Home Unknown facts యుద్ధక్షేత్రాలు అని పిలిచే ఆ స్వామివారి ఆ ఆరు ఆలయాలు ఎక్కడ

యుద్ధక్షేత్రాలు అని పిలిచే ఆ స్వామివారి ఆ ఆరు ఆలయాలు ఎక్కడ

0

దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలలో ఈ ఆరు క్షేత్రాలకి కూడా చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. శివుడికి, విష్ణువుకి ఉన్నట్లుగానే కుమారస్వామికి కూడా అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అయితే ఆరు అనే సంఖ్య ఆయనకి ప్రతీకగా భావిస్తుంటారు. ఎందుకంటే ఆ స్వామికి ఆరు ముఖాలు, ఆరుగురు అక్కాచెల్లెళ్లు. మరి యుద్ధక్షేత్రాలు అని పిలిచే ఆ స్వామివారి ఆ ఆరు ఆలయాలు ఎక్కడ ఉన్నాయనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Kumara Swamyతమిళనాడులో హరిహరులు తరువాత ఎక్కువగా కనిపించే ఆలయాలు సుబ్రమణ్యేశ్వరుడి ఆలయాలుగా చెబుతుంటారు. అయితే దేవతల పరిరక్షణ కొరకు అవతరించిన దేవ సైనాధ్యక్షుడై అసుర సంహారం గావించినందున తమినాడులో శ్రీ సుబ్రమణ్యస్వామిని త్రిమూర్థులకంటే ఎక్కువగా ఆరాధిస్తుంటారు. ఆ స్వామి వెలసిన ఆ ఆరు పుణ్యక్షేత్రాలను పడైవీడులు అని పిలుస్తారు అంటే యుద్ధ క్షేత్రాలు అని అర్ధం. ఇప్పుడు ఆ ఆరు ఆలయాలు ఏంటో తెలుసుకుందాం.

1 . శ్రీ కుమారస్వామి ఆలయం – పళని:

తమిళనాడు రాష్ట్రంలో, దిండిగల్ జిల్లా కి కొన్ని కిలోమీటర్ల దూరంలో పళని అనే ప్రాంతంలో శివగిరి అనే ఒక చిన్న కొండమీద ఈ ఆలయం ఉంది. పళని అంటే జ్ఞాన ఫలం అని అర్ధం. అందుకే ఆ స్వామియే జ్ఞాన ఫలం అని అర్ధం వచ్చేలా అయన కొలువున్న ఈ ప్రాంతాన్ని కూడా అదే పేరుతో పిలుస్తున్నారు. ఇక్కడి కార్తికేయుడు కేవలం మొలపంచెతోనే భక్తులకి దర్శనమిస్తాడు. ఇంకా స్వామి వెలసిన ఈ కొండని మురుగన్ కొండ అని పిలుస్తుంటారు.

2 . తిరుచ్చెందురు ఆలయం:

తమినాడులోని ట్యుటికోరన్ జిల్లాలో తిరుచ్చెందురు లోని సముద్రపు అంచునే శ్రీ సుబ్రహమణ్యస్వామి ఆలయం ఉంది. సముద్రపు ఒడ్డున వెలసిన ఆ స్వామివారి ఏకైక ఆలయం ఇదే అవ్వడం విశేషం. ఇక్కడ కుమారస్వామి, శూరపాదం అనే రాక్షసుని మీద విజయం సాధించాడని స్థల పురాణం. ఇంకా తిరువన్వేలి, కన్యాకుమారి వంటి ప్రసిద్ధ క్షేత్రాలకు ఈ ఆలయం కాస్త దగ్గరగా ఉంటాయి.

3 . తిరుత్తణి ఆలయం:

కొండపైన వెలసిన ఈ ఆలయం చాల ప్రాచీనమైంది. ఈ ఆలయంలో స్వామివారు శ్రీవల్లి దేవసేన సామెత ఇక్కడ కొలువై ఉన్నారు. రాక్షసులతో యుద్ధం ముగిసిన తర్వాత, కుమారస్మామి సేదతీరిన ప్రదేశం ఇది. ఇక్కడే ఆయన వల్లీదేవిని వివాహం చేసుకున్నారు. ఈ ప్రదేశంలో స్వామివారు శాంతించి కొలువై ఉన్నారు కనుక ఈ ప్రదేశానికి శాంతిపురి అనే పేరు వచ్చినది.

4 . స్వామిమలై ఆలయం:

తమిళనాడు రాష్ట్రంలోని తంజావురు జిల్లాలో కుంభకోణానికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడ కుమారస్వామి సాక్షాత్తు తన తండ్రి శివునికే ఓంకారం గురించి తెలియచేశాడట. స్వామిమలై కేవలం కుమారస్వామి ఆలయానికే కాదు, ఇత్తడి విగ్రహాల తయారీకి కూడా ప్రసిద్ధం.

5 . తిరుపరన్కుండ్రం:

ఇంద్రుని కుమార్తె దేవసేనని, కుమారస్వామి వివాహం చేసుకున్నది ఇక్కడే అని భక్తుల నమ్మకం. ప్రాచీన ఆలయాల్లో ఎక్కడ లేని విధంగా ఈ ఆలయంలో శివుడు, శ్రీ మహావిష్ణువు విగ్రహాలు ఎదురెదురుగా ఉన్నాయి. ఈ ఆలయంలో మూలవిరాట్టు విగ్రహం దేవసేన, కార్తికేయుల వివాహ సన్నివేశాన్ని చూపిస్తుంది.

6 . పలముదిర్ చోళై:

తమిళనాడు రాష్ట్రంలోని మధురై నందు గల వైగై నది తీరాన పలముదిర్ చోళై అనే క్షేత్రం ఉంది. ఇక్కడ స్వామి చతుర్భుజాలతో శ్రీ వల్లీదేవసేన సమేతంగా భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఆలయంలోని మూలవిరాట్ విగ్రహం నల్లరాతితో మలచబడి ఆధ్బుతంగా ఉంటుంది.

ఇలా వెలసిన ఆ సుబ్రహమణ్యస్వామి 6 పుణ్యక్షేత్రాలు భక్తులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Exit mobile version