ఆరోగ్యం విషయంలో ఇప్పుడు దాదాపుగా అందరికి అవగాహన పెరిగింది. అందువల్ల వారి వారి ఆరోగ్య పరిస్థితుల రీత్యా చాలామంది రాత్రిపూట చపాతీలు తింటున్నారు. ఇవి రాత్రి ఎక్కువగా చేసుకుంటే ఉదయాన్నే ఏం చేయాలో తెలియక పారేస్తుంటారు. కానీ, ఇకనుంచి అలా చేయకుండా ఉదయాన్నే వీటిని బ్రేక్‌ఫాస్ట్‌లా తీసుకోవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు ఈ రోటీలను తమ డైట్‌లో చేర్చుకోవడం వల్ల అద్భుత ప్రయోజనాలున్నాయట. షుగర్ వస్తే ఎన్నో సమస్యలు. ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఆకలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉదయాన్నే ఏదైనా తినాలి. ఇలాంటప్పుడు రాత్రి చేసిన చపాతీలను ఎంచక్కా ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లా తింటే చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు.
రాత్రి చేసిన చపాతీల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఉదయాన్నే వీటిని టీ లేదా ఏదైనా మంచి సలాడ్, కర్రీతో తీసుకోవడం వల్ల షుగర్ పేషెంట్స్‌కి మేలు జరుగుతుందని చెబుతున్నారు. రాత్రి చేసిన చపాతీలు.. ఉదయం కాగానే పోషకాలు లేకుండా ఏం మారిపోవని వాటిలోని పోషకాలు అలానే ఉంటాయనీ.. అందుకే వాటిని తీసుకోవచ్చని చెబుతున్నారు.
హైబీపీతో బాధపడేవారు ఈ చపాతీలను 10నిమిషాలపాటు గోరువెచ్చని పాలల్లో నానబెట్టి తినడం వల్ల సమస్య అదుపులోకి వస్తుంది. జీర్ణసమస్యలు, ACDT, కడుపు ఉబ్బరం సమస్యలతో బాధపడేవారు రోజూ రాత్రి పడుకునేముందు పాలల్లో చపాతీలను నానబెట్టి ఉదయం తినడం వల్ల అలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. రాత్రి చేసిన చపాతీలను ఉదయాన్నే ఇలా పాలల్లో నానబెట్టి తినడం వల్ల షుగర్ వ్యాధి కంట్రోల్ అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.