త్రిమూర్తులలో ఒకరు మరమశివుడు అయన కైలాస అధిపతి. ఈయనను శంకరుడు, త్రినేత్రుడు, లయకారుడు, అర్ధనాదీశ్వరుడు ఇలా అనేక రకాల పేర్లతో కొలుస్తారు. మన దేశంలో శివాలయాలు ఎక్కువగా ఉంటాయి. అందులో అతి ప్రాచీన అద్భుత శివాలయాలు నేటికీ దర్శనమిస్తుంటాయి. ఇది ఇలా ప్రపంచంలో శివుడి అతి పెద్ద విగ్రహాలు ఎక్కడ ఎక్కడ ఉన్నాయి? వాటి విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1. కైలాసనాథ్ మహాదేవ్ – నేపాల్
ప్రపంచం లోనే ఎత్తైన శివుడి విగ్రహం నేపాల్ లో ఉంది. దీనినే కైలాసనాథ్ మహాదేవ్ విగ్రహం అని పిలుస్తారు. ఈ విగ్రహం ఎత్తు దాదాపుగా 144 అడుగులు. ఈ విగ్రహాన్ని కాంక్రీట్, జింక్, కాపర్ మరియు సిల్వర్ ని ఉపయోగించి తయారుచేసారు.
2. మురుడేశ్వర్ – కర్ణాటక
కర్ణాటక రాష్ట్రం, అరేబియా సముద్రానికి అనుకోని శ్రీ మురుడేశ్వర స్వామి ఆలయం ఉంది. మూడువైపులా అరేబియా సముద్రం ఉండగా ఒక పర్వతం మీద ఈ ఆలయం ఉంది. ఇక్కడ 123 అడుగుల ఎత్తు ఉన్న శివుడి సుందరమైన విగ్రహం ఉంది. ఈ విగ్రహం ప్రపంచంలోనే శివుడి యొక్క రెండవ ఎత్తైన విగ్రహం అని చెబుతారు. ఇక్కడి గాలి గోపురం ప్రపంచంలో కెల్లా చాలా పెద్దది. అయితే ఆత్మలింగాన్ని భద్రపరిచిన పెట్టెపైన కట్టిన వస్త్రం పడిన చోటు వెలసిన క్షేత్రం ఇది అని చెబుతారు. కన్నడ భాషలో మురుడు అంటే వస్త్రం.
3. సూర్ సాగర్ లేక్ – వడోదర:
వడోదర ప్రాంతంలో ఒక సరస్సులో శివుడు నిల్చున్న ఎత్తైన విగ్రహం ఉంది. ఈ చెరువుని సూర్ సాగర్ లేక్ అని పిలుస్తుంటారు. ఇక్కడి శివుడి విగ్రహం ఎత్తు 120 అడుగులు ఉంటుంది. ఈ విగ్రహాన్ని వడోదర మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కట్టించారు. ఇది ప్రపంచంలోనే మూడవ ఎత్తైన శివుడి విగ్రహం.
4. ఆదియోగి విగ్రహం – కోయంబత్తూర్
కోయంబత్తూర్ లోని ఇషా యోగ సెంటర్ వద్ద 112 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహం ఉంది. ఇక్కడి శివుడి విగ్రహాన్ని ఆదియోగి విగ్రహం అని అంటారు. స్టీల్ తో చేయబడిన ఈ విగ్రహాన్ని 2017 లో ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. దాదాపుగా ఈ విగ్రహం బరువు 500 టన్నులు ఉంటుందని ఒక అంచనా.
5. మంగళ్ మహాదేవ్ – మారిషస్
మారిషస్ ఒక ద్విపంలో ఉండే దేశం. గంగ తలొవ అనే ప్రాంతంలో మంగళ్ మహాదేవ్ అని పిలువబడే ఎత్తైన శివుడి విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఎత్తు 108 అడుగులు. ఈ విగ్రహాన్ని 2008 లో శివరాత్రి రోజున ప్రతిష్టించారు. ఇది ప్రపంచంలోనే ఐదవ ఎత్తైన శివుడి విగ్రహం.
6. సిద్దేశ్వర ధామ్ – సిక్కిం
సిక్కిం లో ఒక పెద్ద కొండ ప్రాంతం పైన 108 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహం ఉంది. ఈ ప్రాంతాన్ని సిద్దేశ్వర ధామ్ అని పిలుస్తారు. భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలకు, చార్ ధామ్ యొక్క ప్రతిరూపాలను చూడగలిగే ఏకైక స్థలం ఇదే.
7. హర్-కి-పౌరీ – హరిద్వార్:
హరిద్వార్ లోని హర్-కి-పౌరీ అనే ప్రాంతంలో గంగ నది తీరాన 100 అడుగుల ఎత్తైన అందమైన శివుడి విగ్రహం ఉంది. హిందువులు పవిత్రంగా భావించే ప్రదేశాలలో హరిద్వార్ ఒకటి.
8. శివగిరి – కర్ణాటక:
కర్ణాటక రాష్ట్రంలో బీజాపూర్ అనే ప్రాంతంలో 85 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహం ఉంది.
9. ఓంకారేశ్వర – మధ్యప్రదేశ్:
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక కొండ ప్రదేశంలో ఓంకారేశ్వర శివలింగ క్షేత్రం ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే అన్ని నదులు తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంటే, ఇక్కడ ఉన్న నర్మదానది మాత్రం పడమరకు ప్రవహించి అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది. శివుడి 12 జ్యోతిర్లింగాలలో ఈ ఆలయం ఒకటి. ఇక్కడ శివుడి ఎత్తైనా విగ్రహం ఉంది.
10. నాగేశ్వర్ – గుజరాత్:
గుజరాత్ రాష్ట్రంలో, ద్వారకా నగరానికి గోమతి మధ్యలో ద్వారకకు 12 కిలోమీటర్ల దూరంలో నాగేశ్వర జ్యోతిర్లింగం ఉంది. భక్తులకి దర్శనం ఇస్తుంది. శివుడి 12 జ్యోతిర్లింగాలలో ఈ ఆలయం ఒకటి. ఇక్కడ 82 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహం ఉంది.