చర్మ సమస్యలు,జుట్టు సమస్యలతో బాధపడనివారు ఈ రోజుల్లో అసలు ఉండరేమో. మన పూర్వీకుల కాలంలో ఎలాంటి క్రీములు, ఆయిల్స్ రాయకున్నా.. వాళ్లు అందంగా.. ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ.. మన దగ్గరకు వచ్చేసరికి.. రకరకాల సమస్యలు వేధిస్తున్నాయి. ఎంత కాస్ట్లీ క్రీమ్ రాసినా.. ముఖంపై మచ్చలు, మొటిమలు రావడం లాంటివి జరుగుతున్నాయి. జుట్టు కూడా చిన్న వయసులోనే తెల్లపడటం, కుప్పలు కుప్పలుగా రాలడం లాంటివి జరుగుతున్నాయి.
అయితే మనం చర్మం గురించి తీసుకునే సంరక్షణలో సగం కూడా జుట్టుకోసం తీసుకోవడం లేదు. బయటకు వెళ్ళినప్పుడు చర్మం కోసం సన్ స్క్రీన్ లోషన్,లేదా స్కార్ఫ్ వంటివి వాడుతుంటాం. కానీ జుట్టుకు ఎటువంటి రక్షణ లేకపోవడం వలన దుమ్ము ధూళి చేరి చుండ్రు వంటి సమస్యలు మొదలయి జుట్టు రాలిపోతుంది. ఈ సమస్య నుంచి బయటపడి జుట్టు అందంగా కనపడాలంటే ఒకటే పరిష్కారమని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
బాదం నూనె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో న్యూట్రీషియన్స్ మరియు విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. బ్యూటీని రెట్టింపు చేసే గుణాలు బాదం నూనె లో ఉన్నాయి. చర్మ సంరక్షణ కోసం దీనిని ఉపయోగించడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇది చాలా ఎఫెక్టివ్ గా చర్మానికి, జుట్టు సమస్యలు కి సహాయం చేస్తుంది. చర్మం పై ఉండే మొటిమలు, మచ్చలు, చుండ్రు, డార్క్ సర్కిల్స్ వంటి వాటిని బాదం నూనె తరిమికొడుతుంది.
మనలో చాలా మంది రోజూ బాదం పప్పు తింటూనే ఉంటారు. కేవలం బాదం పప్పు తినడమే కాదు.. ఆ బాదం నూనె తరచూ వాడటం వల్ల అందంగా మెరిసిపోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ నానపెట్టిన బాదం పప్పు తినడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టురాలే సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా.. బాదం నూనెని తరచూ జుట్టు కుదుళ్లకు రాసి.. మర్థన చేయడం వల్ల కుదుళ్లు బలపడతాయి.
బాదం నూనెను శతాబ్దాలుగా ఆయుర్వేద ఔషధాలలో పొడి జుట్టు, చుండ్రు వంటి సమస్యలకు చికిత్స చేయడానికి కూడా ఉపయోగిస్తారు. తలపై నేరుగా బాదం నూనెను రుద్దడం వల్ల ఆ ప్రాంతానికి రక్త ప్రవాహం పెరుగుతుంది. తలపై చర్మానికి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. బాదం నూనెను ప్రతిరోజూ మాడుకు, వెంట్రుకలకు పట్టిస్తే జుట్టు మెరిసిపోతుంది. జుట్టు రాలడం కూడా తగ్గిపోతుంది.
బాదం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. చుండ్రు సమస్యతో బాధపడేవారు… ప్రతిరోజూ బాదం నూనెతో తలకు మర్థన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. అలానే చిట్లిన జుట్టుకు కూడా ఇది బాగా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. బాదం నూనె జుట్టుకు అప్లై చేయడం వలన జుట్టును తేమగా ఉంచడంతో పాటు బలమైన కుదుళ్ళను పొందవచ్చు.
ఈ నూనెలో అధిక స్థాయిలో ప్రోటీన్, ఒమేగా -9 ఫ్యాటీ యాసిడ్స్ మరియు విటమిన్ ఇతో సహా అనేక వైద్యగుణాలు ఆరోగ్య లక్షణాల కోసం బాదం నూనె విలువైనది. అయితే తీపి బాదం నూనె జుట్టు ఉత్పత్తిని పెంచడానికి ఎక్కువగా ఉపయోగించబడుతుంది. స్వీట్ బాదం నూనె జుట్టు ఆరోగ్యంగా కనిపించడానికి కూడా సహకరిస్తుంది. బాదం నూనె తలమీద కణాలను పునరుద్ధరణ చేస్తుంది. ఇది జుట్టులోని పోషకాల ఖాళీలను పురిస్తుంది. ఇది మీ జుట్టును మృదువుగా చేస్తుంది. బాదం నూనె జుట్టును బలంగా తయారు చేసి స్ప్లిట్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. బాదం నూనెలో విటమిన్ ఇ అధిక మొత్తంలో ఉంటుంది, ఇది సహజంగా దొరికే యాంటీఆక్సిడెంట్. యాంటీఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించి, జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది.