స్త్రీ గర్భవతి అయిందని తెలిసిన దగ్గర నుండి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో కలలుకంటుంది. ఎవరైనా సరే గర్భవతి అని తెలిసిన వెంటనే అందరూ హాస్పిటల్ కు వెళ్లి మొదటి నుంచి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. మరి కొంతమంది హాస్పిటల్ లో లింగ నిర్ధారణ కోసం స్కానింగ్ చేయించడం లాంటివి చేస్తుంటారు.
ప్రస్తుతం కొన్ని నెలలు నిండగానే స్కానింగ్ పద్దతిలో తల్లి గర్భంలో ఉన్న శిశువు యొక్క లింగ నిర్దారణ చేసేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇలాంటి లింగ నిర్దారణలు అటు ప్రయోగాత్మకమైనవిగానూ అలాగే ఇటు ఇబ్బందికరమైనవిగానూ మారాయి. ఎందుకంటే భారతదేశంలో కొన్ని చోట్ల గర్భంలోని శిశువు ఆడపిల్ల అని తెలిస్తే వెంటనే గర్భాన్ని తీయించి వేస్తున్నారు.
లింగంతో సంబంధం లేకుండా, తల్లిదండ్రులకు ప్రతి బిడ్డ, దేవుడిచ్చిన బహుమానం. గర్భధారణ సమయంలో గర్భము లోని పిండం యొక్క లింగాన్ని అంటే మగబిడ్డనా-ఆడబిడ్డనా అనే విషయం నిర్ణయించడం చట్టవిరుద్ధం మరియు శిక్షార్హమైన నేరం. అనేక మంది పిండాల లింగాన్ని గుర్తించడానికి లైంగిక-నిర్ణాయక పరీక్షలను దుర్వినియోగం చేశారు, ఫలితంగా గర్భంలోనే ఆడ శిశువులు హత్యలకు గురవుతున్నారు.
గర్భంలోని శిశువు లింగ నిర్ధారణ నేరానికి “ప్రీ-కాన్సెప్షన్ అండ్ ప్రీ-నాటల్ డయాగ్నొస్టిక్ టెక్నిక్స్ (PCPNDT)” చట్టం ప్రకారం, శిక్ష విధించబడుతుంది. ఆ శిక్ష మూడేళ్ళ జైలుతో పాటు యాభైవేల రూపాయల జరిమానా లేదా ఐదు సంవత్సరాలు జైలు శిక్షను విధించి, దానితోపాటు జరిమానాను ఒక లక్ష రూపాయల వరకూ పెంచవచ్చు. ఈ శిక్ష గర్భంలోని శిశువు యొక్క లింగాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించే వ్యక్తులకు మాత్రమే కాక, రోగ నిర్ధారణ చేసే వైద్యుడికి కూడా వర్తిస్తుంది.
కానీ పూర్వకాలంలో ఎటువంటి ఆధునిక పరిజ్ఞానం లేని కాలంలోనే మన బామ్మలు తల్లి గర్భంలో ఉన్న శిశువు లింగాన్ని గర్భం చూసే నిర్దారించేవారు.
మన పూర్వికులు అసలు అలా అనడానికి వెనుక ఓ కారణం ఉంది. ఆడశిశువు ఉన్న గర్భం కొంచెం పెద్దగా ఉంటుందట. ఎందుకంటే ఆడ శిశువు ఉన్న గర్భం లో శిశువు చుట్టూ ఉండే ద్రవపదార్థం ఎక్కువ మోతాదులో ఉంటుందట. అందుకే మగ శిశువు చుట్టూ ఉన్న ద్రవపదార్ధంతో పోలిస్తే ఆడ శిశువు చుట్టూ ఉండే ద్రవపదార్ధం మోతాదు ఎక్కువ ప్రమాణంలో ఉంటుందట. కాబట్టి ఒకవేళ గర్భంలో మగ శిశువు ఉంటే ఆ గర్భం కాస్త చిన్నదిగా కనిపిస్తుంది. కేవలం ఈ లాజిక్ ని ఆధారం చేసుకునే పూర్వకాలంలో గర్భంలోని శిశువు యొక్క లింగ నిర్ధారణ చేసేవారు.
గర్భవతి రొమ్ముల పెరుగుదలలో తేడా ఉందడమనేది అంటే ఒక రొమ్ము పెద్దదిగా పెరిగి మరొకటి చిన్నదిగా ఉండడం కూడా గర్భంలో ఉన్న శిశువుని నిర్ధారిస్తుంది అని కొన్ని ప్రాంతాల్లో నమ్ముతారు. గర్భధారణ సమయంలో రొమ్ముల పెరుగుదలలో తేడా అంటే, ఒక రొమ్ము మరొకదాని కన్నా ఎక్కువగా పెరుగుతుంది, అలాంటపుడు ఆ గర్భవతి రొమ్ముల పరిమాణాన్ని బట్టి తన గర్భంలో పెరుగుతున్నది అమ్మాయా లేదా అబ్బాయా అన్నది ఊహించుకోవచ్చట. కుడి రొమ్ము ఎడమరొమ్ము కన్నా పెద్దదిగా పెరుగుతుంటే, అది మగ శిశువుకు సంకేతంగా చెప్తారట.
కానీ నిజానికి రొమ్ముల పెరుగుదల హార్మోన్ల మార్పులు, కణజాల నిర్మాణం మరియు అమరిక మీద ఆధారపడి ఉంటుంది అని పరిశోధకులు సూచిస్తున్నారు. గర్భధారణ సమయంలో, గ్రంథుల హార్మోన్లు మరియు జన్యు కారకాల ప్రభావంతో రొమ్ములు పెరుగుతాయి. గర్భవతి రొమ్ముల్లో వచ్చే ఈ మార్పు కాబోయే తల్లి తన శిశువుకు ఆహారం అందించడానికి గర్భవతి శరీరాన్ని సిద్ధం చేయడానికి జరిగే ఒక సహజ శరీర ప్రక్రియ. రెండు రొమ్ముల యొక్క పెరుగుదల ఆకృతులలో వాటి పరిమాణంలో ముఖ్యమైన తేడాలు ఉండవచ్చు. కాబట్టి గర్భిణీ స్త్రీలలో రొమ్ము పెరుగుదల ద్వారా పిల్లల లింగ నిర్ధారణ కుదరదు