పురాతన కాలం నాటి ఎన్నో అధ్బుతమైన కట్టడాలు కాలగర్భంలో కలసిపోయాయి. అయితే అప్పటి కట్టడాలు, వారి శిల్ప కళానైపుణ్యం ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఓరుగల్లు ప్రాంతం అంటే వరంగల్ జిల్లాలో కాకతీయుల కళా నైపుణ్యం ప్రపంచ వ్యాప్తంగా అందరిని ఆకట్టుకుంటుంది. ఎందుకంటే ఆ కాలంలో కాకతీయులు ప్రతిదేవాలయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అయితే ఇంతకీ ఆ వనంలో బయటపడ్డ ఆ కట్టడాలు ఏంటి? ఆ ప్రదేశం ఎక్కడ ఉంది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. వరంగల్ జిల్లాకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఖిలా వరంగల్ అని పిలువబడే చారిత్రాత్మక ప్రదేశం ఉంది. అయితే ఖిలావరంగల్‌లోని మట్టికోట ఉత్తర వా యువ్య భూభాగంలోని కోట గర్భంలో కాకతీయుల కాలం నాటి ఆలయాలు లక్ష్మీకొండల గం డి ప్రాంతంలో ఉంది త్రికూటాలయం. చారిత్రక అన్వేషణలో ఖిలావరంగల్ మట్టికోట లక్ష్మీకొండల గండి వద్ద కోట భూగర్భంలో నుంచి సగం బయల్పడింది ఒక త్రికూటాలయం మాత్రమే. కాగా మరొకటి పూర్తిగా కోట గోడలోనే దాగి ఉంది. ఈ రెండు త్రి కూటాలయాలను పూర్థి స్థాయిలో తవ్వి బయటపెట్టలేదు. కాకతీయుల కాలంలో నిర్మించిన ఇలాంటి చారిత్రాత్మక ఆలయాలు. కాలగర్భంలో కలిసిపోయో ప్రమాదం నెలకొంది. అయితే కొందరు ముఠాగా ఏర్పడి గుప్త నిధుల కోసం ఆలయంలోతోపాటు పరిసర ప్రాంతంలో భారీగా త వ్వకాలు జరిపారు. దీంతో ఆ ప్రాంతమంతా శిథిలావస్థకు చేరింది.ప్రస్తుతం ఆలయ సమీపంలో శివలింగం పడి ఉండడం బట్టి చూస్తే అది ఆలయంలో ఉండాల్సిన శివలింగమేనని స్పష్టమవుతోంది. పరిశోధనలో ఆలయం, శివలింగం బయటపడడంతో ఇంకా ఆ ప్రాంతంలోని భూమి పొరలలో మరిన్ని అపూరూప సుందర శిల్పసంపద ఉండే అవకాశం ఉంది. చరిత్రకారుల అభిప్రాయం మేరకు నాటి ఓరుగల్లు కోట మొత్తం ఏడు కోటలతో శ్రీ రామారణ్య పాదుల ఆదేశానుసారం శ్రీచక్రం ఆకారంలో ని ర్మించబడిదని ఈ ఏడుకోటల పరిధిలో దాదాపు వందకుపై ఆలయాలు ఉండేవని ఏకమ్రనాధుని ప్రతాపరుద్రీయం ఆధారంగా చెప్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం కాకతీయులు తమ ముందు చూపుతోనే ఈ విధంగా మట్టి కోటలో శ్రీచక్రం మూలలు వచ్చే విధంగా నిర్మించారు. ఇలా నిర్మించడం వల్లనే భవిష్యత్‌లో దండయాత్రల నుండి ఆలయాన్ని రక్షించే అవకాశం కూడా ఉందని వా రు భావించి ఉంటారు. దానికి ఆధారంగా ఆలయం పైభాగంలో ఒక గోడలాగా నిర్మించి తేలికపాటి ఇటుకల నిర్మాణం మనకు నేటికీ కనిపిస్తుంది. మట్టికోట భూగర్భంలో ఇంకా పదుల సంఖ్యలో ఆలయా లు ఉండే అవకాశం ఉంది. వాటిలో కేవలం మూ డు ఆలయాల ఆనవాళ్లు మాత్రమే బయటకి కనపడుతున్నాయి. వాటిని కావాలనే భూగర్భంలో నిర్మించి ఉంటారు అనడానికి ఎక్కువ అవకాశం ఉంది. కారణం ఈ ఆలయాలు అన్ని కూడా మట్టి కోట ప్రవేశ ద్వారాల సమీపంలో ఉండడం, ఆలయంపైన గోపురం లాంటి నిర్మాణం కాకుండా పొ డవైన రాతి దిమ్మెలు, పెద్ద సైజు ఇటుకలతో గోడ లాంటి నిర్మాణం చేసి ఆ పైన మట్టిపోసి మట్టికోట నిర్మాణం చేశారు. ఈ ఆలయాలకు మరో ప్రత్యేకత ఉంది. ఓరుగల్లు రాతి, మట్టికోటల మధ్యలో సుమారు 17 ఆలయాలు ఉన్నప్పటికీ వాటిలో ఏ ఆలయంలో లేని విధంగా శిల్పాలు ఈ త్రికూటాలయాలలో ఉ న్నాయి. పద్మపు పట్టికలు, హంస పట్టికలు, రంగమటపంలో స్థంభాలపై అందమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. వాలి వధ, గోపికలు, కృష్ణుడు, గజలక్ష్మీ, నరసింహావతారం, వినాయకుడు, కో లాట దృశ్యం ఇంకా మరెన్నో శిల్పాలున్నాయి. గ ర్భాలయం ద్వారా బంధాలపై అందమైన చతర్భుజులైన శైవద్వార పాలక, చామర, గ్రహిణులైన పరిచారక జనాల శిల్పాలున్నాయి. ఇంకా రెండవ త్రికూటాలయం పూర్తిగా భూమిలోనే ఉంది. లోపలకు దిగి చూస్తే ఒక గర్భాలయాన్ని మాత్రమే చూడడానికి వీలుంది. కనిపించిన విగ్రహం వీరభధ్రునిది. కొంచెం చెక్కేసి ఉంది. విగ్రహానికి ఇరువైపుల దేవతగణాలుండడం విశేషం. ఈ మట్టికోట భూభాగంలో మరిన్ని కట్టడాలు బయటపడే అవకాశం ఉందని అంటున్నారు.