Home Regional Read Here To Know Why The First Bonam Is Always Offered At...

Read Here To Know Why The First Bonam Is Always Offered At Golconda

0

హిందువులు అమ్మవారిని పూజించే పండుగే బోనాలు. ఆషాడ మాసంలో వచ్చే మొదటి ఆదివారం బోనాలు ప్రారంభమవుతాయి.  గ్రామదేవతలుగా పూజించే పోచమ్మ, మైసమ్మ, బాలమ్మ, ఎల్లమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ ఏడుగురు అక్కచెల్లెలు కాగా వీరికి తమ్మడు పోతురాజు. మరి బోనాలు ఎందుకు జరుపుకుంటారు? హైదరాబాద్ లో నాలుగు వారలు ఒక్కో వారం ఏ ఆలయం లో ఎందుకు బోనాలు చేస్తారు? మొదటి బోనం గోల్కొండలోనే ఎందుకు చేస్తారనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

bonalu

తెలంగాణ రాష్ట్రంలో జరిగే అతిపెద్ద పండుగలో ఒకటి బోనాల పండగ. ఈ బోనాల జాతరని హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగరాల్లో చాలా వైభవంగా జరుపుకుంటారు. హైదరాబాద్ లోని గోల్కొండ లో ఉన్న జగదాంబికా ఆలయంలో మొదటి బోనం ఎత్తిన తరువాతనే వివిధ ప్రాంతాల్లో బోనాల ఉత్సవాలు జరుపుకుంటారు. గోల్కొండ లో జరిగే బోనాల కి దాదాపుగా 500 ఏళ్ళ చరిత్ర అనేది ఉంది. గ్రామ దేవతైన అమ్మవారిని పూజించే అతిపెద్ద పండుగే బోనాల పండగ.

ఇక బోనాల చరిత్ర విషయానికి వస్తే,  గోల్కొండలో మొదలయ్యే బోనాలకు ఎంతో చరిత్ర అనేది ఉందని చెబుతారు. అయితే ఒక కథనం ప్రకారం కాకతీయ రాజైన ప్రతాప రుద్రుడు గోల్కొండలో ని  శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సందర్భంగా ప్రత్యేక పూజలు చేసినట్లుగా చెబుతారు. ఆ తరువాత వచ్చిన ముస్లిం పాలకులు సైతం ఇక్కడ బోనాలు నిర్వహించడానికి అనుమతి అనేది ఇచ్చారు. హైదరాబాద్ లోని అమ్మవారి అతిపురాతన ఆలయంగా ఈ ఆలయాన్ని చెబుతారు. అందుకే ఇక్కడే ప్రతి సంవత్సరం మొదటి బోనం సమర్పించడంతో బోనాల పండగ అనేది మొదలవుతుంది.

ఇక రెండవ వారం బల్కంపేట రేణుక ఎల్లమ్మ ఆలయంలో బోనాల పండగ జరుగుతుంది. మూడవ వారం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరుగుతాయి. ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే, బ్రిటిష్ కాలంలో ఈ ప్రాంతానికి చెందిన సురటి అప్పయ్య అనే వ్యక్తి బ్రిటిష్ సైన్యంలో చేరాడు. 1813 వ సంవత్సరంలో అతను మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి బదిలీ అయ్యాడు. ఆ సమయంలోనే హైదరాబాద్ నగరంలో ప్లేగు వ్యాధి సోకి కొన్ని వేలమంది చనిపోయారు. ఆ వార్త తెలిసిన అతడు, తన సహా ఉద్యోగులు కలసి ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి వెళ్లి తమ ప్రాంతంలోని ప్రజలని రక్షించమని కోరుకొని, అక్కడ ఆ వ్యాధి తగ్గితే ఆ ప్రాంతంలో ఉజ్జయిని అమ్మవారికి ఒక ఆలయాన్ని కట్టిస్తామని మొక్కుకున్నారు. ఆలా 1815 లో సికింద్రాబాద్ తిరిగి వచ్చిన అతను మొక్కు ప్రకారం ఇక్కడే అమ్మవారికి విగ్రహాన్ని ప్రతిష్టించి, ప్రతి ఆషాఢమాసంలో అప్పటినుండి బోనాల జాతర అనేది నిర్వహిస్తున్నారు.

ఇక నాలుగవ వారం మాతేశ్వరి ఆలయంలో బోనాలు అనేవి జరుగుతాయి. బోనం అంటే భోజనం అని అర్ధం. అమ్మవారికి సమర్పించేదే బోనం. బోనాల ఉత్సవాలలో ముఖ్యమైన ఘట్టాలు ఏంటంటే,

పోతురాజు: 

ఈయన అమ్మవారి తమ్ముడు. పోతురాజు తోనే జాతర అనేది ప్రారంభం అవుతుంది.

ఘటం: 

ఏనుగు మీద అమ్మవారి విగ్రహాన్ని తీసుకువెళ్లి మూసీనది లో నిమర్జనం అనేది చేస్తారు.

రంగం: 

బోనాల జాతరలో చివరి రోజు జరిగే ముఖ్య ఘట్టం ఇది. సోమవారం తెల్లవారుజామున మాతంగీశ్వరీ ఆలయం ఎదురుగా వివాహం కానీ ఒక స్త్రీ వచ్చి మట్టి కుండ మీద నిలబడి భవిష్యత్తు చెబుతుంది. దీనినే రంగం అని అంటారు.

ఈవిధంగా ఆషాఢమాసంలో మొదటి ఆదివారం మొదలై, నాలుగు వారాల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో వైభవంగా బోనాల పండుగ అనేది జరుగుతుంది.

Exit mobile version