Home Unknown facts హిందూమతం గురించి 12 నిజాలు ఏంటో తెలుసా ?

హిందూమతం గురించి 12 నిజాలు ఏంటో తెలుసా ?

0

దేవుడిని ఏ రూపంలో పూజించిన మనం పూజించిన రూపంలోనే దేవుడు మనల్ని కరుణిస్తాడని పురాణాలూ చెబుతున్నాయి. అయితే ఇన్ని కోట్ల జనాభా ఉన్నఈ  ప్రపంచంలో ముఖ్యంగా మూడు మతాలు ఉన్నాయి. అందులో హిందూమతం ఒకటి. మరి హిందూమతం గురించి ఆ 12 నిజాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

  1. హిందూధర్మం అసలు పేరు సనాతన ధర్మం:

about hinduism

హిందూమతం లేదా హిందూ ధర్మం భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం. దీనిని సనాతన ధర్మం అని అంటారు.

  1. హిందూమతానికి ఫౌండర్ లేడు:

హిందూమతం అనేది ఎవరు స్థాపించింది కాదు ఎప్పటినుండో ఉంది. హిందూమతం 1500-2000 BC కాలంలో ప్రారంభమైంది. అయితే కొంతమంది సాధువులు, పూజారుల వంటి వారు హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్లారు అంతేకాని ఎవరు హిందూమతాన్ని స్థాపించలేదు.

  1. హిందూమతంలో దేవుడు ఒక్కడే:

హిందూమంతంలో అనేక మంది దేవుళ్ళు ఉంటారు. కొందరు ముక్కోటి దేవతలను ఆరాధిస్తారు. ఇంకొంతమందికి ముప్ఫై మూడు కోట్ల దేవతలపై విశ్వాసం ఉంటుంది. అయితే దేవుడు ఒక్కడే కానీ మూడు రూపాలలో ఉన్నాడు. వారు బ్రహ్మ – సృష్టికర్త, విష్ణువు – సృష్టి పాలకుడు, శివుడు – సృష్టి లయ కారకుడు. వీరి నుండే వచ్చినవారే శ్రీ రాముడు, శ్రీకృష్ణుడు వంటి దేవుళ్ళు.

  1. దైవాన్ని అన్నిటిలోను ఉందని భావిస్తాం:

భగవంతుడు, సృష్టి రెండూ వేరు వేరు కావని హిందువులు భావిస్తారు. వారి ప్రకారం సృష్టిలోని ప్రతి వస్తువు, అది సజీవమైనదైనా, నిర్జెవమైనదైనా సాక్షాత్తు అది భగవద్ స్వరూపమే అని చెబుతారు. అందుకే సగటు హిందువు ప్రతి వస్తువును దేవునిగా తలుస్తాడు. అతని దృష్టిలో చెట్లు, పుట్టలు, రాళ్ళు, రెప్పలు, చంద్రుడు, సూర్యుడు, కోతులు, పాములు అన్నీభగవత్ స్వరూపాలు. చివరకు మనిషి కూడా దైవాంశమే.

  1. ప్రపంచం మొత్తంలో ఒక్క హిందూమతంలోనే ఆడవారికి అధికంగా ప్రాముఖ్యత ఉంది:

హిందూమతంలో ఎంతో మంది దేవతలు ఉండగా ఆడ, మగ అని తారతమ్యం లేకుండా అందరికి సమానంగా శక్తులు అనేవి ఉన్నాయి. ఇది నిజం అనడానికి శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి వంటి ఎంతోమంది దేవుళ్ళు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

  1. యోని ఆకారంలో ఉన్న శిలని పూజించడం:

భారతీయ సమాజంలో ఋతుస్రావ చర్చలు నిషిద్ధమని భావిస్తారు. కానీ అస్సాం రాష్ట్రంలో కామాఖ్యాదేవి ఆలయం ఉంది. దేశంలో ఉన్న అష్టాదశ శక్తి పీఠాల్లో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయంలో యోని ఆకారంలో గల ప్రతిమను అమ్మవారిగా భావించి పూజలు చేస్తారు. ప్రతి సంవత్సరం వేసవిలో మూడురోజుల పాటు అంబుబాచీ పండుగ సందర్భంగా కామాఖ్యదేవి రజస్వల ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ మూడు రోజులు ఆలయాన్ని మూసేస్తారు. పూజారులు కూడా గుడిలోపలికి వెళ్లరు. నాలుగో రోజు లక్షలమంది భక్తుల సమక్షంలో తలుపులు తెరుస్తారు. ఆ సమయంలో గర్భగుడి నుంచి ప్రవహించే నీరు ఎరుపురంగులో ఉంటుంది.

  1. కొన్ని హిందూ దేవాలయాలు వేరొక ఉద్దేశం కోసం నిర్మించారు:

మన దేశంలో ఖజురహో వంటి కొన్ని దేవాలయాల్లో శృంగారం గురించి తెలియచేసే శిల్పాలు కనిపిస్తుంటాయి. పురాతన కాలంలో ప్రతి ఒక్కరు దేవాలయాలకు వెళ్లడం సహజంగా ఉండేది. అయితే శృంగారం పాపకార్యం కాదు. సృష్టి కి మూలం శృంగారమే. భార్యతో కూడిన సృష్టి కార్యం పవిత్ర ధర్మం. అప్పట్లో పెళ్ళైన వారికి లైంగిక జీవితం గురించి తెలుసుకోవడానికి ఏ మార్గము ఉండేవి కావు అందుకే దేవాలయంలో ఉండే బొమ్మలను చూపించేవారు. వాత్స్యాన గ్రంధాల గురించి చెప్పేవారు. ఆనాటి లైంగిక బంధాలు సంతానోత్పత్తి కోసం పవిత్రంగా ఉండేవి. ఈవిధంగా  దేవాలయాల మీద బూతు బొమ్మలు శృంగారం పాపవృత్తి కాదని పవిత్రమైనదని తెలియచెప్పడం  దీని ఉద్దేశం.

  1. హిందూమతంలో కఠినమైన నియమాలంటూ ఏవి లేవు:

హిందూమతంలో ఎలాంటి పరిమితులు అనేవి ఉండవు. ఎవరి దేనినైనా స్వతంత్రంగా అంగీకరించవచ్చు. ప్రపంచం మొత్తానికి దేవుడు ఒకడే, మనమే వివిధ రూపాల్లో పూజిస్తున్నాం అని చెబుతుంది.

  1. వేదాలు:

హిందూమతం పుట్టిన కొన్ని సంవత్సరాలకి కొందరు సాధువులు వేదాలను వ్రాసారు.

  1. ఆస్తికులు – నాస్తికులు:

దేవుడు ఉన్నాడు  అని పూర్తిగా  నమ్మే వారిని ఆస్తికులు అని అంటారు, దేవుడు లేడు అని పూర్తిగా నమ్మే వారిని నాస్తికులు అని అంటారు. హిందూమతంలో ఈ రెండు వర్గాలు ఉన్నాయి.

  1. హిందూమతం ఏ ఒక్క కులానికి సంబంధించింది కాదు:

హిందూమతంలో కులాలు అనేవి అసలు లేవు, కులమంటే నివాసమని అర్ధం. పూర్వకాలంలో కొన్ని వృత్తులు కొన్ని నివాసాలకే పరిమితమైనాయి. అయితే కాలక్రమంలో వృత్తులే కులాల క్రింద పరిగణించబడ్డాయి. అలా వచ్చిందే ఈ కులం అనే పదం. అది క్రమంగా వివక్షకు దారి తీసి కులతత్వం గా నిలద్రొక్కుకొని రాజకీయరంగంలోకి ప్రవేశించింది.

  1. హిందుత్వంలో సంపద అనేది విరుద్ధం కాదు:

హిందూమతం అనేది సాధారణ మనిషికి ధనం, చదువు వంటి అవసరాలను పోత్సహిస్తుంది. అయితే ధనం కోసం లక్ష్మి దేవిని, శాంతి కోసం సంతోషిమాతని, శృంగారం కోసం రతి దేవిని పూజిస్తుంటారు.

ఒక వ్యక్తి నిజం కోసం నిత్యాన్వేషణ చేయడమే హిందూమతం.

Exit mobile version