ఇంగువ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే పురాతన కాలం నుంచి ఇంగువ భారతీయ వంటకాల్లో భాగమైంది. ఆహారంలో కాస్తంత ఇంగువను జోడిస్తే…ఆ టేస్టే వేరుగా ఉంటుంది. అంతేకాదు ఇంగును ఎన్నో రకాల రోగాలకు మంచి ఔషధంగా ఉపయోగిస్తారు. పురాతన కాలంలో మహిళలు వంధ్యత్వాన్ని నివారించేందుకు వేడి నీటిలో చిటికెడు ఇంగువను కలుపుకుని తాగేవారు.