Home Unknown facts ఆడవారి జడ రహస్యం!!

ఆడవారి జడ రహస్యం!!

0

ఆడవారికి కేశాలు ఎంతో అందాన్ని ఇస్తాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో స్త్రీలు జడ వేసుకొని పూలు ధరిస్తారు. భారతీయ సాంప్రదాయంలో ముఖ్యంగా హిందూ ధర్మంలో ఆడవారు జడ వేసుకోవడం తప్పనిసరి. ఇప్ప్పుడు జుట్టు విరబోసుకోవడం.. వి కట్..యూ కట్, ఫెథర్ కట్ అంటూ రకరకాలుగా జుట్టుని కత్తిరించుకుని విరబోసుకుని ఉండడం ఫ్యాషన్ అయిపొయింది కానీ..రెండు తరాల ముందు వరకూ అమ్మాయిలకు జడ వేసుకోవడం తప్పనిసరి.. చిన్న పిల్లలు రెండు జడలు వేసుకుంటే.. యువత ఒక జడను .. అమ్మతనం నుంచి ఒక అడుగు ముందుకు వేస్తె.. ముడి వేసుకునేవారు. అంతేకాదు.. అప్పట్లో అమ్మాయిలు జడ వేసుకుని.. వాటికీ ప్రత్యేకమైన భరణాలను జడపాళీ (నాగరం), జడగంటలు, చామంతిపువ్వు, పాపిటబిళ్ళ, చెంపసరాలు ముఖ్యమైనవి అలంకరించుకునేవారు.

womens braidఈ విధంగా జుట్టు విరబోసుకుని తిరగడం వల్ల ఇంటికి జేష్టాదేవి ప్రభావం కలుగుతుందని,జేష్టాదేవి ప్రభావం మన ఇంటి పై ఉంటే ఇంటిలో ఎన్నో కష్టాలు కలుగుతాయని చెప్పేవారు. అందుకోసమే స్త్రీలు తలను ఎంతో చక్కగా దువ్వి తల వెంట్రుకలను మూడు పాయలుగా తీసుకొని అల్లుకునేవారు.
అయితే ఈ విధంగా మూడు పాయాలే ఎందుకు తీసుకొనేవారో ఇప్పుడు తెలుసుకుందాం.

అప్పట్లో చిన్న పిల్లలకు జడలు వేసిన, యువతులు జడ వేసుకున్నా,జుట్టుని మూడు పాయలుగా విడదీస. త్రివేణి సంగమంలా కలుపుతూ అల్లేవారు ఈ మూడు పాయలకు కూడా మన హిందూ ధర్మంలో ఎన్నో అర్థాలు ఉన్నాయి.

స్త్రీ జడ మూడుపాయలకు తన భర్త,తాను,తన సంతానం అనే అర్థాన్ని సూచిస్తాయి.

సత్వ, రజ, తమో గుణాలు,

జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి అనే అర్థాలు వస్తాయి. ఈ తతంగం స్త్రీలు వేసుకునే జడ బట్టి వారు చిన్న పిల్లలా, లేక అవివాహితుల, పెళ్లి సంతానం కలిగిన వారా అనే విషయాలను ఎంతో సులభంగా కనిపెట్టవచ్చు.

Exit mobile version