన చేసాడు. అయితే శ్రీ రాముడిని శ్రీ రామచంద్రుడు అని సంబోధిస్తుంటారు. మరి రాముడిని చంద్రుడితో ఎందుకు పోలుస్తారు? శ్రీ రామచంద్రుడు అని అనడం వెనుక కారణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీరాముడు దేశాన్ని వెయ్యి సంవత్సరాలకు పైగా పరిపాలించాడని చెబుతారు. శ్రీరాముడి పాలనను స్వర్ణయుగంగా పేర్కొంటారు. ఇది ఇలా ఉంటె, చంద్రుడికి 16 కలలు ఉంటాయని చెబుతారు. అలానే శ్రీరాముడికి కూడా 16 గుణాలు ఉంటాయని నారదుడు వాల్మీకి మహర్షికి చెప్పారు. అందుకే రాముడు శ్రీరామచంద్రుడయ్యాడు. ఈ లోకంలో నరుడిగా నడయాడుతున్న దైవం ఎవరని వాల్మీకి నారద మహర్షిని అడుగగా, పదహారు గుణాలు కలిగిన ఆ ఉత్తమనరుడు శ్రీరామచంద్రుడే అని నారద మహర్షి బదులిచ్చారు.
అయితే జాతిచేత, విద్యచేత. ఐశ్వర్యం చేత చాలా గొప్పవాడైన, తనకంటే తక్కువ వారితో అమరికలు లేక కలసి ఉండటమే సౌశీల్యం. శ్రీరాముడి మిత్రులు ముగ్గురు, వారు గుహుడు, సుగ్రీవుడు, విభీషణుడు. ఇంకా ఒకడు పడవలు నడుపుకునే పల్లెవాడు, రెండవ వాడు వానరుడు, మూడవవాడు రాక్షసుడు. ఇంకా ఉత్తమ మానవుడికి ఉండవలసిన గుణం వీర్యం. మనసులో వికారం కలగడానికి కారణాలెన్ని ఉన్న చలించకపోవడం వీర్యం.
ఉత్తమమానవుడు ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యసంధుడు, దృఢవ్రతుడు అంటే స్థిర సంకల్పం కలవాడు, మంచి నడవడి కలవాడు, సర్వ ప్రాణుల హితాన్ని కోరేవాడు, జ్ఞానం కలవాడు, సామర్థ్యం కలవాడు, సదైక ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు అంటే ధైర్యం, వ్యక్తిత్వం కల్గవాడు, సదైక ప్రియదర్శనుడు, కోపాన్ని జయించేవాడు, తానూ వెలుగుతూ ఇతరులకు వెలుగును ఇచ్చేవాడు, అసూయా లేనివాడు, యుద్ధంలో దేవతలనైనా జయించగలవాడు అయి ఉండాలి. అందుకే ఈ షోడశగుణ, కళాప్రపూర్ణుడే శ్రీ రామచంద్రుడు