Inti pina graddha vaalithe em jarugutundhi?

0
4591

మనతోపాటు మొక్కలు, పక్షులు, జంతువులు ప్రకృతిలో భాగమే. అయితే కొన్ని మొక్కలు, జీవాలు మనకి అదృష్టాన్ని అందిస్తే మరికొన్ని నష్టాన్ని కలిగిస్తాయి. అవి మొలిచే, వాలే స్థానాన్ని బట్టి కూడా ఫలితం మారుతుంటుంది.1 Crow On House

ఉదాహరణకు ఇళ్ళల్లో తేనె పట్టు ఏర్పడడం, రావణ హస్తం వంటి కుక్కగొడుగు జాతి మొక్కలు మొలవడం, ఇంటిపైన గ్రద్ధ వాలడం వంటివి జరిగితే.. ఇంట్లో వాళ్ళకి మంచి, చెడు జరిగే ఆస్కారం ఉంది. అది ఎలా అంటే తూర్పు దిక్కులో పై వాటిలో ఏదైనా జరిగితే ఆ ఇంటి సంపద అధికమవుతుంది. ఆగ్నేయంలో జరిగితే ఇంటికి అగ్ని వల్ల హాని కలుగుతుంది. 4Crow On Houseదక్షిణంలో సంభవిస్తే ఆ ఇంట్లో మరణాలు సంభవిస్తాయి. నైరుతిలో జరిగితే పిల్లలకు గండం ఉందని సూచన. పశ్చిమంలో జరిగితే ప్రభుత్వ గుర్తింపు లభిస్తుంది. వాయువ్య దిక్కులో జరిగితే పది పశువులు నశించిపోతాయి. ఉత్తరంలో జరిగితే పశువులకుహాని జరుగుతుంది.3 Crow On House ఈశాన్యంలో జరిగితే గృహ యజమానికైనా, అతని భార్యకైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇంటి మధ్యలో జరిగితే యజమానికి గండం.  పైన పేర్కొన్నవి జరిగినప్పుడు ఆర్ధిక, ప్రాణ నష్టాల భారిన పడకుండా ఉండాలంటే .. ఇంటికి ఆరు నెలలు తాళం వేయాలి, లేదా జ్యోతిషులు చెప్పిన శాంతి పూజలు చేయాలి. 5 Crow On House