భారత దేశాన్ని నదుల దేశం అంటే అతిశయోక్తి కాదేమో! నదులు దేశ ఆర్థిక సాంస్కృతిక స్రవంతిలో భాగమై పోయినవి. వర్షపు నీటి వల్ల కాని, ఎత్తయిన పర్వతాలలో మంచు కరిగిన నీటి కాని చిన్న చిన్న పాయలుగా ప్రవహిస్తూ అవి ఒకదానికొకటి ఏకమై పెద్ద ప్రవాహంగా మారడమే నదిగా పరిగణించబడుతుంది. కొన్ని నదులు భూమిలోనే ఇంకిపోతాయి. మరి కొన్ని నదులు సముద్రంలో కలిసి పోతాయి. కానీ ఒక నది మాత్రం అటు భూమిలో ఇంకిపోకుండా, ఇటు సముద్రంలో కవలకుండా అలా పారతూ ఉంటుంది.
వినడానికి ఎంతో ఆశ్చర్యం కలిగించిన ఇది నిజం.
మరి ఆనది ఏది? ఆనది విశిష్టత ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం.
కురుక్షేత్ర కాలం నాటి నుంచి ఇప్పటి వరకు ఈ నది ఒకే సాధారణ నీటిమట్టంతో ప్రవహిస్తూనే ఉంది. అందుకే ఈ నదిని జీవనది అని పిలుస్తారు.
ఇంత విశిష్టత కలిగిన ఈ నది పేరు యమునా.