ఈ ఆలయ గర్భగుడిలో ఉన్న వేణుగోపాల స్వామి విగ్రహం భక్తులని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇంతటి సుందరమైన స్వామి విగ్రహం ఉన్న ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడ స్వామివారి విగ్రహం ఎలా భక్తులకి దర్శనం ఇస్తుంది? ఈ ఆలయంలోని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, చౌడవరం పంచాయితీ పరిధిలోగల జూనం చుండూరు గ్రామంలో సమ్మోహన వేణుగోపాల స్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయంలో నల్లనిరూపుడైన స్వామి విగ్రహం సుమారు ఆరు అడుగులు పొడవు నాలుగు అడుగుల వెడల్పుతో సుందర, సుమనోహరంగా దర్శమిస్తోంది. ఇంకా స్వామి చేతిలో పిల్లనగ్రోవి, అటూ ఇటూ శంఖు, చక్రాలు, కుడిభాగంలో దశావతారాలు, ఎడమ భాగంలో సప్తరుషులు, విగ్రహం కింది భాగంలో ఇరువైపులా ఉభయ దేవేరులైన రుక్మిణీ, సత్యభామలు, గోవులు దర్శనం ఇస్తుంటాయి. అయితే క్రీస్తు పూర్వం అంటే దాదాపు 1500 సం వత్సరాల క్రితం ఈ పురాతన దేవాలయం నిర్మాణమైనట్లు పూర్వీకుల కథనం. దేవాలయంలోని ఈ స్వామిలో ఓ ప్రత్యేకత ఉంది. స్వామి వారి మూలవిరాట్ ప్రణవ స్వరూపం లో ఉండి ఆపై వేణుగోపాలునిగా స్వామిని శిల్పి మలిచారు. దేశంలో మరెక్కడా ఇటు వంటి భంగిమ ఉన్నటువంటి విగ్రహం ఉండన్నది పెద్దల కథనం. ఈ ఆదిప్రణవ స్వరూపంలో చుట్టూ దశావతరాలు, సప్త్తరుషు లు, వేణుగోపాలునికి ఇరుప్రక్కల గోపికల మాదిరి రుక్మిణి, సత్యభామలు గోవులతో కొలువుదీరి ఉంటారు. చూసే వారికి ఈ విగ్రహంలో స్వామివారి పరమార్థం, ఆంతర్యం గోచరించక మానదు. శక్తి మొత్తం ఈ విగ్రహంలోనే వుందనటానికి ఈ నిదర్శనాలు కనిపిస్తున్నాయి. బాదామి చాళుక్యులు, తూర్పు చాళుక్యు ల వంశచరిత్రలో స్వామివారిని వీరు దర్శించుకున్నట్లు తగిన ఆధారాలున్నా యి. కొండవీటి రెడ్డి రాజులైన కొమరిగిరి రెడ్డి వారి సోదరులు పలుమార్లు స్వామి వారిని దర్శించిన ఆధారాలున్నాయి. వీరి ఆస్థాన నర్తకి లకుమాదేవి ఈ స్వామిని ఆరాధ్యదైవంగా కొలించిందట. అప్పుడు గుంటూరు జమిందారులు ఆరోగ్య పరిస్థితులు సరిగాలేని సమయంలో స్వామివారిని దర్శించిన పిమ్మట వారి ఆరోగ్యం కుదుటపడటంతో వీరు స్వామివారి కి కొంత భూమిని దానం చేశారు. ఇప్పటీకీ ఆ భూమి దేవాలయం వారి ఆధీనంలో సాగుబడి జరుగుతోంది. ఈ చరిత్ర మిగిల్చిన సాక్షాలను ఇంకా మద్రాసు వాత్రప్రతుల గ్రంథాలయంలో అక్షర రూపం దాల్చి నిక్షిప్తంగా మిగిలి ఉన్నాయి.ఈ దేవాలయాన్ని ఎప్పుడు ఏరాజులు నిర్మించారో ఇతమిద్ధంగా తెలియనప్పటికీ క్రీస్తుపూర్వం నాటి ఆధారాలవల్ల ఈ దేవాల యాన్ని ఆనాడే నిర్మించే ఉంటారని గ్రంథాలయ ద్వారా స్పష్టమౌతోంది. కొన్ని వేల సంవత్సరాలు గడిచినా నేటికీ స్వామివారి విగ్రహంలో తేజస్సు చెక్కు చెదరక పోవడం విశేషంగా చెప్పుకోవచ్చు.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.