వివాహం కానీ వారు ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరిపిస్తే వెంటనే వివాహం జరుగుతుందని అంటారు ఎందుకు ?

0
3033

ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, అనేక కారణాలతో వివాహానికి ఆలస్యం అవుతున్న అమ్మాయిలు, అబ్బాయిలు ఈ స్వామివారికి కళ్యాణం జరిపిస్తే వెంటనే వారికీ వివాహం జరుగుతుందని భక్తుల నమ్మకం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయం ఎలా వెలసింది? ఈ ఆలయంలో ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

visheshwara aalayamఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, తూర్పు గోదావరి జిల్లా, మురమళ్ళ గ్రామంలో శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వరస్వామి వారి వేంచేసి యున్నారు. మునులు నివసించిన ఈ ప్రాంతాన్ని అప్పట్లో మునిమండలి అని పిలిచేవారు. అది కాలక్రమేణా మురమళ్ళ గా మారింది. దక్షయాగ ఆహ్వానానికి నోచుకోకపోవడంతో వీరావేశానికి లోనెైన పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి పార్వతీదేవి భద్రకాళీ రూపాన్ని ధరించిన పవిత్ర క్షేత్రం మురమళ్ళ.

visheshwara aalayamఇక పురాణానికి వెళితే, దక్షుడు లోక సంరక్షణార్ధం చేస్తున్న ఒక యాగానికి అల్లుడెైన పరమేశ్వరుడిని ఆహ్వానించలేదు. ఈశ్వరుడి భార్య దక్షుడి కుమార్తె అయిన దా క్షాయని తన భర్త అనుమతి పొందకుండా ఆ యాగానికి వెళ్లింది. దక్షుడు అవమానించగా హోమాగ్నిలోకి దూకి ఆత్మాహుతి చేసుకుంది. ఆ తర్వాత కూడా ఆవేశం తగ్గక కోటి సూర్య ప్రకాశంతో తిరిగాడు వీరభద్రుడు. ఆ ఆవేశా నికి భూమి అదిరింది. అక్కడక్కడ కొన్ని ప్రదే శాలు అగ్నికి ఆహుతయ్యాయి. వీరభద్రస్వామి ఆవేశాన్ని తగ్గించే బాధ్యతను తన మరో రూపమైన భద్రకాళికి అప్పగిం చింది పార్వతి. ఇక భద్ర కాళి ఆ ప్రదేశానికి వచ్చింది. ప్రక్కనే వున్న శరభయ్య చెరువులో మునిగి అతిలోక సౌంద ర్యవతిలా కన్యారూపం దాల్చి వీరభద్రుడికి దగ్గరెైంది. ఆమెను చూసిన క్షణమే వీరభద్రస్వామి ఆవేశం కొద్దిగా తగ్గింది. వెంటనే గాంధర్వ వివాహం చేసుకున్నాడు.

visheshwara aalayamఇక ఆలయ నిర్మాణానికి వస్తే, కుమారగిరిని పాలించేవాడు శరభరాజు. ఆ రాజుకు స్వప్నంలో వీరభద్రస్వామి గోదావరి నదిలో తానున్నట్టూ తనను వెలికి తీసి ఆల యం నిర్మించమని ఆజ్ఞాపించాడు. ఆ రాజు తన పరివారంతో గోదావరి నదికి వెళ్లి నదిలో మునిగిపోయివున్న వీరభద్రస్వా మిని వెలికితీసే ప్రయత్నంలో లింగంపెై గున పం తగిలింది. రక్తం స్రవించగా గోదావరి నది ఎరబ్రారిపోయింది. ఆ సమయంలో ఆ కాశవాణి తాను గోదావరి అడుగున వున్నానని బయటికి తీసుకెళ్ళమని పలికింది. రాజు అత ని పరివారము లింగాన్ని వెలికితీశారు. కొంత దూరం తీసుకెళ్ళారు. అంతలో లింగం ఎవ రూ మోయలేనంత బరువు పెరిగిపోయింది. ఆ స్వామికి అదే చోటే సరెైనదని నిర్ణయించు కున్న ఆ రాజు అక్కడే ప్రతిష్ట చేసి ఆలయం నిర్మించారు.

visheshwara aalayamఅప్పటినుండి ఈ స్వామివారికి సాంప్రదాయ పద్ధతి ప్రకారం నిత్యకల్యాణం జరుగుతుంది. అయితే ప్రతి రోజు 27 మంది భక్తుల గోత్ర నామాలతో వారి వారి సంకల్పములతో ఇక్కడ కళ్యణములు ఘనంగా జరిపిస్తున్నారు.

visheshwara aalayam