Home Health ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని తెలిస్తే సొరకాయ జ్యూస్ తాగకుండా ఉండలేరు!

ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని తెలిస్తే సొరకాయ జ్యూస్ తాగకుండా ఉండలేరు!

0
bottle gourd juice uses

మనిషి మనుగడ మొదలైన తొలినాళ్ళ లోనే పరిచయమైన అతి ప్రాచీన కూరగాయ సొరకాయ. ఇది పుట్టింది ఆఫ్రికాలో అని చెప్పినప్పటికీ, క్రీస్తుపూర్వము 11,000 – 13000 సంవత్సరాల మధ్య పెరూలో తొలిసారి సొరకాయ సాగు జరిగిందని పురాతత్వ శాస్త్రవేత్తలు అంటున్నారు. వేదకాలం నుంచి వాడుకలో ఉన్నదని చెప్పబడే సొరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సొరకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. మన శరీరంలోని అధిక వేడిని బయటకు పంపి మనకు మేలు చేస్తుంది. దీనిలో దాదాపు 96 శాతం నీళ్లు ఉంటాయి.

సొరకాయలో విటమిన్ సి, విటమిన్ బి, సోడియం, ఐరన్, జింక్, పొటాషియం వంటి విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. యాంటి ఆక్సిడెంట్స్ అధికంగా ఉండడం వల్ల కణాలు డ్యామేజ్ అవకుండా ఉంటాయి. ఒక కప్పు సొరకాయ జ్యూస్ ద్వారా 26 మిల్లీ గ్రాముల విటమిన్ సీ ని పొందవచ్చు. అయితే ఈ సొరకాయని కూర, స్వీట్స్, వంటివి చేయడానికి ఉపయోగిస్తారు.. కానీ సొరకాయ జ్యూస్ తో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

ఒక కప్పు సొరకాయ జ్యూస్ ద్వారా 26 ఎమ్ జీ విటమిన్ సి పొందవచ్చు. యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల.. కణాలు డ్యామేజ్ అవకుండా అడ్డుకుంటాయి. ఈ న్యాచురల్ జ్యూస్ ఆకలిని తగ్గిస్తుంది. మెటబాలిజంను మెరుగుపరుస్తుంది. సొరకాయలో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. క్యాలరీలు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. కాబట్టి.. దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే.. తేలికగా బరువు తగ్గవచ్చు. వండినా, రసం రూపంలో తీసుకున్నా సరే సొరకాయ అన్ని రకాలుగా ఆరోగ్యానికి ఆలంబనగా ఉంటుంది. ఉన్న బరువు కాపాడుకోవాలన్నా, తగ్గాలనుకున్నవారికి సొరకాయ ఎంతగానో సహాయపడుతుంది. సొరకాయ, శరీరంలోని క్యాలరీలను అతి సులభంగా తగ్గిస్తుంది .

గుండె పనితీరును మెరుగుపరుస్తుంది సొరకాయ. దీనిలో జింక్ ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెజర్‌ని కంట్రోల్ చేసి గుండె ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. సొరకాయ జ్యూస్ రక్త ప్రసరణ సజావుగా జరగడానికి సహాయపడుతుంది. స్ట్రెస్‌, ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుంది. నరాలను రిలాక్స్ చేసి ప్రశాంతతను కలిగిస్తుంది.

ఈ న్యాచురల్ జ్యూస్ లో యాసిడ్ లెవెల్స్ మెరుగుపరిచి.. జీర్ణక్రియ మెరుగుపరిచే గుణాలుంటాయి. దీనివల్ల ఎసిడిటీ, కాన్ట్పిపేషన్ వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ సొరకాయలో 92శాతం నీరు ఉండటం వల్ల, తిన్న ఆహానం మరింత శక్తివంతంగా తేలికగా జీర్ణం అవ్వడానికి బాగా సహాయపడుతుంది. ఈ వెజిటేబుల్ ను భోజనంతో పాటు తీసుకోవడం వల్ల, జీర్ణ క్రియ మరింత వేగవంతం అవుతుంది. తీవ్రమైన అతిసార, మధుమేహం ఉన్నవారికి కూడా సొరకాయ బాగా పనిచేస్తుంది. శరీరం అధిక మోతాదులో సోడియం నష్టపోకుండా చూస్తుంది.

ఈ న్యాచురల్ డ్రింక్ డ్యూరెటిక్ గా పనిచేస్తుంది. దీంతో యూరినరీ ఇన్ఫెక్షన్స్ ని చాలా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది. యూరిన్ లో ఉండే యాసిడ్ కంటెంట్ ని న్యూట్రలైజ్ చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.సొరకాయలో డ్యురెటిక్ నేచర్ ఉంటుంది. ఇది.. మలినాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. అలాగే.. అమ్మాయిల్లో యూరినరీ సమస్యలకు చెక్ పెడుతుంది. ప్రతిరోజు తినే ఆహారంతో పాటు ఒక గ్లాసు సొరకాయ రసంలో ఒక చెంచా నిమ్మరసం కలిపి తీసుకుంటే యూరినరీ సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

రోజూ ఉదయం పూట సొరకాయ జ్యూస్ తాగితే.. అది మీ ముఖానికి సహజకాంతితో మెరిసిపోయేలా చేస్తుందట. సొరకాయ జ్యూస్ శరీరజీవక్రియల్ని శుద్ధి చేస్తుంది. దీనివల్ల చర్మం మీదున్న మురికి, కాలుష్యం వదిలిపోతాయి. జిడ్డు కంట్రోల్ లో ఉంటుంది. దీనివల్ల మొటిమల సమస్య దూరమవుతుంది. ఉదయాన్నే సొరకాయ జ్యూస్ తాగడం వల్ల వయసు మీదపడే లక్షణాల్ని కనిపించకుండా చేస్తుంది. జుట్టు బాటా ఊడిపోతూ, బట్టతల లక్షణాలు కనిపిస్తున్నట్లైతే ఈ సొరకాయ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుందట.

మరి ఇన్ని తెలుసుకున్నప్పుడు ఈ జ్యూస్ ఎలా చేయాలో తెలుసుకోకపోతే ఎలా? చాలా సింపుల్…అర గ్లాసు సొరకాయ జ్యూస్‌లో రెండు టేబుల్ స్పూన్ల అల్లం రసం కలపాలి. ఈ రెండూ బాగా కలిపి తాగాలి. ఈ జ్యూస్‌ను ప్రతిరోజూ ఉదయం అల్పాహారానికి ముందు తాగాలి. కనీసం 6 వారాల పాటు ఈ జ్యూస్ తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.

Exit mobile version