Home Unknown facts విదేశీయుడు శ్రీకృష్ణుడికి భక్తుడై హిందువుగా మారి నిర్మించిన ఆలయం

విదేశీయుడు శ్రీకృష్ణుడికి భక్తుడై హిందువుగా మారి నిర్మించిన ఆలయం

0

మన దేశం సంప్రదాయాలకు పుట్టినిల్లులాంటిది. పురాతన కాలం నుండి వెలసిన ఎన్నో అద్భుత ఆలయాలు అనేవి ఇప్పటికి మనకి దర్శనం ఇస్తుంటాయి. ఇలా వెలసిన ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టత అనేది ఉంది. ఇక ఇక్కడ ఉన్న ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే, ఒక విదేశీయుడు మన దేశానికి వచ్చి భగవద్గిత చదివి శ్రీకృష్ణుడి భక్తుడై హిందువు గా మారి ఈ ఆలయాన్ని కట్టించాడు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Lord krishna Temple At Mayapur

పశ్చిమబెంగాల్ రాష్ట్రం, మియాపూర్ అనే ప్రాంతంలో శ్రీధామం అనే క్షేత్రం ఉంది. దీనినే చంద్రోదయ దేవాలయం అంటారు. ఈ ఆలయం ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ఆలయాలలో, అతిపెద్ద ప్రార్థన మందిరాలలో ఒకటిగా చెబుతారు. ఈ ఆలయ నిర్మాణం 2010 ల మొదలయింది.

ఇక ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నది ఒక విదేశీయుడు కావడం విశేషం. అతను ఎవరో కాదు ప్రసిద్ధి చెందిన కార్ల కంపెనీ ఓనర్ హేన్రి ఫోర్డ్ మనువడు ఆల్ఫ్రెడ్ ఫోర్డ్. అయితే ఫోర్డ్ భారతదేశానికి మొదటిసారిగా వచ్చింది 1975 వ సంవత్సరంలో, అప్పుడు అయన ముంబై లో ఉన్న శ్రీకృష్ణ మందిరంలో రెండు నెలలు గడిపాడంట. ఇక అప్పటివరకు భగవద్గిత అంటే ఏంటో కూడా తెలీని అతను ఒకసారి భగవద్గిత అంటే ఏంటో తెలుసుకొని భగవద్గితని చదవడం మొదలు పెట్టాడు అంటా.

ఇలా చదవడంతో శ్రీకృష్ణుడి మీద ఏదో తెలియని అనుభూతి కలిగి శ్రీకృష్ణుడికి గొప్ప భక్తుడైయ్యాడు. ఇక 1975 లో శ్రీకృష్ణుడి మీద ఉన్న భక్తితో హిందువుగా మారి అయన పేరుని అంబరీష దాసగ మార్చుకున్నారు. ఇక శ్రీధామం లో ఉన్న ఇస్కాన్ దగ్గర అంతర్జాతీయ స్థాయి దేవాలయాన్ని నిర్మించాలనే ఆశయంతో 2010 లో ఈ మందిరాన్ని నిర్మించడం మొదలుపెట్టారు.

ఈ ఆలయం దాదాపుగా ఏడు లక్షల చందరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడుతుంది. దాధాపుగా ఈ కట్టడానికి 75 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారంటా. ఇక ఈ ఆలయం 340 అడుగుల ఎత్తులో నిర్మించబడగా, ఆలయంలో దాదాపుగా ఒకేసారి పది వేల మంది భక్తులు కూర్చొని సాంప్రదాయ నృత్యం చేసేందుకు వీలు ఉండేలా విశాలమైన ఒక ఆవరణ ఉంది.

ఇలా ఎంతో అద్భుతంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రార్థన మందిరాన్ని, ఆలయాన్ని ఒక విదేశీయుడు శ్రీకృష్ణుడి భక్తుడై, హిందువుగా మారి ఈ ఆలయాన్ని నిర్మించడం అంటే ఇదంతా కూడా ఆ శ్రీకృష్ణుడి లీలే అని కొందరు చెబుతారు.

Exit mobile version