కరోనా సెకండ్ వేవ్ చాలా భయానకమైన పరిస్థితులను సృష్టిస్తోంది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ వైరస్ లక్షణాల్లో కూడా అనేక మార్పులు వచ్చినట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు కరోనా సెకండ్ వేవ్ రోగులలో జ్వరం, దగ్గు, నాలుకకు రుచి తెలియకపోవడం, ముక్కు వాసన కోల్పోవడం వంటి లక్షణాలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఇప్పుడు మరో లక్షణం బయటపడి ప్రజలను వణికిస్తోంది.
తాజాగా కరోనా సోకిన వ్యక్తుల గొంతులో మార్పులు వస్తున్నాయని తేలింది. సాధారణంగా మనలో గొంతులో వాతావరణం బట్టి కొంచెం మార్పులు వస్తుంటాయి. దాన్ని పెద్దగా పట్టించుకోము. కానీ గొంతు బొంగురుగా రావడం, పెద్దగా సౌండ్ రావడం, గొంతులో పిచ్ కలిగి ఉన్నట్టు అనిపిస్తే అవి కరోనా లక్షణాలే అని నిపుణులు చెబుతున్నారు.
ఎందుకంటే కోవిద్-19 మహమ్మారి కోశ వ్యవస్థలోని కణజాలలను ప్రభావితం చేస్తుందని, స్వరపేటికపై ఎక్కువ ప్రభావం చూపుతుందని ఈ కారణంగానే గొంతులో మార్పులు వస్తాయని వివరించారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి వీరవిహారం చేస్తున్న ఈ సమయంలో ఏ చిన్న లక్షణం కనిపించిన అనుమానించాల్సిందే, జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఒకవేళ మీ గొంతులో అలాంటి లక్షణాలు ఏవైనా కనిపిస్తే ఇంట్లో వారికి వీలైనంత దూరంగా ఉండాలి. ఇంట్లో ఉన్న సమయంలోనూ మాస్క్ ధరించాలి.
అలాగే వేసవి కాలం అని చల్లని పదార్థాలను తినకండి. ఎల్లప్పుడూ వేడి చేసుకుని చల్లారిన తర్వాత లేదా వెచ్చగా ఉండే నీటిని తాగండి. అనునిత్యం మీ గొంతును హైడ్రేటెడ్ అంటే తడిగా ఉండేలా చూసుకోవాలి. గొంతు నొప్పిని తగ్గించేందుకు హెర్బల్ ట్రీట్మెంట్ కూడా ప్రయత్నించొచ్చు.
అయితే వాతావరణం బట్టి కూడా మన గొంతులో సాధారణంగా కొంత మార్పులు జరుగుతుంటాయి. కాబట్టి గొంతుకు సంబంధించిన సమస్యలన్నీ కరోనా లక్షణాలు కాదని, గొంతు ఎప్పుడైతే రఫ్ గా అనిపిస్తుందో అప్పుడు మాత్రం తప్పకుండా పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. టెస్ట్ రిజల్ట్స్ ని బట్టి వైద్యుల సలహాలు తీసుకోని తగిన డైట్ తీసుకోవాలి.