అధిక బరువు ఆరోగ్యమైన శరీరానికి పెద్ద శత్రువు. అందుకే కాస్త బరువు పెరగగానే దాన్ని తగ్గించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. రకరకాల ఎక్సర్‌సైజ్‌లు చేయడం మొదలు పెడతారు. ఒకటి రెండు రోజులు చేయగానే బద్దకంతోనో, పని ఒత్తిడితోనో మధ్యలోనే మానేస్తుంటారు. దీనివల్ల బరువు తగ్గాలన్న కల.. కలగానే ఉండిపోతుంటుంది. అలా బరువు తగ్గాలని అనుకునే వారి కోసం ఒక టీ చక్కగా ఉపయోగపడుతుంది. వాము, జీలకర్రతో చేసిన ఈ టీని మూడు నెలల పాటు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
మనం నిత్యం వంటకాల్లో ఏదో ఒక రూపంలో జీలకర్రను వినియోగిస్తూనే ఉంటాం. మసాలాలు, వేపుళ్లు, పచ్చళ్లు, రసం, సాంబరు… ఇలా ఎన్నో రకాల వంటకాల్లో జీలకర్రను తప్పకుండా వేస్తాం. ఈ జీలకర్రకు ఉన్న ప్రత్యేకత, మంచి గుణాలు తెలిస్తే… రోజూ దీన్ని ఏదో ఒక రూపంలో మెనూలో చేర్చుతారు. ముఖ్యంగా స్థూలకాయంతో, అధిక బరువుతో బాధపడుతున్నవారు రోజూ చిటికెడు జీలకర్రతో చాలా తక్కువ రోజుల్లోనే పరిష్కారం పొందవచ్చని కొన్ని అధ్యాయనాలు చెబుతున్నాయి.
జీలకర్రలో కేలరీలు చాలా తక్కువ. ఇది చాలా ఫాస్ట్‌గా బరువు తగ్గిస్తుంది. త్వరగా బరువు తగ్గడానికి ప్రతిరోజు జీలకర్ర టీని తాగవచ్చు. వాములో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫెక్టివ్ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. జీలకర్రలోని ఎంజైములు చక్కెరలు, కొవ్వులు కార్బోహైడ్రేట్లను తగ్గిస్తాయి. ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి.
రోజూ ఆహరంలోకి జీలకర్ర తీసుకోవడంతోపాటు, వాటిని జ్యూస్ చేసి తాగడం వలన శరీరంలోని కొవ్వు తగ్గుతుంది. తాజాగా ఓ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెలువడింది. ఆ సంస్థ వారు 80 మంది మహిళలను రెండు గ్రూపులుగా విడదీశారు. అందులో కొంత మంది జీలకర్రను ఉపయోగించగా.. మిగతావారు ఇతర డైట్ కంట్రోల్‌ను వాడారు. ఇందులో ఇతర డైట్ సిస్టంను వాడినవారి కంటే జీలకర్రను వాడినవారు బరువు తగ్గినట్లు తేలింది. దీనిని ఉపయోగించిన వారికి బరువు తగ్గడంతో పాటు.. రక్తం మొత్తం శుభ్రమవుతుంది.
శరీరంపై ఉన్న ముడతలు పోయి యవ్వనంగా కనిపిస్తారు. ఎముకలు బలంగా తయారవుతాయి. కీళ్లు, మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి. గతంలో తీసుకున్న ఆల్లోపతీ మందుల సైడ్ ఎఫెక్ట్‌ను కూడా తగ్గిస్తుంది. దీర్ఘకాలికంగా దగ్గుతో బాధపడుతున్న వారికి ఇది చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. వినికిడి సమస్యలు తగ్గుతాయి. మధుమేహం కూడా నియంత్రణలోకి వస్తుంది.
కంటి చూపు మెరుగవుతుంది. పళ్లు, చిగుళ్లు బలంగా ఆరోగ్యంగా తయారవుతాయి. మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. రక్తప్రసరణ, గుండె పనితీరు మెరుగవుతుంది. దీర్ఘకాలికంగా దగ్గుతో బాధపడుతున్న వారికి ఇది చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. వాము, జీలకర్ర పొడిని మూడు నెలల పాటు ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలు మల, మూత్ర, చెమట ద్వారా బయటకొచ్చేస్తాయి. దీంతో జీర్ణక్రియ సరిగా పనిచేస్తుంది.
మరి ఈ టీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గ్లాస్ నీటిలో అర టీస్పూన్ వాము, ఒక టీస్పూన్ జీలకర్ర వేసి రెండు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఆ నీటిని ఐదు నిమిషాల పాటు మరిగించాలి. వేడి చేసిన నీటిని వడకట్టి నాలుగు చుక్కలు నిమ్మరసం వేసుకుని తాగాలి. రుచి కోసం అల్లం లేదా పుదీనా ఆకులు కూడా కలుపుకోవచ్చు. నిమ్మ రసం రుచి నచ్చకపోతే ఒక టీస్పూన్ తేనె కూడా కలుపుకోవచ్చు.
జీలకర్ర టీ మాత్రమే కాదు జీలకర్రతో చేసిన ఇతర రెమెడీస్ కూడా బరువు తగ్గడంతో సహాయపడతాయి. ఒక టీస్పూన్ జీలకర్రను ఒక టీస్పూన్ పెరుగుతో కలిపాలి. ఆ మిశ్రమాన్ని ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత తినాలి. ఇలా కనీసం 15 రోజులు చేయడం వలన క్రమంగా బరువు తగ్గుతారు. రాత్రి సమయంలో జీలకర్రను నానబెట్టి.. ఉదయాన్నే మరిగించాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని వడకట్టి తాగాలి. అందులో కాస్తా నిమ్మకాయ కలిపి తాగితే రుచి బాగుంటుంది. ఇలా 2 వారాల పాటు చేయడం వలన బరువు తగ్గుతారు.