Home Unknown facts కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి, దాని వెనక ఉన్న ఆంతర్యం ఎంటి ?

కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి, దాని వెనక ఉన్న ఆంతర్యం ఎంటి ?

0

హిందూ సాంప్రదాయ ప్రకారం కొబ్బరికాయకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా సరే గుడికి వెళ్తే దేవుడిని ప్రార్థించి కొబ్బరికాయలు కొట్టడం ఆనవాయితి. భారతదేశంలోని అనేక ప్రాంతాలలో వివాహం, గృహ ప్రవేశాలలో, హోమాలు, యజ్ఞాలు, పూజలు, పేరంటాలు లాంటి అనేక ధార్మిక కార్యక్రమాలలో కొబ్బరికాయకి ప్రముఖ స్థానం ఉంది. అంతే కాదు ఏదైనా శుభకార్యం చెయ్యాలన్న, పండగలు వచ్చినా, ఖచ్చితంగా కొబ్బరికాయ కొడతారు. ఆఖరికి ప్రతి నిత్యం వండుకునే వంటల్లో కూడా ముఖ్యంగా దక్షిణాది ప్రాంతాలలో కొబ్బరి వాడకం ఎక్కువగా ఉంటుంది.

కొబ్బరికాయ ఎందుకు కొట్టాలిఅయితే అసలు కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి, దాని వెనక ఉన్న ఆంతర్యం ఎంటి. చాలామందికి తెలియదు. కొబ్బరికాయను కొట్టడం శాంతి కారకం. అరిష్టనాశకం. కొబ్బరికాయను మానవ శరీరానికి ప్రతీకగా చెబుతారు. పీచుని అహంకారానికి, లోపల ఉన్న కొబ్బరిని మనసుకి, నీటిని నిర్మలత్వానికి సంకేతంగా తెలియచేసారు. మనిషిలోని అహంకారాన్ని విడిచిపెట్టి, నిర్మలంగా తనని తాను భగవంతునికి సమర్పించుకుంటున్నాననే భావన కలగడం కోసమే కొబ్బరి కాయను కొట్టడం వెనుక పరమార్ధం.

పూర్వకాలంలో చాలా మంది నరబలి ఇచ్చేవాళ్లు. అంటే దేవుడికి మనుషులను బలిగా ఇచ్చేవాళ్లు. ఈ సంప్రదాయానికి స్వస్తి చెప్పడానికే ఆధ్యాత్మిక గురు ఆది శంకర నరబలికి బదులుగా కొబ్బరికాయను దేవుడికి సమర్పించండని ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు. అందుకే కొబ్బరికాయ మనుషుల తలతో సమానంగా భావిస్తారు.

కొబ్బరిని దేవుడికి కొట్టినప్పుడు మనసులో వున్న కల్మషం, అహంకారం, ఈర్ష్యాద్వేషాలు అన్ని తొలగుతాయని వేద పండితులు చెబుతున్నారు. అందుకే కొబ్బరి కాయను ఆలయంలో కొడతారు. కొబ్బరికాయలు మనుషుల సంతానోత్పత్తిని కూడా సూచిస్తాయి. అందుకే హిందువుల పెళ్లిలో కొబ్బరికాయలను తప్పకుండా ఉపయోగిస్తారు. కుండపై కొబ్బరికాయను పెట్టడం అంటే గర్భం అని అర్థం. అలా కొబ్బరికాయ ద్వారా సంతానోత్పత్తి కలగాలని ఆశీర్వదిస్తారు.

Exit mobile version