Contributed By: Surya Muttamsetty
స్త్రీ, వనిత, అమ్మాయి, అమ్మ, దేవత, గైయ్యాలి ఇలాంటి ఎన్నో పదాలతో వాళ్ళని పిలుస్తాము, ఇంకా చాలా పదాలతో తిడతాము, పొగుడుతాము కూడా.
మనం ఎన్ని రకాలుగా పిలిచిన, ఎన్ని రకాలుగా తిట్టిన, చాలా మంది అమ్మాయిల జీవితాలు మాత్రం ఒకే రకంగా ఉంటుంది. బేసిక్గా ఈ societyలో అమ్మాయి అంటే especially typical indian orthodox familiesలో అమ్మాయి జీవితం ఒక predefined templateలో ఉంటుంది. అందర్ని ఎదిరించి, ఇండిపెండెంట్ గా ఉండే అమ్మాయిలు తప్ప మిగతా చాలా మంది అమ్మాయిల జీవితాలు ఈ పద్దతి నే ఫాలో అవుతారు.. క్షమించండి.. ఫాలో అయ్యేల చేయిస్తుంది ఈ సమాజం… ఈపాటికే ఆ పద్ధతి ఎంటో మీకు అర్థం అయ్యే ఉంటుంది కానీ మళ్ళీ చెప్తున్న,
పుట్టాలి, పెరగాలి, కుదిరితే చదివించాలి, ఒకడి చేతిలో పెట్టాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళని చదివించాలి, వాళ్ళని పెంచాలి, మెట్టినిల్లుని జాగ్రత్తగా చూసుకోవాలి, పుట్టినిల్లు గౌరవన్నీ పెంచాలి…..
ఇది పెద్దలు నుంచి వస్తుందే, నేను కొత్తగా ఏమి చెప్పలేదు…
మరి ఇలాంటి పద్ధతికి కారణం, మనం ఉన్న ఈ మేల్ dominent society. మన సమాజం లో అమ్మాయి పుట్టగానే తన జీవుతాన్ని ఆపరేట్ చేసే రిమోట్ కంట్రోల్ ని మనం లాగేసుకుంటాం. Ageని బట్టి, ఉన్న placeని బట్టి ఆ remoteని ఒకడు తీసుకుంటాడు.
ఆ అమ్మాయి జీవితం లో ఎం చెయ్యాలి అనుకున్నా, ఆఖరికి ఊరు వెళ్ళాలి అనుకున్న కూడా తాను ఎం చెయ్యాలో చెప్పేవాడు ఒకడు ఉంటాడు, వాడు చెప్పినట్టే ఆ అమ్మాయి ముందుకి వెళ్తుంది. ఆ ఒకడు, తండ్రి కావొచ్చు, భర్త కావొచ్చు, బంధువు కావొచ్చు, అన్న కావొచ్చు, boyfriend కావొచ్చు లేదా మాములు ఫ్రెండ్ కావొచ్చు కానీ ఎవరో ఒకరు మాత్రం కచ్చితంగా ఉంటాడు.
ఆ ఒకడి వాళ్ళ ఆ అమ్మాయి జీవితం, రకరకాలుగా మారుతుంది, అందులో కొన్ని ఇప్పుడు చూద్దాం….
పుట్టింది లక్ష్మి దేవి అని అనుకునేవాడు ఒకడు,
పుట్టింది తల బరువు అని అనుకునేవాడు ఒకడు,
మాటలు నేర్పి, మాట్లాడే దైర్యం ఇచ్చేవాడు ఒకడు,
మాటలు నేర్పి, మాట్లాడితే తప్పు అని చెప్పేవాడు ఒకడు,
కొడుకుతో సరిసమానంగా చూసేవాడు ఒకడు,
కొడుకే ప్రదమం, వాడి తరువైతే నువ్వు అని చూసేవాడు ఒకడు,
బయటకు వెళ్తే జాగ్రత్త అని చెప్పి పంపేవాడు ఒకడు,
భయంతో బయటకి పంపని వాడు ఒకడు,
విధివిధానాలు నచ్చి ప్రేమించేవాడు ఒకడు,
శరీర తత్త్వం నచ్చి ప్రేమించేవాడు మరొకడు,
మనసు తెలుసుకుని పెళ్లి చేసేవాడు ఒకడు,
పరువుని, ఆస్తిని చూసి పెళ్లి చేసేవాడు ఒకడు,
మనసు తెలుసుకుని పెళ్లి చేసుకునేవాడు ఒకడు,
వెనక ఉన్న ఆస్తిని చూసి పెళ్లి చేసుకునేవాడు ఒకడు,
నీకేం తెల్సు, చెప్పింది చెయ్యి అనేవాడు ఒకడు,
నీకు తెల్సు, నచ్చింది చెయ్యి అనేవాడు ఒకడు,
వంటిటికి, పడక గదికి పరిమితం చేసేవాడు ఒకడు,
స్వేచ్ఛ అన్న పేరుతో అన్ని చెయ్యమని చెప్పేవాడు మరొకడు,
పైన ఉన్న అన్ని లైన్స్ లో ఫస్ట్ లైన్ అంతా ఒక అమ్మాయి జీవితం, రెండో లైన్ అంతా ఇంకో అమ్మయి జీవితం అని మీరు అనుకుంటే పొరపాటే, మన సమాజంలో పుట్టిన వెంటనే లక్షి దేవి అనుకుని, ఆస్తి కోసం పెళ్లి చేసిన సందర్భాలు…. ఆడపిల్ల మాట్లాడకూడదు అని, తర్వాత కొండంత ధైర్యం ఇచ్చి నడిపిన సందర్భాలు చాలా ఉన్నాయి… కావాలంటే పేపర్ లో చదవండి, ఆర్థోడాక్స్ ఫామిలీ లో పుట్టిన ఒక అమ్మాయి, అందర్నీ కాదు అని ఎదో సాధించిన సందర్భాలు, గొప్పింట్లో పుట్టిన బిడ్డ, వరకట్నం వల్ల బలి అయిన సందర్భాలు అనేకం. ఇంత జరుగుతున్న అందరిని ఎదిరించి బయటకి వచ్చేసి, తమ కాళ్ళ మీద నెలవాడే వారు చాలా తక్కువ మంది, దానికి మళ్ళీ కారణాలు అనేకం…..
అక్కల్లారా,
మీ జీవితపు రిమోట్ ని మాకు ఇచ్చి,
మేము చెప్పింది విని,
మేము చెప్పిన దానిలో మీకు నచ్చింది చేస్తూ,
మా మేల్ ఇగో ని satisfy చేస్తూ,
ఎల్లప్పుడూ మా బాగోగులు కోరుకునే మీకు,
ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలము….
జ్వరం వచ్చిన, అలుపొచ్చిన,
నోప్పోచ్చిన, సావోచ్చిన,
‘నా’ కుటుంబం అనుకుని,
మా కోసం నిలబడి,
మా పనులను చక్కబెట్టే మీకు…
వందనం, పాదాభివందనం
పద్దతి పేరుతో, మీ స్వేచ్చకి వేసిన సంకెళ్లు…
అమ్మాయివి నీకేం తెలియదు.. ఊరుకో, అని ప్రతిసారి మీ మనోధైర్యనికి తగిలిన దెబ్బలు..
ఉద్యోగం చేసి ఏమి ఉద్దరిస్తావు అన్న మాటలు,
నలుగురిలో వెళ్తుంటే కోరుక్కుని తినేసేలా చూపులు,
ఒకటా, రెండా… దిన దిన గండం నూరేళ్ళు అన్నట్టు
రోజూ ఆటంకాలే, రోజూ ఆవాంతరాలే,
రోజూ ఇన్ని చూస్తూ, మీ జీవితం తో పాటు ఇంకో కుటుంబాన్ని చూసుకుంటున్న వనితలారా…
మీకు జోహార్లు…
ఇప్పుడు కాకపోయినా కొన్ని సంవత్సరాల తర్వాత అయిన ఈ పధ్ధతి మారుతుంది అని కోరుకుంటూ, మారలి అని ప్రయత్నిస్తూ. స్వేచ్ఛ అనే అమృతాన్ని అటు అబ్బాయిలు, ఇటు అమ్మాయిలు సమానంగా స్వీకరించే రోజుకోసం ఎదురుచూస్తూ
– ఒక అల్ప జీవి.
తమ్ముడూ, ఇన్ని చెప్పావు, కొంతమంది అమ్మాయిలు false కేసులు పెడతున్నారు, కుటుంబాల పై దురుసుగా ప్రవర్తిస్తున్నారు, స్వేచ్ఛ అనే పేరుతో మితిమీరి బ్రతుకుతున్నారు, వీటన్నిటి గురించి ఎం అంటావ్ అంటే నా దగ్గర సమాధానం ఒక్కటే,
అయ్యా, మగ జాతి ఆణిముత్యాలు, ఎంత మంది ఎం చేసిన, మనం ముందు మాట్లాడుకున్న అబలలే అధికం. నేను చెప్పింది మన కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవం..
దయుంచి గుర్తించగలరు..