గతించిన పెద్దల ప్రీతి కొరకు తర్పణము, పిండ ప్రదానం చేస్తారు. ఆత్మకి నాశనం లేదు అని భగవద్గీత చెప్తోంది. ఆత్మ మరణించడం లేదా మరలా జన్మించడం ఉండదు. మనలో ఉన్న ఆత్మ దేనివల్ల కూడా నాశనం చేయబడదు. అది శాశ్వతమైనది. ఆత్మ యొక్క ధ్యేయం ముక్తిని లేదా మోక్షాన్ని పొందడమే. శ్రాద్ధ కర్మల వల్ల గతించిన పెద్దల ఆత్మకి శాంతి కలిగి సృష్టి కర్తలో లీనమవ్వడానికి సహాయ పడతాయి.
ఇంట్లోనే కాకుండా బయట ఏదైనా హోటల్ కి వెళ్ళినా కూడా అక్కడ అలాగే ఆహారంలో వెంట్రుకలు కనిపిస్తే అది అశుభానికి సంకేతం అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
చనిపోయిన మన పూర్వీకులు కలలోకి రావడం సహజం. కానీ పదేపదే కలలోకి రావడం వల్ల వారికి తీరని కోరికలు ఏవో మిగిలి ఉన్నాయని సంకేతం. అలాంటి కోరికలను, ఇష్టమైన వస్తువులను ఇతరులకు దానం చేయడం ద్వారా పూర్వీకులు కలలోకి రారు.