ప్రతి దేవాలయంలో దేవుడి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం ఉండటం వెనుక ఒక్కో ఆలయంలో ఒక్కో పురాణం ఉంటుంది. అలానే ఇక్కడ వెలసిన అమ్మవారి విగ్రహానికి కూడా ఒక కథ వెలుగులో ఉంది. మరి అమ్మవారు ఇక్కడ ఎలా వెలిశారు? ఏ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడూ తెలుసుకుందాం. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను వేరు చేసే అందమైన సాత్పురా పర్వతశ్రేణుల మధ్య కొలువై ఉన్నది మనుదేవి ఆలయం. ఈ ఆలయంలో ఖందేష్ దేవిమాత కొలుదీరి, భక్తుల మొక్కులు తీర్చుతోంది. ఈ పురాతన ఆలయం మహారాష్ట్ర కు ఈశాన్య దిక్కుగా ఉండే యావల్ ఛోప్రా జాతీయ రహదారి కాసరఖేడ్ అడగాన్ గ్రామానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం చుట్టూ కనువిందు చేసేలా తివాచీ పరిచినట్టుగా కనిపించే పచ్చటి పర్వతశ్రేణులు ఆలయానికి మరింత శోభను కనిపిస్తున్నాయి. ఆలయానికి సమీపంలోని గ్రామాల ప్రజలు ఇక్కడకు వచ్చి ఖందేష్ మాతను దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుని వెళుతుంటారు.ఇక పురాణానికి వస్తే, సాత్పురా పర్వతశ్రేణుల్లోని గ్వాలివదా ప్రాంతానికి క్రీస్తుపూర్వం 1200 కాలంలోఈశ్వర్ సేన్ అనే రాజు పాలిస్తుండేవాడు. ఆయకు అపార పశుసంపద ఉండేది. కొన్ని గోవులు రోజు ప్రస్తుత మహారాష్టల్రోని తపతి నదికి నీరు త్రాగడానికి వెళ్లేవి. మిగిలిన గోవులు మధ్యప్రదేశ్‌లోని నర్మదా నదికి వెళ్లేవి. అయితే ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో మాన్‌మోది అనే భయానక వ్యాధి వ్యాపించసాగింది. ఖాందేశ్ ప్రాంతమంతా ఈ వ్యాధి వ్యాపించింది. దీంతో ఖాందేశ్‌తో పాటు, సాత్పురా పర్వతశ్రేణుల్లో భారీగా పశు ప్రాణనష్టం సంభవించింది. ఈ భయానక వ్యాధి నుంచి రాజ్యాన్ని రక్షిం చేందుకు క్రీస్తుపూ ర్వం 1250 కాలం లో రాజు ఈశ్వర్ సేన్ గ్వాలివదా నుంచి మూడు కిలోమీట ర్ల దూరంలో మను దేవి మాత ఆలయా న్ని నిర్మించారు.అనంతరం గ్వాలివదా కు, ఆలయానికి మధ్యలో ఆయన 13 అడుగుల వెడల్పుతో గోడను నిర్మించారు.
గ్వాలివదాకు మాన్‌మోది వ్యాధి నుంచి, భూతప్రేతాల నుంచి రక్షణ కల్పించేందుకు ఈ ఏర్పాటు చేశారు. మనుదేవి మాత ప్రస్తావనను మనం భగవద్గీతలోనూ చూడవచ్చు. మధుర వెళ్లే ఘట్టంలో సాత్పురా పర్వతశ్రేణుల్లో మనుదేవి మాత ఉంటారని శ్రీకృష్ణుడు చెప్పినట్టు ప్రస్తావన ఉంది. ఈ పురాతన ఆలయంలో ఏడు నుంచి ఎనిమిది బావులు ఉన్నాయి. ఈ ఆలయాన్ని నిర్మించే సమయంలో మనుదేవి, గణేష్, శివలింగం, అన్నపూర్ణ మాత విగ్రహాలు బల్పడ్డాయి. ఆలయం చుట్టూ, ముందు భాగంలోనూ ప్రకృతిశోభాయమానమైన కొండలు ఉన్నాయి. అంతేకాకుండా అదమైన వాటర్‌ఫాల్ కావ్‌తాల్ ఉంది.ఈ ఆలయానికి భక్తులు ఏడాదిలో నాలుగు సార్లు వస్తుంటారు. నవరాత్రి సమయాల్లో భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు. మనుదేవి కృపా కటాక్షాల కోసం దేశం నలుమూలల భక్తులు ఇక్కడకు వచ్చి, తమ మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా మహారాష్టల్రో నూతన దంపతులు ఈ ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా ఉంది. తమ సంసార జీవితం సాఫీగా సాగాలని కొత్త దంపతులు పూజలు చేస్తారు. మహారాష్ట్ర ప్రభుత్వం, సాత్పురా మనుదేవి ఆలయ ట్రస్టు సంయుక్తంగా ఆలయం వరకు రోడ్డు వేశాయి. ఈ రోడ్డు వేయక ముందు దట్టమైన అటవీ ప్రాంతంలో భక్తులు ఆలయానికి కాలిబాటన వచ్చేవారని స్థానికులు చెబుతున్నారు.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.