శివుడు దాదాపుగా అన్ని ఆలయాలలో లింగ రూపంలోనే దర్శనమిస్తాడు. అయితే ఇక్కడ వెలసిన శివలింగానికి ఉన్న ఒక విశేషం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎందుకంటే ఈ ఆలయంలో గర్భగుడిలో ఉండే శివలింగం పైన ఎల్లప్పుడూ రాత్రి, పగలు తేడా లేకుండా నీడ పడుతుంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఆలయ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా, పానగల్లు గ్రామానికి తూర్పు దిశయందు 2 కి.మీ. దూరంలో పంటపొలాల్లో శ్రీ ఛాయాసోమేశ్వరాలయం ఉంది. ఛాయాసోమేశ్వరాలయ నిర్మాణం ఒక ఆధ్బుతం అని చెప్పవచ్చును. గర్భగుడిలోని శివలింగం పైన 24 గంటలు ఎల్లప్పుడూ నీడ పడుతుంది. ఈ నీడ ఎలా పడుతుంది అనేది ఎవరికీ అంతు చిక్కని విషయం. ఇది ఎలా సాధ్యం అనేది చరితకారులకు, పరిశోధకులకు, శాస్రవేత్తలకు కూడా అంతుపట్టలేదు. ఈ ప్రాచీన ఆలయానికి ముంది ఒక పెద్ద చెరువు ఉంది. దీనిని ఉదయ సముద్రం అని అంటారు. ఈ చెరువును కుందూరు రాజుల పాలనాకాలంలో ఉదయభానుడు అనే రాజు తవ్వించాడు. అందుచేతనే ఆ చెరువుకు ఉదయ సముద్రమన్న పేరు స్థిరపడింది. ఇది త్రికూట ఆలయంగా మూడు కూటాలతో నిర్మింబడింది. ఇందులో తూర్పు ముఖం కలిగి ఉన్న కూటమిలో ఛాయా సోమేశ్వరుడు, పశ్చిమ ముఖం కలిగి ఉన్న కూటమిలో దత్తాత్రేయుడు, దక్షిణ ముఖం కలిగి ఉన్న కూటమిలో ఈశ్వరుడు మొదలగు దేవతామూర్తులు ప్రతిష్టింప బడి ఉన్నారు. తూర్పు ముఖం కలిగి ఉన్న కూటమిలో ప్రతిష్టింప బడిన ఛాయాసోమేశ్వరుడు నిరంతరం ఎదో ఒక ఛాయతో కప్పబడి ఉంటాడు. తూర్పు ముకంగా ఉన్న గర్భాలయం వెన్నెలకాంతితో కనబడుతుంది. ఉత్తరభాగంలో ఉన్న గర్భాలయంలో ఒక మనిషి నీడ ఏడూ నీడల్లా కనిపిస్తుంది. ఈ ఆలయంలో నిత్యపూజలతో పాటు, కార్తీకమాసం, శివరాత్రి పర్వదినాలలో విశేష పూజలు ఘనంగా జరుపుతారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన శ్రీ ఛాయాసోమేశ్వరాలయానికి స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో వచ్చి గర్భగుడిలో లింగంపైనా పడే నీడని చూసి తరిస్తారు.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.