Home Health ఓట్స్ తినడం వలన లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయా ?

ఓట్స్ తినడం వలన లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయా ?

0

అధిక బరువుతో భాధపడేవారు అన్ని రకాల ఫుడ్ డైట్ ను ఫాలో అవుతుంటారు. హెల్త్ కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా బరువు తగ్గించుకోవాలనుకునేవారికి ముందుగా గుర్తుకు వచ్చేది ఓట్స్. అన్ని సూపర్ మార్కెట్లలో ఇవి అందుబాటులో వుంటాయి.

Oatsఓట్స్ మన దేశానికి చెందిన పంట కాదు. అయినా మన దేశంలో వీటికి మంచి ఆదరణ ఉంది. దీనికి కారణం ఇందులో ఉన్న పోషక విలువలు. పైగా తయారు చేసుకోవడం సులభం. ఓట్స్ సులభంగా జీర్ణం అవుతాయి. కొవ్వును తగ్గించి ఇన్సులిన్ లెవల్‌ను కూడా పెంచుతుంది.

కానీ కొన్ని రకాల ఓట్స్ ప్యాకెట్లలో వివిధ పదార్థాల ఎసెన్స్ కలపడంతో అదనపు కేలరీలు వచ్చే అవకాశం వుందంటున్నారు నిపుణులు. ఓట్స్, వోట్మీల్ తినడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కానీ వీటిని తినడం వల్ల ఒక వ్యక్తికి రోజూ అవసరమైన పోషకాలు అందవు.

వోట్మీల్ ఆహారం చాలా తక్కువ కేలరీల ఆహారం. ఇది ప్రతి ఒక్కరికీ సురక్షితం కాదు. బరువు తగ్గాలని చాలామంది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఓట్స్ తీసుకుంటే మరే ఇతర పదార్థాలను తీసుకోరు. ఇలాంటివారికి బరువు తగ్గే సమస్య అటుంచి కొత్త సమస్యలు తలెత్తవచ్చు. అందువల్ల దీర్ఘకాలిక బరువు తగ్గడానికి ఓట్స్ సిఫారసు చేయబడలేదు.

ఆస్తమా నుంచి క్యాన్సర్ వరకు పలు అనారోగ్యాలకు ఓట్స్‌తో చెక్ పెట్టవచ్చు. ఆరోగ్యకరమైన జీవితం కోసం ఓట్స్ ఒక ఔషధంలా పని చేస్తుంది

Exit mobile version