Home Health గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా వాడడం దేనికి దారితీస్తుందో తెలుసా?

గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా వాడడం దేనికి దారితీస్తుందో తెలుసా?

0

మహిళలు గర్భం రాకుండా గర్భనిరోధక మాత్రలు వాడుతుంటారు. శృంగారం తరువాత ప్రెగ్నెన్సీ రాకుండా ఇది అడ్డుకుంటుంది. అయితే వీటిని సరైన పద్ధతిలో వాడాల్సి ఉంటుంది. మహిళల రుతుక్రమాన్ని బట్టి ఇవి పని చేస్తాయి. రుతుక్రమాన్ని ఆలస్యం చేయడమో లేక ముందు వచ్చేలా చేయడమో ఇవి చేస్తుంటాయి. ఈ కారణంగానే ఇవి గర్భం రాకుండా అడ్డుకోగలగుతాయి. గర్భనిరోధక మాత్రలు మహిళలకు అవాంఛిత గర్భం గురించిన భయం లేకుండా లైంగిక సుఖాన్ని ఆస్వాదించే అవకాశం అందిస్తాయి.

birth control pillsకానీ ప్రతి వస్తువుకూ మంచి, చెడు అనే రెండు కోణాలు ఉంటాయి. ఏదైనా అతిగా ఉపయోగిచడం కచ్చితంగా నష్టమే కలిగిస్తుందని గ్రహించాలి. ఇలాంటి మందులు వాడిన వారికే.. మల్టిపుల్ సిరోసిస్ అనే వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని ఇటీవలే ఓ పరిశోధనలో తెలియజేశారు. ఈమందులు కారణంగా నాడీవ్యవస్థలో నరాల మీద ఉండే రక్షణ పొర నాశనమై కండరాలు బలహీనంగా మారుతాయి. ఈ మాత్రలు ఎక్కువగా వాడిన మహిళల్లో ఎంఎస్ రిస్క్ 50 శాతం ఎక్కువగా ఉందని వెల్లడైంది. ఊబకాయం ఉన్న స్త్రీలలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇందుకు కారణం వారిలో ఆకలిని పెంచే హోర్మోన్స్ ఎక్కువగా విడుదల కావడమే.

కేంద్రియ నాడీవ్యవస్థలోని నరాల చుట్టూ రక్షణగా ఉండే మైలీన్ అనే ఫైబర్ డామేజ్ అవడం వలనే ఈ వ్యాధి వస్తుంది. దాంతో శరీరంలోని వ్యాధినిరోధక వ్యవస్థ దానిమీద అదే దాడి చేసుకుంటుంది. ఫలితంగా శరీరం నెమ్మదిగా నెమ్మదిగా మొద్దుబారినట్టవుతుంది. కండరాలు బలహీనమవుతాయి. కంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు పెరిగాక వైకల్యం బారిన పడతారని స్పష్టం చేశారు. గర్భనిరోధక మాత్రల వలన వికారం లేదా వాంతులు, తలనొప్పి, డిప్రెషన్‌తో కూడా బాధపడుతున్నారని ఇటీవలి అధ్యయనంలో వెల్లడైంది.

కొంతమంది మహిళల్లో పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం లేదా పీరియడ్స్ పెరిగిన వ్యవధి వంటి సమస్యలు కూడా కనిపించాయి. వైద్య నిపుణుల ప్రకారం.. 25-45 ఏండ్ల వయసు లోపు మహిళలు ఈ మాత్రలు వాడకూడదు. కౌమారదశలో ఉన్నవారు పదే పదే ఉపయోగిస్తే.. అవి వారి పునరుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. హార్మోన్ల స్థాయిలు లేని యువతులు ఈ మాత్రలు తీసుకోవడం కూడా ప్రమాదకరమని గుర్తుంచుకోవాలి. కొంతమంది మహిళల్లో బరువు పెరగడానికి కూడా ఈ మాత్రలు కారణమవుతున్నాయని తేలింది.

10 ఏండ్లకు పైగా వీటిని తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం 60 శాతం పెరుగుతుందని పలు పరిశోధనలు హెచ్చరించాయి. గర్భనిరోధక మాత్రలు గర్భాశయం కంటే ఫెలోపియన్ ను ప్రభావితం చేస్తాయి. ఇది అంతర్గత రక్తస్రావం కలిగిస్తుంది.
కుటుంబంలో రక్తం గడ్డకట్టిన చరిత్ర ఉన్నవారు మాత్రలు తీసుకోకూడదు. అధిక రక్తపోటు, గుండె సమస్యలతో బాధపడే వారు కూడా వాడవద్దు. ఇప్పటికే ఊబకాయం, మధుమేహంతో బాధపడుతున్నవారు, ధూమపానం అలవాటున్న మహిళలు గర్భనిరోధక మాత్రలను అస్సలు ఉపయోగించకూడదు.

గర్భనిరోధక మాత్రలు వేసుకునే మహిళలు కొన్ని సూచనలు తప్పక పాటించాలి. పొగతాగే అలవాటు ఉంటే తక్షణం మానివేయాలి. మద్యం తాగే అలవాటు ఉన్నా ఆపివేయాలి. శరీరానికి సరైన మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు అందేలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. డైట్‌లో విటమిన్లు ఉండే ఆహారంతో పాటు ఫోలిక్ యాసిడ్ ఉండే పదార్థాలను తీసుకోవాలి. ఒత్తిడి ఎక్కువగా పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి.

Exit mobile version