Home Health శీతాకాలంలో ఎదురయ్యే అన్నీ సమస్యలకు ఈ ఒక్క లడ్డుతో చెక్ పెట్టేయొచ్చు!

శీతాకాలంలో ఎదురయ్యే అన్నీ సమస్యలకు ఈ ఒక్క లడ్డుతో చెక్ పెట్టేయొచ్చు!

0
చలికాలంలో సాధారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. పెరుగుతున్న చలి వల్ల కొందరికి కండరాలు బిగుసుకుపోవడం, సరిగా ఆహరం తినకపోవడం, తిన్నా సరిగా జీర్ణమవకపోవడం వల్ల రక్తహీనతకు గురి కావడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఈ సమస్య నుండి బయట పడాలంటే కొన్ని ఆహారాలు చక్కగా పని చేస్తాయి. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది నువ్వుల గురించి.
నువ్వులు, జీర్ణశక్తిని పెంచుతాయి. రక్తపోటును అదుపులో ఉంచుతాయి. నువ్వులు ఎముకలను పటిష్ఠపరుస్తాయి. తద్వారా ఎముకలను గుళ్లబార్చే ఆస్టియోఫోరోసిస్ వ్యాధి రాకుండా కాపాడతాయి.  శరీరవ్యవస్ధను నిదానింపచేసే ధయామిన్ -ట్రిప్టోఫాన్ విటమిన్లు ఉంటాయి. ఒంటినోప్పుల్ని తగ్గించి, మనసును ఉత్తేజితం చేసి గాఢ నిద్రకు దోహదం చేసే సెరొటోనిన్ కూడా నువ్వుల్లో ఎక్కువే ఉంటుంది. కేన్సర్ నిరోధకంగా పని చేసే ఫైటిక్ యాసిడ్ – మెగ్నీషియం ఫైటో స్టెరాల్స్ కూడా నువ్వుల్లో ఎక్కువ ఉంటాయి.
ఇక శీతాకాలంలో కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారాలలో ఖర్జురాలు కూడా ఒకటి ఖర్జూరాలను ప్రొటీన్ పవర్ హౌజులు అంటారు. ఖర్జూరాలలో అధికమోతాదులలో కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి. ఖర్జూరాలను తినడం వల్ల, కొలెస్ట్రాల్ తగ్గి గుండె జబ్బులు దూరం అవుతాయి. ఖర్జూరాలు రక్తపోటును నియంత్రిస్తాయి. ఎముకల పటిష్ఠతకు ఉపయోగ పడతాయి. ఉదర సంబంధ వ్యాధులకు ఈ పండ్లు ఉపయోగ పడతాయి. అన్ని రకాల పండ్లలో కంటే,ఖర్జూరాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది.కనుక మలబద్ధకానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది.
అయితే శీతాకాలంలో ఈ రెండింటిని కలిపి తీసుకుంటే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు పొందొచ్చట. ఖర్జురా-నువ్వుల లడ్డులను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం… ఈ చలి కాలంలో ఖర్జురా- నువ్వులతో చేసిన లడ్డులు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రతలలో మార్పులు రావడమే కాదు, సీజనల్ గా వచ్చే జలుబు, పలు రకాల జ్వరాలను తట్టుకునేలా చేస్తుంది. అంతే కాదు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలోని చేడు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి రక్తపోటును అదుపులోకి తెస్తుంది.
ఖర్జురా-నువ్వులలో అధికంగా లభించే కాల్షియం వల్ల ఎముకలు గట్టిపడతాయి. దింతో ఎముకలకు సంబందించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉండదు. వీటిలో లభించే ఫైబర్, ప్రొటీన్ల వల్ల శరీరానికి కావలసిన శక్తికి అందించడమే కాదు, నిద్రలేమి సమస్యలను తొలగిస్తాయి. అంతే కాదు కాన్సర్ కణాలను వృద్ధిచెందకుండా అడ్డుకోవడానికి ఎంతగానో కృషిచేస్తాయి.
స్త్రీలలో నెలసరి వచ్చినప్పుడు ఈ లడ్డులను తీసుకుంటే నీరసం దరిచేరనివ్వదు. అంతేకాదు రక్తహీనత సమస్య రాకుండా ఉంటది. చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. అన్ని రకాల పండ్లలో కంటే, ఖర్జూరాలలో ఫైబర్ అధికంగా లభిస్తుంది, నువ్వులలో ఐరన్, ప్రోటీన్స్, విటమిన్ బి పుష్కలంగా లభిస్తాయి. ఈ రెండిటిని ఒకే రూప ఆహారంగా తీసుకోవడం వల్ల రోజుకొకటి తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు ఎంతో జరుగుతుంది. అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
మరి ఈ ఖర్జుర- నువ్వుల లడ్డులు ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా! ముందుగా ఖర్జూరపండ్లను గింజతీసి పెట్టుకోవాలి. నువ్వులను దోరగా వేయించి పెట్టుకోవాలి. తరువాత ఖర్జూరపండ్లను ,గుప్పెడు గుప్పెడు రోట్లో వేసి మెత్తగా దంచుకోవాలి. గుజ్జును విడిగా పెట్టుకోవాలి. తరువాత నువ్వులను కూడా మెత్తగా రోకలితో దంచుకోవాలి. తరువాత రెండింటినీ కలిపి బాగా కలిసేలా దంచుకోవాలి. తరువాత ముద్దలు కట్టుకోవాలి.
ఇందులో ఎండుకొబ్బెరి, జీడిపప్పు, వేరుశెనగ , వేయించి పొడికొట్టిన తృణధాన్యాలు (రాగులు, సజ్జలు, రొన్నలు, గోధుమలు)వేయించి, పొడుకొట్టిన పప్పుధాన్యాలు(మినుములు, పెసలు, శెనగలు, కందులు) వంటివి కూడా చేర్చుకుని మరింత బలవర్ధక లడ్డును, సంపూర్ణ ఆరోగ్యకర లడ్డును చేసుకోవచ్చు. సువాసన కోసం, యాలకుల పొడిని కలపొచ్చు. ముద్ద కట్టేపుడు సరిగా ముద్దకు రాకపోతే తగినంత తేనె కలిపి ముద్దలు చేసుకోవచ్చు. అన్ని రకాల ఎండు పండ్లను కూడా ఇందులో చేర్చుకోవచ్చు.
నువ్వులు-ఖర్జూరలడ్డులో నూనె చక్కెర కలపనక్కరలేదు. నీరు కలపాల్సిన అవసరం లేదు. పదార్ధాలను ఉడికించాల్సిన అవసరం లేదు. పదార్ధాల్లోని జీవపదార్ధం,సజీవంగా మన శరీరానికి అందుతుంది. పైగా ఎక్కువ కాలం నిలవ ఉంటాయి. రెండు కిలోల ప్రమాణానికి, ముప్పయి లడ్డుల వరకు అవుతాయి. ముప్పయి లడ్డూలంటే,ఒకరికి రోజుకు ఒకటి చొప్పున నెల రోజులకు సరిపోతాయి. వృద్ధులకు, పిల్లలకు దీన్ని అమృతాహారంగా చెప్పొచ్చు.  స్కూలు ఫంక్షన్లలో పిల్లలకు ఆయిల్ స్వీట్స్ కంటే, నువ్వులు-ఖర్జూరలడ్డును చేయించి ఇవ్వడం వల్ల ఎన్నో పోషకాలు అందించవచ్చు.

Exit mobile version