కొండంత అండగా ఉండే కొండలమ్మ అమ్మవారి ఆలయం రహస్యం ఏంటో తెలుసా?

0
8579

ఇక్కడి అమ్మవారు, ఒక కొండ రాయి అమ్మవారి విగ్రహాన్ని పోలిఉండటం చూసి ఒక భక్తుడు మొదటగా ఆ కొండరాయిని గుర్తించాడు. అయితే ఆ భక్తుడు తనతో తీసుకెళ్లిన కొండరాయిని చూసి ఎందుకు పాశ్చత్యపం చెందాడు, తిరిగి అదే ప్రాంతానికి వచ్చి అమ్మవారి విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్టించాడు? ఆ అమ్మవారు శ్రీ కొండలమ్మగా ఎందుకు పూజలనందుకొంటుంది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ammavaaruఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం, వేమవరం లో శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానం ఉంది. ఈ తల్లి నేల మీదనే తల వరకే భక్తులకు దర్శనమిస్తుంది. ఈ అమ్మవారి అసాధారణమైన మహిమలతో చాలా తక్కువ కాలంలోనే దశదిశలకు వ్యాపించింది. బిడ్డ పుట్టినా, పెళ్లి జరిగినా పిల్లాపాపలు, నూతన వధూవరులు తమ కోర్కెలు తీరాక ఆ తల్లి సన్నిధిలోనే మొక్కుబడులను చెల్లించుకోవటం పరిపాటిగా మారింది.

2 Kondlamma Ammavaaruఇక అమ్మవారి విగ్రహం విషయానికి వస్తే, స్థానికుల కథనం ప్రకారం 35 సంవత్సరాల క్రితం వేమవరం గ్రామం దగ్గరలో మచిలీపట్నం నుండి గుడివాడ వెళ్ళు రహదారి పక్కన కాలువకు రివిట్ మెంట్ కట్టుటకు కొండరాళ్ళు తీసుకొని రాగ, వాటిలో ఒక రాయి అమ్మవారిని పోలినట్లుగా ఉండగా ఆ రాయిని పక్కన పెట్టారు. తదుపరి ఆ రాయిని రోడ్డు పక్కన నిలబెట్టి పసుపు, కుంకుమలు పెడుతూ భక్తులు పూజించసాగారు.

ammavaaruఅయితే ఆ రాయి పక్కనే బాతులు పెంచుకొనే ఒకతను కుటీరము ఏర్పాటు చేసుకొని బాతులు పెంచుకొనేవాడు. అమ్మవారి విగ్రహం పక్కనే ఉండటం వలన ఆ బాతులు సమృద్ధిగా గుడ్లు పెట్టడంతో ఆ బాతు యజమానికి మంచి లాభాలు వచ్చాయి. కొంతకాలానికి ఆ యజమాని గుంటూరు వలస వెళ్లడంతో తనతో పాటు ఆ అమ్మవారి విగ్రహాన్ని కూడా తీసుకెళ్లాడు. అయితే గుంటూరు చేరిన వెంటనే బాతులను, అమ్మవారి విగ్రహాన్ని లారీ నుండి కిందకు దించగా బాతులు వెంటనే చనిపోయాయి.

ammavaaruఅప్పుడు జరిగిన దానికి పశ్చత్తాపపడి వెంటనే అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి యధాస్థానంలో ప్రస్తుతం ఇప్పుడు అమ్మవారు ఉన్న స్థానంలో ఉంచాడు. నాటి నుండి అమ్మవారి మహత్యం నలువైపులా పాకింది. అమ్మవారిని దర్శించుకొనుటకు భక్తులు తండోపతండాలుగా ఇచటకు వచ్చి పాలంగాళ్ళు మ్రొక్కుబడులు తీర్చుకోసాగారు.

ammavaaruదేవాలయంలో ప్రతిరోజు నిత్యపూజలే కాకా, ప్రతి ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగును. ప్రతి సంవత్సరం దసరా నవరాత్రి మహోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. వేలాదిమంది భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. అంతేకాకుండా స్వామివారి ఊరేగింపు మహోత్సవం కూడా వైభవంగా నిర్వహింపబడుతుంది.

7 Kondlamma Ammavaaru