Home Unknown facts బలరాముడు బీముడిని చంపాలని ఎందుకు అనుకున్నాడు ?

బలరాముడు బీముడిని చంపాలని ఎందుకు అనుకున్నాడు ?

0

బలరాముడు వసుదేవుని కుమారుడు, శ్రీకృష్ణుడి సోదరుడు. మహాభారతంలో భీముడికి, దుర్యోధనుడికి గదా యుద్ధం నేర్పించిన గురువు బలరాముడు. మరి బలరాముడు బీముడిని చంపాలని ఎందుకు అనుకున్నాడనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Balarama Wanted To Kill Bheema

దుర్యోధనుడికి, భీముడికి యుద్ధం జరుగుతుండగా, అర్జునుడు శ్రీకృష్ణుడితో, ఇద్దరిలో ఎవరు గొప్ప? ఎవరికీ ఎలాంటి గుణాలు ఉన్నాయని అడుగగా, అప్పుడు శ్రీకృష్ణుడు, బలరాముడు ఇద్దరికీ సమానమైన శిక్షణే ఇచ్చాడు. భీముడు మహాభారత యుద్ధంలో మొత్తం 11 అక్షౌహిణుల సైన్యం ఉండగా అందులో 6 అక్షౌహిణుల సైన్యాన్ని ఒక్క భీముడే సంహరించాడు. భీముడు ముష్టి యుద్ధం చేసి ఎంతో బలవంతులుగా చెప్పుకునే రాక్షసులను మట్టుబెట్టాడు. బకాసురుడు, జరాసంధుడు, కీచకుడు, హిడింబాసురుడు వంటి రాక్షసులను సంహరించాడు.

ఇక దుర్యోధనుడు గదా యుద్ధంలో మంచి ప్రావిణ్యం ఉన్నవాడు. భీముడు న్యాయంగా యుద్ధం చేస్తే గెలువలేడు, జూదం ఆడుతున్న సమయంలోనే భీముడు, దుర్యోధనుడి తొడలను విరిచి చంపుతాను అని ప్రతిజ్ఞ చేసాడు కదా, అది ఇప్పుడు పూర్తి చేయవలసిన సమయం వచ్చింది. మాయావి అయినా దుర్యోధనుడిని మాయతోనే చంపాలి. ఇప్పుడు కనుక భీముడు న్యాయంగా వెళ్లి గదా యుద్ధం చేస్తే దుర్యోధనుడు రాజు అవుతాడు అని చెబుతాడు.

ఇక దుర్యోధనుడికి, భీముడికి భీకర యుద్ధం జరుగుతుండగా, యుద్ధం చేస్తున్న భీముడిని చూసి తొడలు చూపిస్తూ సంకేతాన్ని ఇవ్వడంతో భీముడు తన గదతో దుర్యోధనుడి తొడలపై గట్టిగ బాదడంతో ఒక్కసారిగా దుర్యోధనుడు కుప్పకూలుతాడు. అది చుసిన బలరాముడు ఒక్కసారిగా పట్టరానంత కోపంతో భీముడిపైకి వెళ్లి, గదా యుద్ధంలో నాభి కింది భాగంలో కొట్టకూడదనే నియమాన్ని ఉల్లఘించి నన్ను అవమానానికి గురి చేసావు అంటూ భీముడి పైకి దాడి చేయడానికి కోపంతో వెళ్లగా, అప్పుడు శ్రీకృష్ణుడు బలరాముడికి ఆపి, మైత్రేయ మహర్షి అడవిలో పాండవులు పడే కష్టాలను చూసి దుర్యోధనుడికి దగ్గరికి వెళ్లి పాండవులతో వైరం విరమించుకోమని చెప్పగా అప్పుడు దుర్యోధనుడు తన తొడలను కొడుతూ ఆ మహర్షి ని అవమానించడంతో, భీముడి గదా ని తొడలను బద్దలు కొడుతుందని శపిస్తాడు. అంతేకాకుండా సభలో భీముడు కూడా దుర్యోధనుడి తొడలను విరిచి చంపుతాను అని ప్రతిజ్ఞ చేసాడు. క్షత్రియుడైన వాడికి ప్రతిజ్ఞా పరిపాలనం అతిధర్మం.

క్షత్రియుడైన భీముడు వీటి అన్నిటికరణంగా వైరాన్ని ప్రతిజ్ఞ ని తీర్చుకోవడం తగినదే అని బలరాముడికి చెప్పి అతని కోపాన్ని తగ్గించగా, బలరాముడు అయోధ్యకి బయలుదేరుతాడు.

Exit mobile version