శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది. హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం. శి అంటే శాశ్వత ఆనందం, మగవాళ్ల శక్తి అని, వ అంటే మహిళల శక్తి అని అర్థం. శివుడిని లింగ రూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తాయి.
- శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి. శివుడిని బోళా శంకరుడు అని పిలుస్తాం. ఆయనకు దోసెడు నీళ్లు సమర్పించిన వారు రాక్షసులు అయినా సరే కోరిన కోరికలను వరాలుగా ఇచ్చేస్తారు.
- శివుడు ఐశ్వర్యానికి కారకుడు. మనకు ఎంత డబ్బు వచ్చిన శివుని అనుగ్రహం ఉంటేనే చేతిలో నిలుస్తుంది. అందుకే ఎవరైనా ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతుంటే శివుణ్ణి ఈ విధంగా పూజిస్తే త్వరలోనే ధనవంతులు అవుతారు. అది ఎలాగో వివరంగా చూద్దాం.
- సోమవారం శివుణ్ణి పువ్వులతో పూజించిన తర్వాత దద్దోజనంను నైవేద్యంగా సమర్పించాలి. దద్దోజనం అంటే పెరుగన్నంలో నేతితో పోపు పెట్టి తయారుచేయాలి. దీన్ని కనుక నైవేద్యంగా పెడితే అప్పు భాదలు ఉండవు. అలాగే డబ్బు ఇబ్బందులు తగ్గి త్వరలోనే ధనవంతులు అవుతారు.
- సోమవారం అయితే దద్దోజనం నైవేద్యంగా పెడతాం. మరి మిగతా రోజుల్లో ఏమి నైవేద్యం పెట్టాలా అని ఆలోచిస్తున్నారా? మిగతా రోజుల్లో కొబ్బరికాయ, కిస్మిస్, ద్రాక్ష పండ్లు, ఎండు ఖర్జురం నైవేద్యంగా పెట్టాలి. ప్రత్యేకమైన రోజుల్లో పాలతో చేసిన పరమాన్నం లేదా పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి.