యాగంటి నంది విగ్రహం రోజు రోజు పెరగడానికి కారణం ఏంటి ?

0
17860

ప్రతి శివాలయంలో ఒక నంది విగ్రహం అనేది తప్పకుండ ఉంటుంది. అయితే యాగంటి లోని ఈ నంది విగ్రహానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఎందుకంటే ఈ నది విగ్రహం దిన దినానికి ఆ రాయి యొక్క పరిమాణం పెరుగుతుంది. మరి ఆ నంది విగ్రహాం పెరగడానికి కారణం ఏంటి? ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

basavannaఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలుజిల్లా, జిల్లా కేంద్రం నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న బనగానపల్లి మండలం, బనగానపల్లి నుండి 15 కీ.మీ. దూరంలో ఎర్రమల కొండల్లో వెలసిన యాగంటిలో శ్రీ ఉపమహేశ్వరస్వామి దేవస్థానం ఉంది. ఈ ఆలయంలో ఉమామహేశ్వరులు స్వయంభువుగా వెలిశారు. ఈ ఆలయం నందు ఆది దంపతులైన శివపార్వతులు ఒకే శిలలో దర్శనమిస్తారు. ఈ ఆలయం 15 వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య సంగం వంశపు రాజైన మొదటి హరిహర బుక్కరాయలు నిర్మించినట్లు తెలుస్తుంది. వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఈ ఆలయం నిర్మితమైంది.

basavannaస్థలపురాణం ప్రకారం అగస్త్య మహర్షిచే ప్రతిష్ట కావింపబడి ఆరాధించిన క్షేత్రం ఇది. ఇది తేత్రాయుగం నాటి పుణ్యస్థలి. కొండ కొనలపై గుహాలతో, పచ్చని వృక్షాలతో ఆహ్లాదాన్ని అందించే రమణీయ క్షేత్రం ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ ఒక కాకి కూడా కనిపించదు. ఇలా ఎందుకు కాకులు సంచరించవు అనేదానికి ఒక కథ ఉంది.

basavannaపూర్వము అగస్త్య మహర్షి యాగంటి ప్రాంతంలో పర్యటించి, ఈ ప్రాంతంలో వెంకటేశ్వరుడికి ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు. వేంకటేశుని శిలావిగ్రహం రూపొందించే సమయంలో స్వామివారి బ్రొటనవేలి గోరు విరిపోయిందంట. ఎందుకిలా జరిగిందని అగస్త్యుడు శివుడి కోసం గోర తపస్సు చేస్తుండగా మధ్యలో కాకులు అయన ఏకాగ్రతకి భంగం కలిగించగా, కోపోద్రిక్తుడైన ఆ మహర్షి ఆ ప్రాంతంలో కాకులు సంచరించకూడదని శపించాడట. అప్పటినుండి ఇక్కడ కాకులు తప్ప మిగతా పక్షులన్నీ తిరుగుతాయి.

basavannaఆ తరువాత అగస్త్యుడి తపస్సుకి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యేక్షమై, మహర్షి వేంకటేశుని విగ్రహం గురించి నువ్వు చింతించనవసరం లేదు. ఇక్కడ నేను ఉమాసమేతుడనై ఏకశిలపై వెలసి భక్తులను కటాక్షిస్తాను అని చెప్పగా, అగస్త్యుడు సంతోషంతో ‘నెగంటి’ అనే కీర్తన పాడుతూ నృత్యం చేసాడు. అందువల్ల ఈ క్షేత్రానికి నెగంటి అనే పేరు వచ్చి కాలక్రమేణా యాగంటిగా ప్రసిద్ధి చెందినది అని చెబుతారు.

basavannaఇక ఈ ఆలయంలోని యాగంటి బసవన్న విషయానికి వస్తే, ఆలయం ఎదుట మండపంలో యాగంటి బసవన్న అను పేరుగల ఒక పెద్ద నందివిగ్రహం ఉంది. అయితే 15 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తు, 8 అడుగుల పొడవు గల ఈ నందీశ్వరుడు కూడా స్వయంభు అని తెలియుచున్నది. స్థానికుల కథనం ప్రకారం ఆలయానికి సమీపంలోనే ఒక పెద్ద పొడవైన శిల ఉంది. ఆలయ అధికారులు పనివారితో ఎంతో శ్రమించి దానిని పగుల గొట్టించారు. ప్రొద్దునే వచ్చి చూస్తే ఆ రాయి మరల పెరిగి ఉంది. అలా రెండు మూడు సార్లు జరిగింది. ఇలా మళ్ళీ మళ్ళీ పెగడంతో వారు శివునికి, ఆ రాయికి నమస్కరించి క్షమించమని ప్రార్ధించారు. అప్పుడు ఆ రాయి శాంతించి నంది ఆకారం దాల్చింది.

6 acharyaniki kaliginche roju rojuki perige yaganti basavannaపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన కాలజ్ఞాన తత్వాలలో ‘యాగంటి బసవన్న అంతకు అంతకు పెరిగి కలియుగాంతమున రంకె వేసేనయా’ అని చెప్పారు. నిజంగానే ఈ నంది పరిమాణం రోజు రోజుకి పెరుగుతుంది. భారత పురావస్తు శాఖ కుడి ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

8 acharyaniki kaliginche roju rojuki perige yaganti basavanna