టైప్ 2 డయాబెటిక్ పేషెంట్లు ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే మంచిది?

0
1143

వింటర్ వచ్చిందంటే చాలు.. ఎక్కడా లేని ఇన్ఫెక్షన్లు బాధిస్తుంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చలికాలంలో ఏదో రకంగా అనారోగ్యానికి గురవుతుంటారు. ఇక ధీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ చలికాలం కష్టకాలమనే చెప్పాలి. డయాబెటిస్, హై బ్లడ్ ప్రెజర్, ఆస్థమా, గుండె సంబంధిత రోగాలతో బాధపడేవారికి చలికాలంలో తీవ్ర ఇబ్బందులు తప్పవు.

diabetic patients dietడయాబెటిస్ రోగులకు ఈ కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గడంతో శరీరంలోని బ్లడ్ షుగర్ లెవల్స్ వేగంగా పెరిగిపోతాయి. అందుకే వ్యాయామం కాస్తా తగ్గించాలి. పోషక విలువలున్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫిట్ నెస్ ప్లాన్ కు అలవాటు కావడం కొంత కష్టంగా మారే పరిస్థితి లేకపోలేదు. అయినా తప్పదు మరి.

diabetic patients dietప్రస్తుతం మానవ జీవనశైలిలో టైప్ 2 డయాబెటిస్ అనేది సాధారణమైన విషయంగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఈ సమస్యతో బాధ పడుతున్నారు. వాస్తవానికి టైప్ 2 డయాబెటిస్ సాధారణమైనదే అయినప్పటికీ, అది మానవ శరీరంలో కలిగించే దృష్పభావాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి.

diabetic patients dietటైప్ 2 డయాబెటిస్ వలన ఊబకాయం, మూత్రపిండాలు మరియు గుండెకు హాని కలిగించే జబ్బులు రావటం వంటివి జరగవచ్చు. ఈ జబ్బుకు సరైన చికిత్స అంటూ ఏదీ లేదు, దీని నివారణ ఒక్కటే మార్గం. ఈ విషయంలో మన ఆహారపు అలవాట్లను మార్చుకుంటే, ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు.

diabetic patients dietటైప్ 2 డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు వారి డైట్ లో కొంత మార్పులు చేయాల్సి ఉంటుంది. తాజా పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. పండ్లు, కూరగాయల్లో పోషకవిలువలు, విటమిన్స్, మినరల్స్, పైబర్ పుష్కలంగా లభిస్తాయి. వీటివల్ల శరీరంలోని బ్లడ్ షుగర్ స్థాయిలను అదుపు చేస్తాయనడంలో సందేహం లేదు. దీంతో దీర్ఘకాలంగా వేధించే డయాబెటిస్ కూడా చెక్ పెట్టవచ్చు.

diabetic patients dietటైప్ 2 డయాబెటిస్ పేషెంట్లు రక్తంలో చక్కెర స్థాయి విషయంలో సరైన శ్రద్ధ తీసుకోకపోయినట్లయితే, రక్తంలో చక్కెర మోతాదు అధికమై, అది శరీరంలో ముఖ్యమైన అవయవాలకు హాని కలిగించే ప్రమాదం ఉంది. అదేసమయంలో, రక్తంలో చక్కెర స్థాయిల మరీ తక్కువగా ఉన్నా అలసటం రావటం, ఆపై అపస్మారక స్థితికి చేరుకునే ప్రమాదం కూడా లేకపోలేదు.

కాబట్టి, మధుమేహ వ్యాధిగ్రస్తులు అల్పాహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడే ఆరోగ్యకరమైన అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. మరి టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..

diabetic patients dietడయాబెటిస్ పేషెంట్ల కోసం ప్రత్యేకమైన సిరియల్స్ అందుబాటులో ఉంటాయి. అలాంటి వాటిలో అధిక-ఫైబర్, తక్కువ-షుగర్స్ ఉన్న వాటిని ఎంచుకొని క్రమం తప్పకుండా బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవాలి.

  • ఓట్‌మీల్
  • హోల్‌గ్రెయిన్ బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్
  • అవకాడో
  • గుడ్లు,
  • మంచి పోషకాలతో నిండిన రాగి జావ
  • బ్రసెల్స్ స్ర్పౌట్స్ (క్యాబేజీ)
  • వింటర్ స్వ్కాష్
  • స్వీట్ పోటాటో
  • ఆరెంజ్ (నారింజ పండు)
  • జామ పండు

మొదలైనవన్నీ ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో అద్భుత ఫలితాలు పొందవచ్చు.