Home Unknown facts స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు అనడానికి వెనుక కారణం ఏమిటి ?

స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు అనడానికి వెనుక కారణం ఏమిటి ?

0

కొంతమంది దేవాలయానికి వెళ్ళినపుడు లేదా గొప్ప వ్యక్తుల దగ్గర సాష్టాంగ నమస్కారం చేస్తారు. కానీ ఆడవారు సాష్టాంగ నమస్కారం చేయకూడదని శాస్త్రం చెబుతుంది. ఎందుకు చేయకూడదు? అనే ప్రశ్న తలెత్తవచ్చు దానికి సమాధానం తెలియాలంటే ముందుగా సాష్టాంగ సంస్కారం అంటే ఏంటో తెల్సుకోవాలి.

స + అష్ట + అంగ = సాష్టాంగ. అనగా 8 అంగములతో నమస్కారం చేయడం. అలా నమస్కారం చేసే సమయంలో ఈ శ్లోకం చదవాలి.

శ్లో !! ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా
పద్భ్యాం కరాభ్యాం కర్నాభ్యాం ప్రణామం సాష్టాంగ ఉచ్యతే !!

అష్టాంగాలు ఏంటి?

  • ఉరసు అంటే తొడలు
  • శిరసు అంటే తల
  • దృష్టి అనగా కళ్ళు
  • మనసు అనగా హృదయం
  • వచసు అనగా నోరు
  • పద్భ్యాం – పాదములు
  • కరాభ్యాం – చేతులు
  • కర్నాభ్యాం – చెవులు

బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ నమస్కరించి ఆయా అంగములు నెలకు తగిలించాలి. స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేకూడదు. ఒక వేళ స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేసినట్లయితే అష్టాంగాలతో పాటు మానవునికి జన్మనిచ్చే జన్మస్థలం, పాలిచ్చి పోషించే వక్ష స్థలం కూడా నేలకు తాకుతాయి. మన శాస్త్రాల్లో స్త్రీకి గొప్ప విలువ ఉంటుంది. సృష్టికి జన్మనిచ్చే స్థలం నెలకి తాకకూడదు. అలాగే పోషించే స్థలం కూడా నెలకు తాకరాదు. కాబట్టి స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయరాదు.

 

Exit mobile version