Home Unknown facts 20 Lesser Known Facts About Tirumala Tirupati Balaji Temple

20 Lesser Known Facts About Tirumala Tirupati Balaji Temple

0

తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠం. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు ఆ వెంకన్న స్వామి. ఈ స్వామిని ఏడుకొండలవాడని, గోవింధుడని, బాలాజీ అని, తిరుమలప్ప అని, వెంకటరమణుడని, మలయప్ప అని ఇలా ఎన్నో పేర్లతో ఆప్యాయంగా పిలుచుకుంటారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తరలి వచ్చే తిరుమల తిరుపతి గురించి చాలా మందికి తెలియని కొన్ని 20 షాకింగ్ ఫాక్ట్స్ ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1.శిలా తోరణం:

Tirumala Tirupati Balaji Temple

శ్రీ వేంకటేశ్వరస్వామి వారు భూమిపైకి వచ్చినప్పుడు మొట్టమొదటి అడుగు శ్రీవారి మెట్టు లేదా, శ్రీవారి పాదాలు అని చెప్పుకుంటున్న ప్రదేశంలో వేశాడని, రెండవ అడుగు శిలా తోరణం దగ్గర వేశాడని, మూడవ అడుగు ప్రస్తుతం మనం స్వామివారిని కొలుస్తున్న ప్రదేశంలో వేశాడని పురాణం. అయితే ఇక్కడ ఉన్న శిలాతోరణం మీద ఎవరు చెక్కకుండానే సహజ సిద్ధంగా శంఖం, చక్రం, స్వామివారి వర (ద)హస్తం, కటి హస్తం, పాదాలు, గరుడ పక్షి, నాగాభరణం ఇవన్ని కూడా మనకి స్పష్టంగా కనబడతాయి. దీనిని ఒక భౌగోళిక ఆధ్భూతం అని చెబుతారు. తిరుమల కొండ మీద ఉండే ఈ శిలాతోరణం సుమారు 26 అడుగుల వెడల్పు, 9.8 అడుగుల ఎత్తు ఉంటుంది. శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం 250 కోట్ల సంవత్సరాల పూర్వం ఇవి ఏర్పడ్డాయని, సముద్రమట్టానికి దాదాపుగా 30 వేల అడుగుల ఎత్తులో ఉన్న తిరుమలలో ఈ శిలాతోరణం ఏర్పడింది. అంటే ఒకప్పుడు అంత ఎత్తులో నీరు ఉండేదని వారు చెబుతున్నారు.

2.ఆర్కిటెక్చర్:

పిరమిడ్ ఆకారంలో ఉన్న వీటిని ఇసుకరాయి, సోప్ స్టోన్ మరియు గ్రానైట్ తో నిర్మించారు.

3.వైష్ణవిజం:

దాదాపుగా 5 వ శతాబ్దంలో ఈ స్వామివారు అల్వార్స్ చేత పూజించబడ్డాడు. అల్వార్స్ అంటే ఎవరైతే ఆ శ్రీమన్నారాయణునికి వారి జీవితం అంకితం చేసారో వారిని అల్వార్స్ అని అంటారు.

4.రామాయణం:

వరాహపురాణం ప్రకారం, తేత్రా యుగంలో సీతారామ లక్ష్మణులు లంక నుండి తిరిగి వస్తుండగా ఈ ప్రదేశంలో కొన్ని రోజులు నివసించారని పురాణం.

5.రాజులకి ఆస్థానం:

తొమ్మిదవ శతాబ్దంలో పల్లవలకు, 10 వ శతాబ్దంలో చోళులకి, 14 వ శతాబ్దంలో విజనగర రాజులూ ఈ ప్రాంతంలో ఉన్నట్లు కొన్ని సాక్ష్యాలు ఈ ప్రదేశంలో ఉన్నాయి.

6.ఆసియాలోనే రెండవ అతి పెద్ద జూ:

శ్రీ వెంకటేశ్వర Zoological Park అనేది మొత్తం 5,532 ఎకరాలలో 22 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉంది.

7.అరుదైన వృక్ష జాతి:

రెడ్ సాండర్స్ మరియు సైకస్ బెడ్డూమెయి వంటి అరుదైన వృక్ష జాతికి చెందిన మొక్కలు ఇక్కడ తప్ప మరెక్కడా కూడా మనకి కనిపించవు.

8.అరుదైన పక్షి జాతులు:

ఇక్కడ మొత్తం 178 జాతుల పక్షులు ఉన్నట్లుగా గుర్తించారు. అందులో ప్రమాదకరమైన Yellow-throated bulbul, Oriental white-backed vulture, Loten’s Sunbird వంటి కొన్ని రకాల పక్షులు కూడా ఉన్నాయి.

9.ధనిక దేవాలయం:

ప్రపంచంలో అత్యధిక ఆదాయం వచ్చే ఆలయాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. లడ్డు కౌంటర్, సేవ టికెట్స్, భక్తులు చెల్లించే అద్దె, ఇంకా భక్తులు సమర్పించే వెంట్రుకలు ఇలా అన్నిటి మూలాన దాదాపుగా తిరుమలలో ఒక్క రోజుకి 6.5 క్రోర్స్ ఆదాయం ఉంటుందని చెబుతారు.

10.అంతుచిక్కని గ్రామం:

తిరుమల టెంపుల్ నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది. ఈ గ్రామానికి ఆ గ్రామస్థులకు తప్ప వేరే వారికీ ప్రవేశం అనేది ఉండదు. ఇక్కడ ఒక తోట ఉంటుంది. ఈ తోటలో పూసే పూలని స్వామివారికి ఉపయోగిస్తారు. ఇంకా గర్భగుడిలో ఉండే పాలు, నెయ్యి, వెన్న, పూలు ఇలా ప్రతీది కూడా ఆ గ్రామం నుండే తీసుకువస్తారు.

11.ప్రకృతి ఆధ్బుతం:

తిరుమలలో ఉండే గరుడ పర్వతం స్వామి వారి నివాసం అని చెబుతారు. అయితే ఈ గరుడ పర్వతం అనేది సహజ సిద్ధంగా ఏర్పడింది. అయితే ఈ పర్వతం గరుడ పక్షి ఆకారం లో ఉండటం విశేషం. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే ఈ పర్వతం గరుడ పక్షి ఆకారంలో ఉండటం, ఆ పర్వతమే స్వామి వారికి నివాసం అవ్వడం. ఎందుకంటే గరుడ పక్షి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వాహనం అని పురాణాలలో ఉంది.

12.తిరుపతి లడ్డు:

ప్రపంచ వ్యాప్తంగా తిరుపతి ప్రసాదం అయినా తిరుపతి లడ్డు అంటే అందరికి చాలా ఇష్టం. రోజుకి దాదాపుగా 15000 వేల లడ్డులని తయారుచేస్తుంటారు. ఒక్క లడ్డు 100 గ్రాములు ఉంటుంది. అయితే ఈ లడ్డు తయారీ విధానం ఎవరు కూడా కాపీ కొట్టి నకిలీ లడ్డులు తయారు చేయకుండా ఉండటం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం పేటెంట్ రైట్స్ కూడా తీసుకున్నారు.

13.అంబులెన్సు:

తిరుమలలో ఒక స్పెషల్ ట్రక్ అనేది ఉంటుంది. అయితే Animal Welfare Board of India మరియు Marchig Animal Welfare Trust of Scotland వారు 13 లక్షల ఫండ్స్ ఈ ట్రక్ కోసం ఇచ్చారు. ఇందులో హైడ్రాలిక్ సిస్టం ఉంటుంది. వీరు నడవలేని స్థితిలో ఉన్న, దారితప్పిన జంతువులని ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆ జంతువులని ఇందులో సేఫ్ గా తీసుకువెళతారు. అంతేకాకుండా వీధి కుక్కలు ఎక్కడ కనిపించిన వాటిని ఇందులో తీసుకు వెళతారు.

14.అత్యధికంగా భక్తులు వచ్చే ఆలయం:

తిరుమలకి మాములు సందర్భాల్లో రోజుకి 50,000 నుండి లక్షమంది భక్తులు వస్తుంటారు. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలలో 5 లక్షలకి పైగా భక్తులు వస్తుంటారు. ప్రపంచంలోనే అధికంగా భక్తులు సందర్శించే పవిత్ర స్థలం తిరుమల తిరుపతి.

15.మూలవిరాట్:

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం భక్తులకి గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తారు, కానీ స్వామివారు గర్భగుడి కుడివైపు ఒక మూలలో ఉంటారు.

16.పంచె మరియు చీర:

స్వామివారికి ప్రతి రోజు కింద పంచె పైన చీరతో అలంకరిస్తారు. ఇది మనం దగ్గరి నుండి చూస్తే గమనించవచ్చు.

17.స్వామివారి విగ్రహం వెనుక జలపాతం:

సాధారణంగా ఆలయాల్లో దేవుడికి అలంకరించిన పూలను భక్తులకి ఇస్తుంటారు. అయితే ఇక్కడ శ్రీవారి విగ్రహానికి అలంకరించిన పూలను అసలు బయటకు తీసుకురారు. వాటిని స్వామివారి వెనుక వైపు ఒక జలపాతం ఉంటుంది వెనుకకు తిరిగి చూడకుండా ఈ జలపాతంలో వేస్తారు. ఇవి చిత్రంగా తిరుపతికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉండే వేర్పేడులో తేలుతాయి. అయితే స్వామివారి విగ్రహం వెనుక ఉండే జలపాతం ద్వారా అవి అక్కడకి చేరుతాయని చెబుతుంటారు.

18.సముద్రపు గోష:

స్వామివారికి వీపు మీద ఎన్ని సార్లు తుడిచినా తడి అనేది వస్తూ ఉంటుంది. అయితే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు గోష స్పష్టంగా వినిపిస్తుంది అని చెబుతారు.

19.గంధం:

గుడి ఎంట్రన్స్ లో మహాద్వారానికి కుడివైపున స్వామివారిని తలపై అనంతాళ్వారు కొట్టిన గుణపం ఉంటుంది. అయితే చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడ్‌తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం వచినప్పుడు గంధం పెట్టాడు అంటా అందుకే అప్పట్నుంచే స్వామి వారి గడ్డానికి గంధం పూయడమనే సాంప్రదాయం మొదలైంది. ఇంకా వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు ఉంటుంది. ఈ జుట్టు అస్సలు చిక్కు పడదని అంటారు.

20.వాతావరణం:

సాధారణంగా పచ్చ కర్పూరానికి ఎలాంటి రాతి విగ్రహమైనా బీటలు వారుతుంది. అయితే శ్రీవారికి నిత్యం కర్పూరం రాస్తున్న చెక్కు చెదరకపోవడం విశేషం. అయితే స్వామివారి విగ్రహానికి దాదాపుగా 110 డిగ్రీల ఫారిన్ హీట్ ఉంటుందని చెబుతారు. అయితే ఆలయం సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉండటం వల్ల ఈ ప్రభావం కనిపించడం లేదు. కానీ ప్రతి గురువారం విగ్రహానికి నిర్వహించే పవిత్ర స్నానం సందర్బంగా ఆభరణాలు తొలగించినప్పుడు మాత్రం గర్భగుడిలో తీవ్ర ఉక్కపోత ఉంటుంది.

Exit mobile version