బసవన్న నందీశ్వరుని అవతారంగా చెబుతారు. ఈయనకు శివుడు అంటే విపరీతమైన భక్తి. అయితే ఎప్పుడు శివుడిని పూజించే ఈ బసవన్న ఎక్కడ జన్మించాడు? అయన ఎవరు? ఇంకా అక్కడ ఉన్న ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రము, బగల్ కోట్ జిల్లా, కృష్ణానది మలప్రభ నదులు సంగమించిన ఆల్మట్టి డ్యాంకు సుమారు 15 కీ.మీ. దూరంలో శ్రీ బసవేశ్వరాలయం ఉంది. ఈ ప్రాంతంలో లింగాయత్ మతం పుట్టి అభివృద్ధి చెందిన పవిత్ర ప్రదేశం. ఈ ప్రదేశాన్నే కప్పడి సంగమ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఆలయం బసవేశ్వరునిది. దీనినే కుడలా సంగమ ఆలయం అని కూడా పిలుస్తారు.ప్రకృతి అందాలతో అలరాలే ఈ కూడలి సంగమ ఆధ్యాత్మిక సుగంధ పరిమళాల్ని కూడా అందిస్తుంది. ఇది మహాశివదీక్షాపరుడు బసవేశ్వరుడు పుట్టిన పుణ్యభూమి. ఈ బసవన్న 12 శతాబ్దంలో అత్యంత కీర్తి గడించిన మహాకవి. అయితే లింగాయత మతాన్ని స్థాపించిన బసవన్న పుణ్యసమాథి ఇక్కడ ఉంది. ఈ సమాధి మందిరాన్ని ఐక్యమడపం అంటారు. ఈ కుడలా సంగమ 12 వ శతాబ్దంలో బసవన బగివాది అనే పేరుతో గొప్పగా విరాజిల్లిన పవిత్ర పుణ్యక్షేత్రం. అయితే 12 వ శతాబ్దంలో జాతవేదముని ఇక్కడ ఒక ఆశ్రమ పాఠశాల నిర్మించాడు. అందులోనే బసవేశ్వరుడు, చిన్న బసవన్న అక్కడ నాగమ్మ విద్యార్థులుగా విద్యనబ్యసించేవారు. బసవేశ్వరుడు తన బాల్యాన్ని అంత ఇక్కడే గడిపాడు. ఈయన పుట్టుకతోనే మహాజ్ఞాని అని పండితుల చేత ప్రశసంలు పొందాడు. ఇతనిని అందరూ నందీశ్వరుని అవతారంగా భావించేవారు. బసవన్నను అందరు నడిచే దైవంగా భావించేవారు. అయన లింగాయత అనబడే వీరశైవ మతాన్ని స్థాపించి, సర్వాంతర్యామి అయినా ఆ పరమేశ్వరునికి అనుచరులుగా, సన్మార్గాలుగా సమస్త ప్రజల్ని నడిపించడమే ద్యేయంగా తలచి తన జీవితాన్ని అంకితం చేసాడు. ఈ ఆలయంలోని శివలింగాన్ని సంగమేశ్వరుడు అని, సంగమనాథ్ అని భక్తులు పిలుస్తారు. ఇంకా ఈ ఆలయం ఎంతో అందంగా గొప్ప నగిషీలతో, అనేక జంతువుల శిల్పాలతో కూడి అధ్బుతంగా నిర్మించబడింది.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.