శివుడి కోసం కఠోర తపస్సు చేస్తే వారి భక్తిని మెచ్చిన శివుడు భక్తులకు కోరిన వరాన్ని ఇస్తాడు. అయితే పరమశివుడిని అన్ని రోగాలు నయం చేసే వైద్యుడిగా కొలిచే ఒక ఆలయం ఉంది. మరి శివుడిని ఎందుకు ఆలా కొలుస్తున్నారు? ఆ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రంలోని, నాగపట్నం జిల్లాలో, వైదీశ్వరన్ కోయిల్ అనే రైల్వేస్తైషన్ కు సమీపంలో వైదీశ్వరన్ ఆలయం ఉంది. ఈ దేవాలయం ఉత్తర తమిళనాడు వారికీ చాలా ముఖ్యమైన పవిత్ర స్థలం. ఈ ఆలయంలోనే స్వామివారిని వైదీశ్వరన్ అని, అమ్మవారిని బాలాంబల్ అని పిలుస్తుంటారు. ఈ ఆలయం చాలా పెద్ద నిర్మాణం. ఇక్కడి శిల్ప సౌందర్యం చాల గొప్పగా ఉంటుంది. తమిళులందరికి శీర్కాలి చాలా పవిత్రమయిన యాత్రా స్థలం. సంబందర్ అనే వాగ్దేయకారుడు ఈ శీర్కాళిలోనే జన్మించాడు. అయన కేవలం పదహారు సవంత్సరాలు మాత్రమే జీవించాడు. అయితే ఈ సంబందర్ పసి పిల్లాడిగా ఉన్నపుడు ఒక రోజు అయన తలితండ్రులు ఆ ఆలయం వద్ద ఉన్న పుషరిణిలో స్థానానికి వచ్చి,పసియావాడిని ఒడ్డున ఒక చోట పడుకోబెట్టి స్నానం చేస్తుండగా పిల్లవాడు విపరీతమైన ఆకలితో ఏడవటం ప్రారంబించాడట.అదే సమయములో ఆకాశ మార్గమున వెళ్తున్న పార్వతి పరమేశ్వరులు పసివాడి ఏడుపు విని కిందకు వచ్చారంటా. అప్పుడు పార్వతీదేవి స్వయంగా ఆ బాలుడికి తన పలు ఇచ్చి ఒక తల్లిగా ఆ పిల్లవాని ఆకలి తీర్చిందంటా. ఆలా ఆ పసివాడు పెరిగి పేదవాడవుతూ,అమిత జ్ఞానవంతుడై,చిన్న తనం నుండే గొప్ప శివ భక్తుడై,శివతత్వాన్ని అందరికి ప్రబోధిస్తూ కేవలం పదగారు సంవత్సరాలు మాత్రమే జీవించి తనువూ చాలించాడట. అయితే ఆ పదహారు సంవత్సరాలలోనే అయన అనేక వేల కీర్తనలు రచించాడు. అంత చిన్న వయసులోనే అయన అంతగొప్ప జ్ఞానాన్ని సంపాదించాడు కనుకే ఆయనను “తిరుజ్ఞాన సంబందర్” అని అంటారు. ఇక ఆలయ స్థల పురాణానికి వస్తే, పూర్వము ఒక ముని తనకు పెద్ద జబ్బు చేయగా,పరమేశ్వరుని గూర్చి భక్తితో తపస్సు చేయగా,శంకరుడు ఒక వైద్యుని రూపములో ప్రత్యక్షమై,అతని జబ్బు నయం చేసాడని స్థల పురాణం తెలియచేస్తుంది. అందువల్ల ఈ ప్రాంతం వారు ఇంట్లో ఎవరికీ ఏ జబ్బు చేసిన ఈ వైదీశ్వరుని ఆలయానికి వచ్చి మొక్కుకుంటశ్రీరాముడు జటాయువు ఇచ్చటనే దహన సంస్కారాలు చేసినట్లు తెలుస్తుంది. అయితే నవగ్రహ దేవతామూర్తులైన బుధుడు, కేతువుకు ఇచట విడివిడిగా ఆలయాలు కన్పించుట ఒక విశేషంగా చెబుతారు. ఇలా ఆది దంపతులైన పార్వతీపరమేశ్వరులు వెలసిన ఈ ఆలయం తమిళనాడులోని ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటిగా విరాజిల్లుతుంది.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.